మీ అందరికీ శుభాకాంక్ష లు.
లాక్ డౌన్ ఎత్తివేత తొలి దశ (అన్ లాక్-1) అనంతరం మన తొలి సమావేశం ఇది. నిన్న నేను అన్ లాక్-1 అనుభవాల ను గురించి 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధుల తో సవివరం గా చర్చించాను. వాస్తవానికి కొన్ని పెద్ద రాష్ట్రాలు, నగరాల లో కరోనా వైరస్ విస్తరణ అధికం గా ఉంది. కొన్ని నగరాల లో క్రిక్కిరిసిపోయిన జనాభా, చిన్న ఇళ్లు, వీధులలో భౌతిక దూరం పాటించలేని స్థితి, వేలాది మంది ఒకేసారి తిరుగుతూ ఉండడం కరోనా పై పోరాటాన్ని మరింత సవాలు గా మార్చాయి.
అయినప్పటికీ ప్రతి ఒక్క పౌరుని క్రమశిక్షణ, యంత్రాంగం సంసిద్ధత, కరోనా పోరాటయోధుల క్రమశిక్షణ ల కారణం గా పరిస్థితి అదుపు తప్పిపోకుండా మనం చూసుకోగలిగాము. సరి అయిన సమయం లో వ్యాధి ని గుర్తించడం, చికిత్స చేయడం వంటి చర్యల వల్ల కరోనా వ్యాధి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమం గా పెరుగుతూ వస్తోంది. అతి తక్కువ మంది కి మాత్రమే ఐసియు, వెంటిలేటర్ ల అవసరం ఏర్పడడం పెద్ద ఊరట.
సరైన సమయం లో తీసుకున్న సరైన చర్యల వల్ల మనందరం అతి పెద్ద ప్రమాదాన్ని దీటు గా ఎదుర్కొనగలిగాము. లాక్ డౌన్ కాలం లో ప్రజలు ప్రదర్శించిన క్రమశిక్షణ కారణం గా అదుపు లేకుండా వైరస్ విజృంభణ ను నిలువరించగలిగాం. చికిత్స, ఆరోగ్య మౌలిక వసతులు, సుశిక్షితులైన మానవ వనరులపరం గా ఈ రోజు న మనం ఎంతో సుస్థిరం గా ఉన్నాము.
మీ అందరికీ తెలుసు.. కేవలం మూడు నెలల క్రితం పిపిఇ లు, డయాగ్నస్టిక్ కిట్ ల గురించి భారతదేశం లోనే కాదు, పలు ప్రపంచ దేశాల లో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. మన దేశం లో కూడా స్టాక్ పరిమితం గానే ఉండేది. దిగుమతుల పైనే మనం పూర్తి గా ఆధారపడవలసి వచ్చింది. అయితే ఈ రోజు న కోటి కి పైగా పిపిఇ కిట్ లు, అంతే సంఖ్య లో ఎన్95 మాస్క్ లు భిన్న రాష్ట్రాల కు అందించడం జరిగింది. డయాగ్నస్టిక్ కిట్ ల స్టాక్ కూడా తగినంత సంఖ్య లో ఉంది. వాటి ఉత్పత్తి సామర్థ్యాల ను కూడా విశేషం గా పెంచడం జరిగింది. ఈ రోజు న పిఎమ్ కేర్స్ ఫండ్ నిధుల తో వెంటిలేటర్ ల సరఫరా ను కూడా ప్రారంభించాము.
ఈ రోజు న మరింత ఎక్కువ మంది రోగుల కు చికిత్స ను అందించేందుకు దేశవ్యాప్తం గా 900 కరోనా వైరస్ టెస్టింగ్ లాబ్ లు, లక్షల సంఖ్య లో కోవిడ్ ప్రత్యేక పడక లు, వేల సంఖ్య లో క్వోరన్టీన్, ఐసలేశన్ కేంద్రాలు, తగినంత గా ఆక్సిజన్ సరఫరా లు అందుబాటు లో ఉన్నాయి. లాక్ డౌన్ కాలం లో లక్ష ల సంఖ్య లో మానవ వనరుల కు శిక్షణ ను ఇవ్వడం జరిగింది. అంతే కాదు, ఈ రోజు న దేశంలోని ప్రతి పౌరుని లో గతం తో పోల్చితే వైరస్ ను గురించిన అవగాహన పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో రోజువారీ స్థానిక యంత్రాంగాలు చేసిన కృషి కారణంగానే ఇది సాధ్యమయింది.
మిత్రులారా,
కరోనా మహమ్మారి పై మనం సాధించిన ఈ విజయాల తో లభించిన భరోసా తో పాటు అంతే వేగం గా మనం ఆరోగ్య మౌలిక వసతులు, సమాచార వ్యవస్థ ల విస్తరణకు, ప్రజల భాగస్వామ్యం, భావోద్వేగపూరితమైన మద్దతు సాధించడం పై దృష్టి పెట్టాలి.
మిత్రులారా,
కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న కారణం గా ఆరోగ్య మౌలిక వసతులు విస్తరించడం, ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడడం మన ప్రథమ ప్రాథమ్యం కావాలి. ప్రతి ఒక్క కరోనా వైరస్ రోగి కి సరైన చికిత్స ను అందించగలిగినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. వీలు అయినంత వరకు వైరస్ సోకిన వారందరిని గుర్తించి ఐసలేట్ చేసేందుకు పరీక్షల సంఖ్య ను పెంచేందుకు కృషి చేయాలి. ప్రస్తుత పరీక్ష సదుపాయాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకోవడం తో పాటు వాటి ని మరింతగా విస్తరించడం అవసరం.
మిత్రులారా,
గత రెండు మూడు నెలల కాలం లో దేశం లో పెద్ద సంఖ్య లో క్వోరన్టీన్, ఐసలేశన్ కేంద్రాల ఏర్పాటు జరిగింది. ఎక్కడా కొరత లేని విధంగా ఆ వసతులు విస్తరించేందుకు అదే వేగం మనం కొనసాగించాలి. కరోనా మహమ్మారి కారణంగా టెలీ మెడిసిన్ ప్రాధాన్యం కూడా బాగా పెరిగింది. హోం క్వోరన్టీన్ లో ఉన్నవారు కావచ్చు లేదా ఐసలేశన్ లో ఉన్న వారు కావచ్చు, లేదా వ్యాధి తో బాధపడుతున్న వారు కావచ్చు, ప్రతి ఒక్కరికీ ఈ టెలీ మెడిసిన్ ప్రయోజనాన్ని అందించే విధం గా మనం ప్రయత్నాల ను ముమ్మరం చేయాలి.
మిత్రులారా,
ఏ మహమ్మారి పై పోరాటం లో అయినా సరైన సమయం లో సరైన సమాచారం అందించడం చాలా అవసరం అన్నది మీ అందరి కి తెలుసు. అందుకే మన హెల్ప్ లైన్ లు అన్నీ నిస్సహాయమైనవి గా కాకుండా సహాయపూర్వకం గా ఉండేలా చూడాలి. ఆసుపత్రుల లో మన వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది కరోనా వైరస్ పై పోరాడుతున్న తీరు లోనే సకాలం లో సరైన సమాచారాన్ని అందించ గలిగే విధంగా టెలి మెడిసిన్ ద్వారా రోగుల కు మార్గదర్శకం చేయగల సీనియర్ వైద్యుల బృందాల ను మనం ఏర్పాటు చేయాలి. అంతే కాదు ప్రజల కోసం హెల్ప్ లైన్ లను సమర్థవంతం గా నడపగల యువ స్వచ్ఛంద కార్యకర్త ల సంఖ్య ను కూడా పెంచాలి.
ఆరోగ్య సేతు ఏప్ ను అధికం గా డౌన్ లోడ్ చేసుకున్న రాష్ట్రాలు సానుకూల ఫలితాలు సాధించాయి. మరింత మంది ప్రజల కు ఆరోగ్య సేతు ఏప్ ను అందుబాటు లో ఉంచేందుకు, ఎక్కువ మంది ప్రజలు దానిని డౌన్ లోడ్ చేసుకొనేలా చేసేందుకు మనం నిరంతరం కృషి చేయాలి. దేశం లో రుతుపవనాలు క్రమం గా విస్తరిస్తున్న అంశాన్ని కూడా మనం దృష్టి లో పెట్టుకోవాలి. రుతువు తో పాటు వచ్చే ఆరోగ్య సమస్యల ను ఎదుర్కోవడం కూడా చాలా ప్రధానం, లేదంటే అదో పెను సవాలు గా మారుతుంది.
మిత్రులారా,
కరోనా లో భావోద్వేగపూరితమైన కోణం కూడా ఉంది. వైరస్ కారణం గా విస్తరించిన భయం నుండి ప్రజల ను బయట కు తీసుకు వచ్చే మార్గాల ను కూడా మనం అన్వేషించాలి. కరోనా వైరస్ ను ఓడించిన వారి సంఖ్య అత్యధికం గా ఉందని, ఆ సంఖ్య వేగం గా పెరుగుతున్నదని మనం భరోసా ను ఇవ్వాలి. అప్పుడే ఎవరికైనా కరోనా వైరస్ సోకినప్పటి కీ వారు భీతావహులు కాకుండా ఉంటారు.
అత్యావసర సేవల ను అందించడం, వైద్యులు, ఆరోగ్య రక్షణ సిబ్బంది వంటి కరోనా పోరాట యోధుల కు అవసరమైన సౌకర్యాల ను అందుబాటు లో ఉంచడం కూడా మన ప్రాధాన్యం కావాలి. ప్రతి ఒక్క దశ లో వారి సంక్షేమాన్ని చూస్తూ ఉండడం మనందరి యొక్క, యావత్తు జాతి యొక్క బాధ్యత.
మిత్రులారా,
కరోనా మహమ్మారి పై పోరాటం లో భాగం గా మనం పౌర సమాజాన్ని, సమాజం లోని ప్రతి ఒక్క విభాగాన్ని నిరంతరం స్ఫూర్తిమంతం చేస్తూ ఉండాలి. ఈ పోరాటం లో వారు ఎంతో కీలకమైన పాత్ర ను పోషించారు. కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల లో మాస్కు లు లేదా ఫేస్ కవర్ లను ఉపయోగించేలా, భౌతిక దూరాన్ని, సేనిటైజేశన్ ప్రక్రియల ను పాటించేలా తరచు గా ప్రజల కు గుర్తు చేస్తూ ఉండాలి. ఏ ఒక్కరూ ఈ అంశాల లో నిర్లక్ష్యం వహించేందుకు మనం అనుమతించకూడదు.
మిత్రులారా,
కరోనా మహమ్మారి పై పోరాటం లో పలు రాష్ట్రాలు స్వార్థరహితం గా సేవ చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు ఆచరించిన సత్ప్రమాణాల ను పరస్పరం పంచుకోవడం ప్రధానం. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా తన అనుభవాలను, సూచనల ను ఎటువంటి దాపరికం లేకుండా ఆవిష్కరిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. రానున్న రోజుల లో ఉత్తమమైన వ్యూహాన్ని రూపొందించుకోవడానికి అది మనకు సహాయకారి గా ఉంటుంది. ఇక చర్చల ను ముందుకు తీసుకుపోవలసింది గా హోం మంత్రి ని నేను అభ్యర్థిస్తున్నాను.
**
During today’s meeting with CMs, we had wide ranging deliberations on the COVID-19 pandemic. Our focus areas are prevention of the infection, curing of patients and at the same time boosting economic activity. https://t.co/yt96HDyc9v
— Narendra Modi (@narendramodi) June 17, 2020