Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన‌ మంత్రి కి మరియు యుఎస్ఎ అధ్య‌క్షుని కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌


అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్య‌క్షుడు మాన్య శ్రీ డొనాల్డ్ ట్రంప్ తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.

అమెరికా అధ్య‌క్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ గ్రూప్ ఆఫ్ 7 కు అమెరికా అధ్య‌క్ష‌ పదవి ని గురించి మాట్లాడుతూ, ఈ సమూహం యొక్క పరిధి ని ఇప్పుడు ఉన్నటువంటి స‌భ్య‌త్వ దేశాల‌ కు మించి విస్త‌రించి భారతదేశం సహా ఇతర ముఖ్య దేశాల‌ను చేర్చుకోవాల‌నివుందంటూ త‌న అభిలాష ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయ‌న , అమెరికా లో జ‌ర‌గబోయే త‌దుపరి జి-7 శిఖర సమ్మేళనాని కి హాజ‌రుకావ‌ల‌సింది గా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఆహ్వానించారు.

అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ను ఆయన యొక్క సృజ‌నాత్మ‌కమైనటువంటి మరియు దూర‌ దృష్టి తో కూడినటువంటి వైఖ‌రి ని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ కొనియాడుతూ, ఒక విస్తృతమైన వేదిక ను ఏర్పాటు చేయడమనేది కోవిడ్ అనంత‌ర ప్ర‌పంచం లో ఆవిష్కారమయ్యే వాస్త‌విక ప‌రిస్థితుల‌ కు అనుగుణం గా ఉండగల‌దన్నారు. ప్ర‌తిపాదిత శిఖర సమ్మేళనం సఫలం అయ్యేటట్టు యుఎస్ఎ మరియు ఇత‌ర దేశాల‌ తో క‌ల‌సి కృషి చేయ‌డం అంటే అది భారతదేశాని కి సంతోషమే అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.

యుఎస్ లో ప్రస్తుతం చెలరేగుతున్న సామాజిక అశాంతి పట్ల ప్ర‌ధాన‌ మంత్రి ఆందోళ‌న ను వ్య‌క్తం చేస్తూ, ప‌రిస్థితి కి సత్వర పరిష్కారం లభించాలి అంటూ అందుకుగాను తన తరఫు నుండి శుభాకాంక్ష‌ల ను వ్య‌క్తం చేశారు.

ఇరువురు నేత లు ఉభ‌య దేశాల‌ లోని కోవిడ్-19 స్థితి, భారతదేశం-చైనా స‌రిహ‌ద్దు లో నెలకొన్న ప‌రిస్థితి మరియు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ లో సంస్క‌ర‌ణ‌ ల ఆవ‌శ్య‌క‌త వంటి ఇతర సమయోచిత అంశాల‌పై వారి వారి అభిప్రాయాల‌ ను ఒకరి తో మరొకరు వ్యక్తం చేసుకొన్నారు.

అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి లో భార‌త‌దేశాన్ని తాను సందర్శించడాన్ని ఉత్సాహం గా గుర్తు తెచ్చుకొన్నారు. ఆ సందర్శన ఎన్నో ర‌కాలు గా చ‌రిత్రాత్మ‌కం, చిర‌స్మ‌ర‌ణీయ‌ం అని ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొంటూ, ఆ సందర్శన ద్వైపాక్షిక సంబంధాల‌ కు ఒక కొత్త హుషారు ను జతపరచింద‌ని కూడా అన్నారు.

ఇదివరకు ఎరుగనటువంటి ఉత్సాహం తోను, మన:పూర్వకం గాను సాగినటువంటి ఈ సంభాష‌ణ భార‌త‌దేశం- అమెరికా సంబంధాల తాలూకు ప్రత్యేక స్వభావాన్ని ప్రతిబింబించింది; అలాగే, ఈ సంభాషణ ఇరువురు నాయకుల మధ్య గల పరస్పర గౌరవాన్ని మరియు స్నేహాన్ని కూడా చాటిచెప్పింది.