Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఆత్మ నిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి ‘ఆత్మ నిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ నుండి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ‘ఆత్మ నిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్’ ను ప్రారంభించారు.  ఈ అభియాన్ లో భాగం గా, ప్రవాసీ  శ్రామికుల కు ఉద్యోగ అవకాశాల ను కల్పించడం తో పాటు స్థానిక నవపారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కోవిడ్-19 విశ్వమారి కారణం గా దాపురించిన కష్టాల ను అధిగమించడం లో ప్రతి ఒక్కరు సమర్థులుల అవుతారు అన్నారు.  ఒక టీకామందు ను కనుగొననంత వరకు ‘దో గజ్ దూరీ’ని (ఒక మనిషి కి మరొక మనిషి కి మధ్య రెండు గజాల ఎడం ను) పాటించడం, ముఖాన్ని మాస్క్ తో కప్పుకోవడం అనేవే అన్నింటి కంటే మేలైనటువంటి ముందుజాగ్రత్త లు అని ఆయన అన్నారు. 
 
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విపత్తు ను ఒక అవకాశం గా మలచుకొన్న పద్ధతి పట్ల, ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి ప్రబలుతున్నటువంటి కాలం లో ప్రజలు నడుచుకొంటున్న తీరు పట్ల ప్రధాన మంత్రి సంతృప్తి ని వ్యక్తం చేశారు.  ‘ఆత్మ నిర్భర్ ఉత్తర్ ప్రదేశ్ రోజ్ గార్ అభియాన్’ నుండి ఇతర రాష్ట్రాలు కూడా బోలెడంత నేర్చుకొంటాయని, మరి దీని నుండి అవి ప్రేరణ ను కూడా పొందుతాయి అని ఆయన అన్నారు. 

ప్రపంచం లో కరోనా ఒక పెను సంకటం గా రూపుదాల్చగా, ఉత్తర్ ప్రదేశ్ ప్రదర్శించిన సాహసాన్ని మరియు వివేచన ను ప్రధాన మంత్రి కొనియాడారు.  రాష్ట్రం సఫలత ను సాధించిన తీరు, ఇంకా స్థితి ని అది సంబాళించిన విధానం ఇంతకు ముందు ఎన్నడూ జరగని విధం గాను, ప్రశంసాయోగ్యం గాను ఉన్నాయి అని ఆయన అన్నారు.

యుపి లో వైద్యులు, అర్థచికిత్స సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ఎఎస్ హెచ్ఎ లు, ఆంగన్ వాడీ కార్యకర్త లు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, రవాణా సేవ లు మరియు శ్రామికుల తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.

వందలాది శ్రామిక్ ఎక్స్ ప్రెస్ ట్రయిన్స్ సదుపాయాన్ని కల్పించి, రాష్ట్రాని కి చెందిన ప్రవాసీ శ్రామికుల ను వెనుకకు తీసుకు రావడం కోసం యుపి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.

గడచిన కొన్ని వారాల వ్యవధి లో దేశ వ్యాప్తం గా 30 లక్షల మంది కి పైగా ప్రవాసీ శ్రామికులు యుపి లోని వారి యొక్క గ్రామాల కు తిరిగి వచ్చారని ఆయన అన్నారు. 

యుపి ముఖ్యమంత్రి పరిస్థితి యొక్క గంభీరత ను అర్థం చేసుకొన్నారని, మరి ఆయన యొక్క ప్రభుత్వం ఈ స్థితి లో యుద్ధ ప్రాతిపదిక న పనిచేసిందని ప్రధాన మంత్రి అన్నారు.

పేద లు పస్తులు ఉండకుండా పూచీ పడడం లో అసాధారణమైన కృషి ని చేసిన యుపి ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి ప్రస్తుతించారు.  పేదల కు మరియు ప్రవాసీ శ్రామికుల కు ఉచితం గా ఆహారాన్ని అందించేందుకు యుపి ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన అండ తో సరి అయిన కాలం లో ప్రతిస్పందించిందని ఆయన అన్నారు.  రేశన్ కార్డులంటూ లేని వారి కి సైతం ఈ సదుపాయాన్ని సమకూర్చడమైంది.  దీనికి తోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని 75 లక్షల మంది పేద మహిళ ల జన్ ధన్ ఖాతాల లోకి
దాదాపు 5,000 కోట్ల రూపాయలు కూడా నేరు గా బదలాయించడమైందని ఆయన అన్నారు. 

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ లో వలెనే  భారతదేశాన్ని స్వయంసమృద్ధ పథం లోకి శీఘ్రం గా తోడ్కొని వెళ్లే ప్రచార ఉద్యమం లో కూడాను ఉత్తర్ ప్రదేశ్ అగ్రణిగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ లో భాగం గా, శ్రామికుల ఆదాయాన్ని అధికం చేయడం కోసం పల్లెల్లో అనేక పనుల ను ఆరంభించడం జరుగుతోంది అని ఆయన తెలిపారు.  దీనిలో దాదాపు గా 60 లక్షల మంది ప్రజల కు గ్రామీణ అభివృద్ధి తో ముడిపడిన పథకాల లో భాగం గా ఎమ్ఎస్ఎమ్ఇ లలో ఉపాధి ని ఇవ్వడం జరుగుతోందని ఆయన చెప్పారు.   దీనికి అదనం గా, వేలాది ప్రజల కు స్వతంత్రోపాధి కల్పన కై ముద్ర యోజన లో భాగం గా 10,000 కోట్ల రూపాయల ను కేటాయించడమైందని ఆయన అన్నారు. 
 
దేశం అంతటా అటువంటి స్థానిక ఉత్పత్తుల ను ప్రోత్సహించడం కోసం ఆత్మ నిర్భర్ రోజ్ గార్ అభియాన్ లో భాగం గా పరిశ్రమ ల సమూహాల ను ఏర్పాటు చేస్తుండడం వల్ల యుపి ఎంతగానో లాభపడుతుంది అని శ్రీ మోదీ అన్నారు. 

వ్యవసాయ రంగం లో ఇటీవల ప్రకటించబడిన సంస్కరణల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించి, ఈ సంస్కరణల లో భాగం గా చట్టం తాలూకు వేరువేరు బంధనాల నుండి రైతుల ను విముక్తం చేయడమైందన్నారు.  ప్రస్తుతం రైతు లు వారి దిగుబడుల ను భారతదేశం లో ఎక్కడైనా విక్రయించుకొనే స్వతంత్రాన్ని పొందారని, అలాగే రైతు పంట ను విత్తే వేళలోనే తన ధర ను సైతం నిర్ధారించుకోవచ్చన్నారు.   

మన పశుగణం కోసం అనేక నూతన నిర్ణయాల ను తీసుకోవడం జరుగుతున్నదని ప్రధాన మంత్రి తెలిపారు.  పశుసంపద మరియు పాడి రంగం కోసమని 15,000 కోట్ల రూపాయల తో ఒక ప్రత్యేక మౌలిక సదుపాయాల నిధి ని ఏర్పాటు చేయడమైందన్నారు. 

కుశీనగర్ విమానాశ్రయాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయం గా ప్రకటించిన సంగతి ని సైతం ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది బౌద్ధ వలయాన్ని ప్రోత్సహించే విషయం లో ప్రముఖ పాత్ర ను పోషిస్తుందన్నారు.  ఇది పూర్వాంచల్ లో వాయు సంధానాన్ని బలోపేతం చేయగలుగుతుందని మరియు దేశ విదేశాల లో కోట్ల సంఖ్య లో ఉన్న మహాత్మ బుద్ధుని యొక్క భక్తజనం సులభం గా యుపి కి చేరుకోగలుగుతారని ఆయన అన్నారు. 

కేవలం మూడు సంవత్సరాల లో, పేదల కోసం 30 లక్షల కు పైగా పక్కా ఇళ్ల ను నిర్మించడమైందని, యుపి ని ఆరుబయలు ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన నుండి విముక్తమైనట్లు ప్రకటించడం జరిగిందని, యుపి ప్రభుత్వం పారదర్శకమైన పద్ధతి లో 3 లక్షల మంది యువతీయువకుల కు ప్రభుత్వ ఉద్యోగాల ను  ఇచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు. 

 రాష్ట్రం లో శిశు మరణాల రేటు ను తగ్గించడం కోసం తీసుకొన్న చర్యల ను గురించి కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు.  గడచిన మూడు సంవత్సరాల కాలం లో పూర్వాంచల్ ప్రాంతం లో ఎన్ సెఫలైటిస్ రోగుల సంఖ్య ఏ విధం గా 90 శాతం మేరకు తగ్గిందీ ఆయన ఈ సందర్భం లో వెల్లడించారు.

ప్రధాన మంత్రి విద్యుత్తు, నీరు మరియు రహదారుల వంటి ప్రాథమిక సదుపాయాల లో ఇంతకు ముందు ఎన్నడూ జరగని మెరుగుదల ను గురించి కూడా ప్రసంగించారు. 

వివిధ లాభార్థులు మరియు ప్రయోజనాల స్వీకర్తల ను వారి అనుభవాలు ఏమిటన్నది ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొన్నారు.  ప్రధాన మంత్రి సంభాషించిన వారి లో గోండా లోని ఒక స్వయంసహాయక సమూహాని కి నాయకత్వం వహిస్తున్న వినీత పాల్, బహ్ రాయిచ్ జిల్లా కు చెందిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లాభితుడు శ్రీ తిలక్ రామ్ మరియు సంత్ కబీర్ నగర్ జిల్లా కు చెందిన నవ పారిశ్రామికవేత్త శ్రీ అమరేంద్ర కుమార్ లు ఉన్నారు.  ప్రధాన మంత్రి వివిధ ప్రవాసీ శ్రామికుల తో కూడా మాట్లాడారు.  వారి లో  ముంబయి నుండి తిరిగివచ్చిన గోరఖ్ పుర్ జిల్లా వాసి శ్రీ కుర్బాన్ అలీ, జాలౌన్ జిల్లా కు చెందిన శ్రీ దీపూ లు ఉన్నారు. 
 

**