Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌తదేశం మరియు తైవాన్‌ ల విమాన సేవ‌ల ఒప్పందం పై సంత‌కాల‌కు మంత్రిమండ‌లి ఆమోదం


భార‌తదేశం మ‌రియు తైవాన్‌ ల మ‌ధ్య విమాన సేవ‌ల ఒప్పందం పై సంత‌కాల‌కు మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. తైపీ (తైవాన్ లోని భార‌తీయ ప్రాతినిధ్య కార్యాల‌యం)లో ఇండియా – తైపీ అసోసియేష‌న్ కు మ‌రియు భార‌త దేశం (ఇండియా లోని తైవాన్ ప్రాతినిధ్య కార్యాల‌యం)లో తైపీ ఎక‌నామిక్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లకు మధ్య ఈ ఒప్పందం పై సంత‌కాలు జ‌రిగాయి.

ప్ర‌స్తుతం భార‌తదేశానికి, తైవాన్ కు మ‌ధ్య లాంఛ‌నప్రాయ విమాన సేవ‌ల ఒప్పందమేదీ లేదు. ఎయిర్ ఇండియా చార్ట‌ర్స్‌ లిమిటెడ్ (ఎ ఐ ఆర్ ఎల్) మ‌రియు తైవాన్ ఎయిర్ లైన్స్ అసోసియేష‌న్స్ (టి ఎ ఎ) లు ఆదాన ప్రదానం చేసుకున్న ఒక ఎమ్ ఒ యు కు అనుగుణంగా విమాన స‌ర్వీసులు నడుస్తున్నాయి.

విమాన సేవ‌ల ఒప్పందం భార‌తదేశం మ‌రియు తైవాన్ ల పౌర విమాన‌యాన సంబంధాల‌లో ఒక ముఖ్య‌మైన మైలురాయి వంటిది. ఈ రెండు దేశాల మ‌ధ్య వ్యాపారం, పెట్టుబ‌డులు, ప‌ర్యాటకం ఇంకా సాంస్కృతిక సంబంధాలను మ‌రింత పెంచి పోషించే సత్తా దీనికి ఉందని భావిస్తున్నారు.