కోల్ కాతా పోర్ట్ పేరు ను శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు గా పేరు మార్చడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
కోల్ కాతా పోర్టు పేరు ను శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు గా మార్చుతూ కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ యొక్క ట్రస్టీ ల బోర్డు 2020 ఫిబ్రవరి 25వ తేదీ న ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ సందర్భం లో ఒక తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. ఒక ప్రముఖ న్యాయకోవిదుని గా, విద్యావేత్త గా, ఆలోచనాపరుని గా మరియు ప్రజానాయకుని గా శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క బహుముఖ ప్రజ్ఞ ను పరిగణన లోకి తీసుకోవడమైంది.
2020 జనవరి12న కోల్ కాతా పోర్టు యొక్క నూట యాభయ్యో వార్షికోత్సవాల ప్రారంభ కార్యక్రమం సందర్భం లో పశ్చిమ బెంగాల్ ప్రజల మనోభావాల ను దృష్టి లో పెట్టుకొని కోల్ కాతా పోర్టు పేరు ను డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరిట పున:నామకరణం చేయనున్నట్టు ప్రకటించడమైంది. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ లోని అత్యంత యోగ్యులైన సుపుత్రుల లో ఒకరు; జాతీయ సమగ్రత కై నడుం బిగించిన వారి లో ముందు వరుస లో ఉన్న వ్యక్తి; బెంగాల్ అభివృద్ధి ని స్వప్నించిన వారు; పారిశ్రామికీకరణ కు స్ఫూర్తి గా నిలవడం తో పాటు ‘ఒక దేశం – ఒకే చట్టం’ సిద్ధాంతాని కి గట్టి మద్దతుదారు కూడాను.
పూర్వరంగం:
కొల్ కాతా పోర్ట్ భారతదేశం లో ప్రథమ భారీ పోర్టు కావడం తో పాటు నదీతీరం లోని నౌకాశ్రయం కూడాను. 1870 వ సంవత్సరం లోని చట్టం V ప్రకారం కలకత్తా పోర్టు ను మెరుగుపరచడం కోసం కమిశనర్ ల ను నియమించడం తో అదే సంవత్సరం లో అక్టోబర్ 17వ తేదీ న ఈ పోర్టు ఒక ట్రస్టు నిర్వహణ లోకి వెళ్లింది. ఈ ఓడరేవు యొక్క విశిష్టత ఏమిటంటే ఇది భారతీయ నౌకాశ్రయాల చట్టం, 1908 లోని భాగం 1- ఒకటో షెడ్యూల్ లో వరుస సంఖ్య 1 తో ప్రత్యేక స్థానం కల్పించబడింది. మరి అలాగే, ఈ ఓడరేవు భారతీయ నౌకాశ్రయాల చట్టం, 1963 ద్వారా పాలింపబడుతోంది.
కోల్ కాతా పోర్ట్ ది 150 ఏళ్ళ ప్రస్థానం. ఈ యాత్ర లో ఇది భారతదేశాని కి వ్యాపారం, వాణిజ్యం, ఇంకా ఆర్థికాభివృద్ధి కి ముఖద్వారం గా ఉంది. ఇది స్వాతంత్ర్యం కోసం భారతదేశం చేసిన పోరాటాని కి, ఒకటో ప్రపంచ యుద్ధాని కి, రెండో ప్రపంచ యుద్ధాని కి మరియు దేశం లో ప్రత్యేకించి భారతదేశం లోని తూర్పు ప్రాంతం లో చోటు చేసుకొన్నటువంటి సామాజికమైన మార్పులకు, సాంస్కృతిక మార్పులకు కూడా సాక్షి గా నిలచింది.
భారతదేశం లో ప్రధానమైనటువంటి నౌకాశ్రయాల కు అవి నెలకొని ఉన్న నగరం పేరు పెట్టడం సర్వసాధారణం. కొన్ని పోర్టు లకు మాత్రం ప్రత్యేక సందర్భాల లో గాని, లేదా విశేష ప్రముఖ నేతలు అందించిన తోడ్పాటు ను లెక్క లోకి తీసుకొని గాని గతం లో ఆయా జాతీయ మహా నాయకుల యొక్క పేర్ల తో పునర్నామకరణం చేయడమైంది. నావ సేవ పోర్ట్ ట్రస్టు పేరు ను ప్రభుత్వం 1989 వ సంవత్సరం లో మార్చి, జవహర్ లాల్ నెహ్రూ పేరు ను పెట్టడం జరిగింది. ట్యూటికోరిన్ పోర్ట్ ట్రస్టు పేరు ను 2011 వ సంవత్సరం లో మార్చి వి. ఒ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్టు అనే పేరు ను, అదే విధంగా ఎణ్ణూర్ పోర్ట్ లిమిటెడ్ పేరు ను మార్చివేసి ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, తమిళ నాడు పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కె. కామరాజార్ గౌరవార్థం కామరాజార్ పోర్ట్ లిమిటెడ్ గాను పెట్టడమైంది. ఇటీవల, 2017 వ సంవత్సరం లో కాండ్లా పోర్టు పేరు ను మార్చి దీన్ దయాళ్ పోర్టు గా కొత్త పేరు ను పెట్టడం జరిగింది. అంతేకాదు, భారతదేశం లో అనేక విమానాశ్రయాల పేరుల ను కూడా మార్చి వాటి కి మహానేత ల పేర్లను పెట్టడం జరిగింది.