Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ నుండి ఆర్ధిక సహాయ సౌకర్యం కోసం కేంద్రీయ రంగ పథకానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


 

క్రొత్త దేశవ్యాప్త కేంద్రీయ రంగ పథకమైన ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ ఏర్పాటు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ పథకం వడ్డీ లో (ప్రభుత్వ) ఆర్థిక సహాయం [ఇంటరెస్ట్ సబ్ వెన్శన్..ఐఎస్] మాధ్యమం, ఇంకా ధన రూపేణా సహాయం మాధ్యమం ల ద్వారా పంట అనంతరం మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం మరియు సాముదాయిక వ్యవసాయ సంపత్తుల కోసం ఆచరణీయ ప్రాజెక్టుల లో పెట్టుబడుల ను పెట్టడానికి మధ్యకాలిక- దీర్ఘకాలిక పరపతి సదుపాయాన్ని సమకూర్చుతుంది.

ఈ పథకం లో, ఒక లక్ష కోట్ల రూపాయల ను బ్యాంకు లు మరియు ఆర్ధిక సంస్థ లు రుణాల రూపం లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్) కు, మార్కెటింగ్ సహకార సంఘాల కు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ ల (ఎఫ్ పిఒ స్) కు, స్వయం సహాయక సమూహాల (ఎస్ హెచ్ జి) కు, రైతుల కు, జాయింట్ లయబలిటీ గ్రూపు ల (జెఎల్ జి) కి, బహుళ ప్రయోజక సహకార సంఘాల కు, వ్యవసాయ నవపారిశ్రామికుల కు, స్టార్ట్- అప్ ల కు, అగ్రిగేశన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ కు, సెంట్రల్ / స్టేట్ ఏజెన్సీ లేదా స్థానిక సంస్థ మద్దతిచ్చినటువంటి ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య ప్రాజెక్టుల కు సమకూర్చుతాయి. 

రుణాల ను- మొదట వర్తమాన ఆర్థిక సంవత్సరం లో 10,000 కోట్ల రూపాయల ను, తదనంతరం మూడు ఆర్ధిక సంవత్సరాల లో ప్రతి ఒక్క ఏడాది 30,000 కోట్ల రూపాయల చొప్పున- నాలుగు సంవత్సరాల లో ఇవ్వడం జరుగుతుంది.   

ఈ ఆర్థిక సహాయ సదుపాయం లో భాగం గా ఉన్న అన్ని రుణాల కు సంవత్సరానికి 3 శాతం మేర 2 కోట్ల రూపాయల పరిమితి వరకు వడ్డీ లో రాయితీ ని ఇవ్వడం జరుగుతుంది.  ఈ రాయితీ గరిష్ఠం గా 7 సంవత్సరాల వరకు అందుబాటు లో ఉంటుంది.  దీనితో పాటు, సూక్ష్మ మరియు లఘు సంస్థల కు రుణ హామీ నిధి ట్రస్టు (సి.జి.టి.ఎమ్.ఎస్.ఈ) పథకం కింద 2 కోట్ల రూపాయల  రుణం వరకు ఈ ఆర్ధిక రుణ సౌకర్యం నుండి అర్హత కలిగిన రుణ స్వీకర్తల కు క్రెడిట్ గ్యారంటీ కవరేజ్ కూడా అందుబాటు లో ఉంటుంది.  ఈ కవరేజ్ కోసం రుసుము ను ప్రభుత్వం చెల్లిస్తుంది.  ఎఫ్ పిఒ ల విషయానికి వస్తే, వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ (డిఎసిఎఫ్ డబ్ల్యు) యొక్క ఎఫ్ పిఒ అభివృద్ధి పథకం కింద సృష్టించబడిన సౌకర్యం నుండి క్రెడిట్ హామీ ని పొందవచ్చును.

భారత ప్రభుత్వం నుండి బడ్జెటు ద్వారా సహాయం రూపం లో మొత్తం అవుట్ ‌ఫ్లో 10,736 కోట్ల రూపాయలు గా ఉంటుంది :

ఈ ఆర్ధిక సహాయాన్ని తిరిగి చెల్లించడానికి లభించే అప్పు నిలుపుదల అవధి కనీసం గా 6 నెలలు మరియు గరిష్ఠం గా 2 సంవత్సరాలు ఉండవచ్చును.  

వ్యవసాయ మరియు వ్యవసాయ ప్రోసెసింగ్- ఆధారిత కార్యకలాపాల కు సాధారణ రుణాల ను అందించడం ద్వారా ఈ ప్రాజెక్టు గ్రామీణ ప్రాంతాల లో అనేక ఉద్యోగ అవకాశాల ను కల్పించే అవకాశం ఉంది.

ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి నిర్వహణ మరియు పర్యవేక్షణ ఆన్‌లైన్ మేనిజ్‌మంట్ ఇన్ ఫర్ మేశన్ సిస్టమ్ (ఎమ్ఐఎస్) ప్లాట్‌ ఫార్మ్ ద్వారా జరుగుతాయి.  ఈ ఫండ్ కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అన్ని సంస్థల కు ఇది వీలు కల్పిస్తుంది.  ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ బహుళ బ్యాంకు లు అందించే వడ్డీ రేట్ల లో పారదర్శకత్వం, వడ్డీ రాయితీ, ఇంకా క్రెడిట్ గ్యారెంటీ తో కూడిన పథకం యొక్క వివరణ, అతి తక్కువ దస్తావేజు ల సమర్పణ సౌలభ్యం, శీఘ్రగతి న ఆమోదం ప్రక్రియ ల తో పాటు ఇతర పథక ప్రయోజనాల తో ఏకీకరణ వంటి ప్రయోజనాన్ని కూడా అందజేస్తుంది.

వాస్తవ కాల ప్రాతిపదిక న పర్యవేక్షణ మరియు ప్రభావశీలమైనటువంటి ప్రతిస్పందన లు అందేటట్టు గా పూచీ పడడం కోసం జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయుల లో పర్యవేక్షణ సంఘాల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఈ పథకం యొక్క కాలపరిమితి 2020 ఆర్ధిక సంవత్సరం నుండి 2029 ఆర్ధిక సంవత్సరం వరకు (10 సంవత్సరాలు) ఉంటుంది.