Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిశస్ సర్వోన్నత న్యాయస్థానం నూత‌న భ‌వ‌నం ప్రారంభోత్స‌వం సంద‌ర్భం లో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం


రిప‌బ్లిక్ ఆఫ్ మారిశస్ ప్ర‌ధాని, గౌర‌వ‌నీయులు ప్ర‌వింద్ కుమార్ జగన్నాథ్ గారు, మారిశస్ కు చెందిన సీనియ‌ర్ మంత్రులు మరియు ఇత‌ర ఉన్నతాధికారులు, విశిష్ట అతిథులారా,  న‌మ‌స్కారం, బోం స్వా.

మీ అంద‌రికి నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌ లు.  అన్నిటి కంటే ముందు గా, మారిష‌స్ ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు కోవిడ్-19 విశ్వమారి ని స‌మ‌ర్థం గా ఎదుర్కొంటున్నందుకు మారిశస్ ప్రభుత్వానికి మరియు మారిశస్ ప్రజల కు ఇవే నా అభినంద‌న‌ లు.  స‌కాలం లో ఔషధాల ను సరఫరా చేయడం, ఇంకా త‌న అనుభ‌వాల‌ ను పంచుకోవ‌డం ద్వారా కృషి కి దన్ను గా భారతదేశం నిలువగలిగినందుకు నాకు సంతోషం గా ఉంది.

మిత్రులారా, ఈ రోజు న మ‌నం భారతదేశం మరియు మారిశస్ మ‌ధ్య గల ప్ర‌త్యేక స్నేహం లో మ‌రో మైలురాయి వంటి కీల‌క ఉత్స‌వాన్ని జ‌రుపుకొంటున్నాము. పోర్ట్ లుయిస్ లోని నూతన సుప్రీం కోర్టు భ‌వ‌నం, మ‌న మధ్య‌ స‌హ‌కారాని కి, మ‌న ఉమ్మ‌డి విలువ‌ల‌ కు గుర్తు గా ఉంటుంది. భారతదేశం, మారిశస్ లు త‌మ ప్ర‌జాస్వామిక వ్య‌వ‌స్థ‌ ల ప్ర‌ధాన స్తంభాలు గా, స్వ‌తంత్ర న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌ ను గౌర‌విస్తాయి.  అద్భుత‌మైన ఈ నూత‌న భ‌వ‌నం యొక్క ఆధునిక రూపురేఖ లు, నిర్మాణం ఈ గౌర‌వాని కి సూచిక‌ గా నిలుస్తాయి.  ఈ ప్రాజెక్టు నిర్ణీత స‌మ‌యం లో, ముందు అంచ‌నా వేసిన వ్యయ ప‌రిమితి లోనే పూర్తి కావడం నాకు సంతోషాన్ని ఇస్తున్నది.

ప్ర‌ధాని జగన్నాథ్ గారు, కొద్ది నెల‌ల క్రిత‌మే మ‌నం, ప్ర‌తిష్ఠాత్మ‌క మెట్రో ప్రాజెక్టు ను , అత్య‌ధునాత‌న ఆసుపత్రి ని సంయుక్తంగా  ప్రారంభించాము.  ఈ రెండు ప్రాజెక్టులూ  మారిశస్ ప్ర‌జ‌ల‌ కు ఎంతో ఉప‌యోగ‌క‌రం గా ఉన్నాయ‌ని తెలిసి సంతోషం గా ఉంది.

మిత్రులారా, భార‌త‌దేశం యొక్క ‘సాగ‌ర్’ (ఎస్‌ఎజిఎఆర్‌- సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫార్ ఆల్ ఇన్ ద రీజియ‌న్ ) ను గురించి నేను మొద‌టి సారి గా మారిశస్ లోనే మాట్లాడాను.  ఎందుకంటే, హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతం లో భార‌త విధానానికి మారిశస్ కీల‌కం గా ఉంది.  మరి ఈ రోజు న, అభివృద్ధి కై భారతదేశం అనుసరిస్తున్న భాగ‌స్వామ్యాల లోనూ మారిశస్ కేంద్ర స్థానం లో ఉంది.

మిత్రులారా, మ‌హాత్మ గాంధీ చాలా చక్క గా చెప్పిన ఒక మాట‌ ను నేను ఇక్క‌డ ఉట్టంకిస్తాను : అది ఏమిటంటే.. నేను యావత్తు ప్ర‌పంచాన్ని దృష్టి లో పెట్టుకొని ఆలోచించాల‌నుకొంటున్నాను. నా యొక్క దేశ‌భ‌క్తి లో యావత్తు మాన‌వాళి కి కూడాను మంచి జ‌ర‌గాలి అనే భావన మిళితమై ఉంది.  అందువ‌ల్ల, నేను భార‌త‌దేశాని కి నేను చేసే సేవ‌ లో  మాన‌వ జాతి కి సేవ చేయ‌డం అనేది కలిసివుంది.. అనేదే.  భార‌తదేశాని కి దిశానిర్దేశం చేస్తున్న తాత్విక‌త‌ ఇదే.  భార‌త‌దేశం అభివృద్ధి చెందాల‌ని తాను కోరుకొంటున్నది; ఇంకా, ఇత‌ర దేశాల కు వాటి అభివృద్ది సంబంధి అవ‌స‌రాల‌ లో స‌హాయాన్ని అందించాల‌ని కూడా భారతదేశం భావిస్తున్న‌ది.

మిత్రులారా,  అభివృద్ధి కై భారతదేశం అనుసరిస్తున్న విధానం లో మానవులు కేంద్ర స్థానం లో ఉన్నారు.  మేము మాన‌వాళి సంక్షేమానికి పాటుప‌డాల‌ని కొరుకొంటాము.  అభివృద్ధి కోసం భాగ‌స్వామ్యాల ను ఏర్పరచుకొనే పేరు తో, ఇత‌రుల‌ పై ఆధార‌ప‌డే భాగ‌స్వామ్యాలను అనుసరించక తప్పని స్థితి లోకి దేశాలు వెళ్ళిపోయినట్టు చ‌రిత్ర మనకు చాటిచెప్పింది.  ఈ పోకడ వ‌ల‌స‌వాద హయాము కు మరియు సామ్రాజ్య‌వాద ఏలుబడుల కు తావునిచ్చింది.  ఈ ధోరణి అంత‌ర్జాతీయం గా శక్తి కేంద్రాలు తలెత్తడానికి తోడ్పడింది.  దీని తాలూకు నష్టాన్ని మాన‌వాళి భరించవలసివచ్చింది.

మిత్రులారా, భారతదేశం వైవిధ్యం తో కూడిన, గౌర‌వం తో కూడిన, భవిష్యత్తు పట్ల శ్రద్ధ తో కూడిన మరియు సతత వికాసానికి తావున్న అభివృద్ధి సంబంధిత భాగ‌స్వామ్యాల‌ ను ఏర్పరచుకొంటున్న‌ది.

మిత్రులారా, మ‌న భాగ‌స్వాముల‌ను గౌర‌వించాలి అనేది భార‌త‌దేశానికి, అభివృద్ధి సంబంధి స‌హ‌కారం లో అత్యంత ప్రాథమిక సూత్రం గా ఉన్నది. అభివృద్ధి పాఠాల ను ఇతరుల తో కలలసి పంచుకోవడం ఒక్కటే మాకు ప్రేరణనిస్తున్నది.  అందుకనే మా యొక్క అభివృద్ధి సంబంధి సహకారం ఎటువంటి ష‌ర‌తుల‌ తో ముడిపడి లేదు.  అది రాజ‌కీయపరమైన ఆలోచన విధానాల ద్వారా గాని లేదా వాణిజ్య ప‌ర‌మైన ఆలోచన విధానాల ద్వారా గాని ప్రభావితం కాకుండా ఉన్నది.

మిత్రులారా, భార‌త‌దేశ అభివృద్ధి సంబంధి భాగ‌స్వామ్యాలు వైవిధ్యభరితమైనవి.  ఇవి వాణిజ్యం నుండి సంస్కృతి వ‌ర‌కు, ఇంధ‌నం నుండి ఇంజీనియరింగ్ వ‌ర‌కు, ఆరోగ్యం నుండి గృహ‌నిర్మాణం వ‌ర‌కు, ఐటి నుండి మౌలిక స‌దుపాయాల వ‌ర‌కు  , క్రీడ‌ల‌ నుండి విజ్ఞానశాస్త్రం వ‌ర‌కు, భారతదేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల‌ తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ది. అఫ్గానిస్తాన్ లోని పార్లమెంటు భవనం నిర్మాణం లో సహాయం చేసే గౌరవం  భారతదేశానికి లభించింది.  నైజర్ లో మహాత్మ గాంధీ కన్వెన్శన్ సెంటర్ నిర్మాణం తో సంబంధం కలిగి ఉన్నదుకు కూడా భారతదేశానికి గర్వకారకం గా ఉన్నది.  ఒక అత్యవసర మరియు ట్రామ ఆసుపత్రి నిర్మాణం ద్వారా నేపాల్ తన ఆరోగ్య సేవల ను మెరుగుపరచుకోవడం లో  స‌హాయపడినందుకు మేము సంతోషించాము.  అదే మాదిరి గా అత్యవసర ఎమ్బ్యులన్స్ సేవల ను తన 9 ప్రావిన్సుల‌న్నిటి లోను నెలకొల్పుకొనేందుకు శ్రీ లంక చేసిన కృషి కి మద్దతిచ్చే విశేషాధికారం సైతం మాకు దక్కింది.

నేపాల్ తో కలసి మేము అమలుపరుస్తున్న  చ‌మురు గొట్టపుమార్గం పరియోజన  పెట్రోలియం ఉత్ప‌త్తుల లభ్యత కు పూచీపడుతుండటం మాకు హర్షకారకం గా ఉన్నది.  మరి అదేవిధం గా, మాల్దీవుల‌కు చెందిన 34 ద్వీపాల‌ కు మంచినీటి ని అందుబాటు లోకి తేవ‌డం తో పాటు పారి‌శుధ్యాని కి కూడాను మా వంతు గా తోడ్పాటు ను అందిస్తున్నందుకు మేము ఆనందిస్తున్నాము.  స్టేడియమ్ లను, ఇతర సదుపాయాల ను నిర్మించడం లో సాయం చేయడం ద్వారా అఫ్గానిస్తాన్‌, ఇంకా గుయానా ల వంటి దేశాల లో క్రికెట్‌ కు లోకప్రియత్వాన్ని సంతరించడానికి మేము ప్ర‌య‌త్నించాము.

అఫ్గానిస్తాన్ కు చెందిన నవ యువకుల తో కూడిన క్రికెట్ జట్టు భారతదేశం లో శిక్ష‌ణ పొంది బ‌ల‌మైన జ‌ట్టు గా ఎద‌గ‌డాన్ని చూసుకొని మేము ఉత్సాహితులం అవుతున్నాము.  మాల్దీవుల క్రికెట్ క్రీడాకారుల ప్ర‌తిభ‌ కు ప‌దును పెట్ట‌డానికి మేము ప్రస్తుతం అటువంటి మ‌ద్ద‌తు నే అందిస్తున్నాము.  శ్రీ‌ లంక‌ లో ఓ ప్ర‌ధాన గృహ నిర్మాణ పరియోజన లో భారతదేశం అగ్ర భాగాన నిలవడాన్ని మేము గొప్ప గ‌ర్వ‌కార‌ణం గా భావిస్తున్నాము.  మా అభివృద్ది సంబంధి భాగ‌స్వామ్యాలు మా భాగ‌స్వామ్య దేశాల యొక్క అభివృద్ధి ప్రాథమ్యాల‌ ను ప్ర‌తిబింబిస్తున్నాయి.

మిత్రులారా,  మీ యొక్క వ‌ర్త‌మానాన్ని సంబాళించుకోవడం లో స‌హ‌క‌రించడం అనే ఒక్క అంశం లో మాత్రమే భారతదేశం గ‌ర్వపడటం లేదు.  మీ యొక్క యువ‌త‌ కు ఒక ఉత్తమమైన భ‌విష్య‌త్తు ను క‌ల్పించేందుకుగాను మీకు సాయపడడం అనేది మా సౌభాగ్యం అని మేము భావిస్తున్నాము.  అందుకే  మా అభివృద్ధి సంబంధి స‌హ‌కారం లో శిక్ష‌ణ‌ మరియు నైపుణ్యాలు అనేవి అత్యంత కీల‌క‌ంగా ఉన్నాయి.  అవి మన భాగ‌స్వామ్య దేశాల లోని యువ‌తీయువకుల ను స్వయంసమృద్ధిపరులు గా మరియు భవిష్యత్తు ను నూతన శిఖ‌రాల‌ వైపునకు నడిపించడానికి అధిక విశ్వాసం తొణికిసలాడే విధం గా తీర్చిదిద్దుతాయి.

మిత్రులారా, భ‌విష్య‌త్తు సతత అభివృద్ధి దే అని చెప్పాలి.  మాన‌వుల అవ‌స‌రాలు, ఆకాంక్ష‌ లు మ‌న స‌హ‌జ ప‌రిస‌రాల‌ తో విభేదించేవి గా ఉండ‌కూడదు.  ఈ కారణం గానే మాన‌వ సాధికారిత‌ ను, ప‌ర్యావ‌ర‌ణం పరంగా  శ్ర‌ద్ధ ను మేము విశ్వసిస్తాము.  ఈ తాత్విక‌త ఆధారం గా, భారతదేశం అంత‌ర్జాతీయ సౌర కూట‌మి వంటి నూతన సంస్థ‌ల ను పెంచి పోషించేందుకు పాటుపడింది.  సూర్య కిర‌ణాలు మాన‌వ పురోగ‌తి ప్ర‌స్థానాన్ని ప్రకాశవంతం చేయుగాక‌.  మేము ఒక బలమైనటువంటి కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విషయం లోనూ శ్రమిస్తున్నాము.  ఈ రెండు కార్యక్రమాలు కూడాను ద్వీప దేశాల‌ కయితే ఒక ప్ర‌త్యేక ప్రాసంగికత ను కలిగివున్న కార్యక్రమాలే. ఈ ప్రయాసల ను ప్ర‌పంచ దేశాలు సమర్ధిస్తున్న తీరు ఉత్సాహపరచేది గా ఉన్నది.

మిత్రులారా, నేనుఏయే విలువల ను గురించి అయితే ప్ర‌స్తావించానో అవి అన్నీ కూడాను మారిశస్‌ తో మాకు గల ప్ర‌త్యేక భాగస్వామ్యం లో మిళితమై ఉన్నాయి.  మారిశస్‌ తో మేము ఒక్క హిందూ మ‌హాస‌ముద్ర జ‌లాల‌ను మాత్ర‌మే పంచుకోవడం లేదు; మేము మారిశస్ తో బంధుత్వం, సంస్కృతి మరియు భాష ల‌ పరం గా ఒక ఉమ్మడి వారసత్వాన్ని కూడాను పంచుకొంటున్నాము.  మా మైత్రి గతించిన కాలాన్నుండి తన శక్తి ని  పొందుతూ మరి భ‌విష్య‌త్తుకేసి దృష్టి ని సారిస్తున్న‌ది.  మారిశస్ ప్ర‌జ‌ల కార్యసిద్ధుల‌ ను చూసి భార‌త‌దేశం గ‌ర్విస్తున్నది.  పవిత్రమైన ఆప్ర‌వాసీ ఘాట్  యొక్క స‌న్న‌ని మెట్ల దారుల నుండి మారిశస్ లోని ఈ యొక్క ఆధునికమైన భంనాన్ని నిర్మించడం వ‌ర‌కు చూసినట్లయితే మారిశస్ తన యొక్క సాఫల్య చరిత్ర ను కఠోర శ్రమ మరియు నవీన ఆవిష్క‌ర‌ణ‌ల‌ ద్వారా రచించుకొన్నది.  మారిశస్ యొక్క స్ఫూర్తి ప్రేర‌ణాత్మ‌కం.  రాబోయే సంవ‌త్స‌రాల‌ లో మ‌న భాగ‌స్వామ్యం మ‌రింత ఉన్న‌త శిఖరాల కు చేరుకోవడం పూర్వ నిర్దిష్టమై ఉన్నది.

వివ్ లామితే ఎంత్ర్ లాంద్ ఎ మోరిస్
భారత్ అవుర్ మారిశస్ మైత్రి అమర్ రహే.

భారతదేశం- మారిశస్ మైత్రి చిరకాలం వర్ధిల్లు గాక.

మీకు అనేకానేక ధన్యవాదములు.
**