ఆయుష్ మంత్రిత్వ శాఖ అధీనం లో పనిచేసే సహాయక కార్యాలయం రూపం లో ఫార్మకోపియా కమిశన్ ఫార్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతి (పిసిఐఎమ్&హెచ్) ని తిరిగి నెలకొల్పేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 1975 వ సంవత్సరం నుండి గాజియాబాద్ లో నడుస్తున్న రెండు కేంద్రీయ ప్రయోగశాల లు – ఫార్మకోపియా లేబరేటరీ ఫార్ ఇండియన్ మెడిసిన్ (పిఎఎల్ఐఎమ్) ను మరియు హోమియోపతిక్ ఫార్మకోపియా లేబరేటరీ- ని విలీనం చేయడం ద్వారా పిసిఐఎమ్&హెచ్ ని పున:స్థాపించడం జరుగుతుంది.
ప్రస్తుతం ఫార్మకోపియా కమిశన్ ఫార్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతి (పిసిఐఎమ్&హెచ్) అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో 2010వ సంవత్సరం నుండి పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ గా ఉంది. ఈ విలీనం మూడు సంస్థల కు చెందిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక సంబంధిత మానవ మేధ ను మరియు ఆర్థిక వనరుల ను వీలయినంత అధిక స్థాయి లో ఉపయోగించుకోవడానికి ఉద్దేశించింది. తద్ద్వారా ఆయుర్వేద, సిద్ద, యునాని, ఇంకా హోమియోపతి ఔషధాల తాలూకు ఫలితాల ప్రామాణీకరణ ను వృద్ధిచేయడానికి వీలవుతుంది. దీని తో ప్రభావవంతమైన నియంత్రణ, ఇంకా నాణ్యత నియంత్రణ ల దిశ లో ముందంజ వేసేందుకు వీలు ఏర్పడుతుంది.
ఆయుష్ ఔషధాల ప్రమాణాల సమగ్ర అభివృద్ధి తో పాటు ఫార్మకోపోయియాస్, ఇంకా ఫార్ములరీస్ యొక్క ప్రచురణ పై తదేక దృష్టి సారించడానికి ఈ విలీనం బాట పరుస్తుంది. అదే విధం గా విలీనమైన సంస్థకు, దాని లేబరేటరీ ల కు చట్ట పరమైన హోదా ను కట్టబెట్టడానికి కూడా ఈ విలీనాన్ని ఉద్దేశించడమైంది. దీనికోసం డ్రగ్స్ & కాస్మెటిక్స్ రూల్స్, 1945 కు అవసరమైన సవరణల ను, కొన్ని నిబంధనల ను పొందుపరచవలసివుంటుంది. ఈ విషయమై ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ను, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ను మరియు ఆయుర్వేద, సిద్ధ ఎండ్ యునాని డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (ఎఎస్ యుడిటిఎబి)ని సంప్రదించడమైంది. ఈ బోర్డు డ్రగ్స్ & కాస్మెటిక్స్ యాక్ట్, 1940 నిబంధనల ప్రకారం స్థాపించబడ్డ ఒక చట్టబద్ద సంస్థ. ఈ బోర్డు ఎఎస్ఎల్ టి ఔషధాల నియంత్రణ వ్యవహారాల లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు సలహాలు ఇస్తుంది. విలీనం తో ఏర్పడిన సంస్థ నిర్మాణం, ఉద్యోగుల హోదా లు తదితర అంశాల కు ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని వ్యయ విభాగం సమ్మతి ని తెలిపింది.
పిఎఎల్ఐఎమ్ మరియు హెచ్ పిఎల్ లు సహాయక కార్యాలయాలు కావడం మరి పిసిఐఎమ్&హెచ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ లోని ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ గా ఉండడం వల్ల వీటి విలీనం ద్వారా పిసిఐఎమ్&హెచ్ ను ఏర్పాటు చేసి, దానిని ఒక ఉమ్మడి పరిపాలన నియంత్రణ తో మంత్రిత్వ శాఖ కు అధీనం లో పని చేసే కార్యాలయం రూపం లో ఏర్పాటు చేయనున్నారు.
విలీనం అనంతరం రూపుదాల్చే పిసిఐఎమ్&హెచ్ కు మంత్రిత్వశాఖ అధీనం లో తగినంత పరిపాలక స్వరూపం కొలువుదీరుతుంది. ఫార్మకోపియా సంబంధమైన పనుల పర్యవసానాల ను మరియు సామర్థ్యాన్ని అధికం చేసుందుకు పాటుపడే వీలు చిక్కుతుంది. ఆయుర్వేద, సిద్ధ, యునాని, ఇంకా హోమియోపతి ఔషధాల తాలూకు ఫార్మకోపియా సంబంధిత ప్రమాణాల మధ్య ఆనురూప్య సాధన కు, ఔషధ ప్రమాణీకరణ లో చేసిన పనినే మళ్లీ చేయడాన్ని, అతివ్యాప్తి ని నివారించడానికి మరియు వనరుల ను సాధ్యమైనంత అధిక స్థాయి లో, ప్రభావశీలమైన రీతి లో వినియోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి.