కేంద్ర మంత్రివర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న 2020 జూన్ 1 వ తేదీ న సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వం తన పదవీకాలం లోని రెండో సంవత్సరం లోకి అడుగుపెట్టిన తరువాత జరిగిన తొలి మంత్రివర్గం సమావేశం ఇది. దేశం లో కష్టజీవులైన రైతులు, ఎమ్ఎస్‌మ్ఇ రంగం, వీధుల లో తిరుగుతూ సరకుల ను విక్రయించి పొట్ట పొసుకొనే వారి జీవితాల ను గణనీయం గా ప్రభావితం చేసేటటువంటి విధం గా ఈ సందర్భం లో చరిత్రాత్మక నిర్ణయాల ను తీసుకోవడమైంది.
ఎమ్ఎస్‌మ్ఇల కు చేదోడు :
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య వ్యవస్థల ను ఎమ్ఎస్‌మ్ఇ లు అంటారు. ఇవి భారత ఆర్థిక రంగాని కి వెన్నెముక వంటివి. దేశవ్యాప్తం గా ఇవి వివిధ రంగాల లో నిశ్శబ్దం గా తమదైన కృషి ని కొనసాగిస్తున్నాయి. 6 కోట్ల కు పైగా ఎమ్ఎస్‌మ్ఇ లు బలమైన మరియు స్వయంసమృద్ధియుత భారతదేశం యొక్క నిర్మాణం లో కీలకమైనటువంటి పాత్ర ను పోషిస్తున్నాయి.
కోవిడ్- 19 మహమ్మారి అనంతరం, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ నిర్మాణం లో ఎమ్ఎస్‌మ్ఇ ల పాత్ర ను గుర్తించడం లో వేగం గా స్పందించారు. అందుకే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగం గా ప్రభుత్వం చేసిన ప్రకటనల లో ఎమ్ఎస్‌మ్ఇల కు సంబంధించిన ప్రకటనలు కీలకం గా ఉన్నాయి.
ఈ ప్యాకేజ్ లో భాగం గా ఎమ్ఎస్‌మ్ఇ రంగాని కి చెప్పుకోదగిన కేటాయింపులు చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ ను పునరుద్ధరించేందుకు చేపట్టవసిన చర్య ల అమలు విషయం లో ఈ రంగాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరిగింది. పలు కీలక ప్రకటన ల అమలు కు ఇప్పటికే రంగాన్ని సిద్ధం చేయడమైంది.
ఈ రోజు న, భారత ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్ లో భాగం గా ఇతర ప్రకటన ల సత్వర అమలు కు మార్గసూచీ ని రూపొందించింది కూడా. వీటి లో కింది అంశాలు చేరి ఉన్నాయి :
• ఎమ్ఎస్‌మ్ఇ నిర్వచనాన్ని ఎగువశ్రేణి కి చేర్చి సవరించడమైంది. సులభతర వాణిజ్యం దిశ గా తీసుకున్నటువంటి మరొక చర్య ఇది. ఎమ్ఎస్‌మ్ఇ రంగం లోకి పెట్టుబడుల ను ఆకర్షించడానికి, మరిన్ని ఉద్యోగాల కల్పన కు ఇది అవకాశం కల్పిస్తుంది.
• స్ట్రెస్డ్ ఎమ్ఎస్మ్ఇలకు ఈక్విటీ మద్దతు నిచ్చేందుకు సబార్డినేట్ రుణం కింద 20,000 కోట్ల రూపాయల కేటాయింపు ప్రతిపాదన కు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు న ఆమోదం తెలిపింది. ఇది 2 లక్షల స్ట్రెస్డ్ ఎమ్ఎస్‌మ్ఇల కు ప్రయోజనకరం గా ఉంటుంది.
• ఫండ్ ఆఫ్ పండ్స్ ద్వారా ఎమ్ఎస్‌మ్ఇల కు 50,000 కోట్ల రూపాయల ఈక్విటీ ని సమకూర్చే ప్రతిపాదనల కు కూడాను ఈ రోజు న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రుణం- ఎక్విటీ నిష్పత్తి నిర్వహణ లో ఇది ఎమ్ఎస్‌మ్ఇల కు సహాయం చేసేందుకు ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పరుస్తుంది. అలాగే వాటి సామర్థ్యాల పెంపుదల కు ఉపకరిస్తుంది. ఇది ఇవి స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఎమ్ఎస్‌మ్ఇ నిర్వచనం పరిధి మరింత ఎగువ కు సవరణ :
ఎమ్ఎస్‌మ్ఇ నిర్వచనానికి సంబంధించి మరింత అనుకూల సవరణ తెచ్చేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్యాకేజ్ ప్రకారం, సూక్ష్మ తయారీ, సర్వీసు యూనిట్ లకు సంబంధించిన నిర్వచనాన్ని 1 కోటి రూపాయల పెట్టుబడి కి, 5 కోట్ల రూపాయల టర్నోవరు కు పెంచింది. చిన్న యూనిట్ ల పరిమితి ని 10 కోట్ల రూపాయల పెట్టుబడి కి, 50 కోట్ల రూపాయల టర్నోవర్‌కు పెంచారు. అలాగే , మధ్యతరహా యూనిట్ లకు పరిమితి ని రూ 20 కోట్ల రూపాయల పెట్టుబడి, రూ 100 కోట్ల రూపాయల టర్నోవర్‌కు పెంచడమైంది. 2006 వ సంవత్సరం లో ఎమ్ఎస్‌మ్ఇ అభివృద్ధి చట్టం అమలు లోకి వచ్చిన తరువాత 14 సంవత్సరాల కు ఈ రివిజన్ ను తీసుకు వచ్చారు. 2020వ సంవత్సరం మే నెల 13వ తేదీ న ప్యాకేజ్ప్రకటన వచ్చిన అనంతరం, ప్రకటించిన సవరణ లు మార్కెట్, ధర ల పరిస్థితుల కు అనుగుణం గా లేవని, దీని ని మరింత ఎగువ కు సవరించాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞాపనల ను దృష్టిలో పెట్టుకొని మధ్య తరహా తయారీ, సేవా యూనిట్ లకు పరిమితి ని మరింత ఎగువ కు పెంచాలని ప్రధాన మంత్రి నిర్ణయించారు. దీనితో ప్రస్తుతం ఇది 50 కోట్ల రూపాయలపెట్టుబడి, 250 కోట్ల రూపాయల టర్నోవర్ గా ఉంటుంది. ఎగుమతుల కు సంబంధించిన టర్నోవర్ ను ఎమ్ఎస్‌మ్ఇల కు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్ ల విషయంలో ఏ మాత్రం పరిగణన లోకి తీసుకోరాదని నిర్ణయించారు.
కష్టపడి పనిచేస్తున్న మన వీధి విక్రేతల కు చేయూత :
గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక మైక్రో- క్రెడిట్ ఫెసిలిటీ పథకం- పిఎమ్ ఎస్‌విఎ నిధి. దీనినే పిఎమ్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అంటారు. వీధుల లో తిరిగి సరకులను విక్రయించే వారికి వారు భరించగలిగే పద్ధతి లో రుణాల ను ఇచ్చేందుకు సంబంధించింది ఇది. వీధుల లో తిరిగి సరకులను విక్రయించే వారు తిరిగి వారి యొక్క కార్యకలాపాలను ప్రారంభించుకోవడానికి, బ్రతుకుదెరువు ను పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
50 లక్షల మంది కి పైగా వెండర్స్, హాకర్స్, థాలీవాలా లు, రెహ్ డీవాలా లు, ఠేలీ ఫల్ వాలా లు, తదితరులు వివిధ ప్రాంతాలు వివిధ నేపథ్యాల లోని వారు ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందగలుగుతారు.
వీరు సరఫరా చేసే ఉత్పత్తుల లో కూరగాయలు, పండ్లు, వెంటనే తినడానికి పనికి వచ్చే ఆహార పదార్థాలు, టీ, పకోడీ లు, బ్రెడ్, కోడిగ్రుడ్లు, వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, హస్తకళాఉత్పత్తులు, పుస్తకాలు, వ్రాత సామగ్రి, తదితరాలు ఉన్నాయి. ఈ సేవల లో క్షౌరశాల లు, చెప్పులు కుట్టే దుకాణాలు, పాన్ షాపు లు, లాండ్రి సేవ లు ఇత్యాదులు ఉన్నాయి.
కోవిడ్ -19 సంక్షోభం సందర్భం లో ఈ వర్గాల వారు ఎదుర్కొన్న సమస్య ల పట్ల భారత ప్రభుత్వం సానుకూలం గా ఉంది. ఇటువంటి పరిస్థితుల లో వీరి కి వారి యొక్క వ్యాపారాల కు ఊతాన్నిచ్చే విధం గా తక్కువ వడ్డీ కి రుణ సదుపాయాన్ని కల్పించవలసిన అవసరం ఎంతయినా ఉంది.
ఈ పథకం అమలు లో పట్టణ స్థానిక సంస్థ లు కీలకమైనటువంటి పాత్ర ను పోషించనున్నాయి.
ఈ పథకం ఎన్నోకారణాల రీత్యా ప్రత్యేకమైంది :
1. చరిత్రత్మకం గా మొదటిది :
భారతదేశ చరిత్ర లో ఒక పట్టణ జీవనోపాధి కార్యక్రమం లో పట్టణ పరిసర ప్రాంతాల కు, గ్రామీణ ప్రాంతాల కు సంబంధించిన వీధి వ్యాపారుల ను లబ్ధిదారులు గా చేర్చడం ఇదే ప్రథమం.
వీధి వ్యాపారులు, 10,000 రూపాయల వరకు వర్కింగ్ కేపిటల్ లోన్ ను ఉపయోగించుకోవచ్చు. దీని ని ఏడాది లో నెలవారీ వాయిదా ల రూపం లో తిరిగి చెల్లించవచ్చు. సకాలం లో, లేదా ముందు గా రుణాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీ లో 7 శాతం వార్షిక సబ్సిడీ ని లబ్దిదారు బ్యాంకు ఖాతా కు ప్రత్యక్ష నగదు బదలీ విధానం ద్వారా ఆరు నెలల ప్రాతిపదిక న జమ చేస్తారు. ముందు గా తిరిగి చెల్లించే రుణం పై ఎటువంటి పెనాల్టీ ఉండదు.
సకాలం లో చెల్లించిన, ముందుగానే రుణం తిరిగి చెల్లించిన వెండర్ కు రుణ పరిమితి ని పెంచే వెసులుబాటు వల్ల వెండర్ ఆర్థిక నిచ్చెన పై పైకి ఎదుగుతూ, తన లక్ష్యాన్ని చేరుకొనే వీలు ఉంటుంది.
ఎమ్ఎఫ్ఐ లు, ఎన్ బిఎఫ్ సి లు, ఎస్‌హెచ్‌జి బ్యాంకుల ను గ్రామీణ పేదల కు నిర్దేశించిన పథకాని కి తొలి సారి గా అనుతించారు. వీధి వ్యాపారులు, పట్టణ పేదల కు వీరి సేవ లు దగ్గర గా అందుబాటులో ఉన్నందువల్ల వీటి ని అనుమతించారు.
2. సాధికారిత కు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం :
కేంద్ర ప్రభుత్వ దార్శనికత కు అనుగుణం గా, సమర్దమైన సేవల అందుబాటు, పారదర్శకత లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి వీలు గా ఒక డిజిటల్ ప్లాట్ ఫార్మ్, వెబ్ పోర్టల్, మొబైల్ ఏప్ లను అభివృద్ధి చేస్తారు. ఎండ్ టు ఎండ్ సాల్యూశన్ తో పథకం నిర్వహణ కు దీనిని ఉపయోగిస్తారు. ఈ ఐటి ప్లాట్ ఫార్మ్ విక్రేతల ను ఫార్మల్ ఫైనాన్షియల్ వ్యవస్థ తో అనుసంధానం చేయడానికి ఉపకరిస్తుంది. ఈ ప్లాట్ ఫార్మ్ వెబ్ పోర్టల్, మొబైల్‌యాప్‌ను క్రెడిట్ మేనేజ్మెంట్కు ఎస్ఐడిబిఐ కి చెందిన ఉద్యమి మిత్రా పోర్టల్ తో ఏకీకృతపరుస్తుంది. అలాగే వడ్డీ సబ్సిడీ నిర్వహణ కు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన పోర్టల్ PAiSA పోర్టల్ తో అనుసంధానం చేస్తారు.
3. డిజిటల్ లావాదేవీల కు ప్రోత్సాహం :
ఈ పథకం వీధుల లో తిరిగి సరకులను విక్రయించేవారి కి నెలవారీ క్యాష్ బ్యాక్ ను ఇవ్వజూపడం ద్వారా డిజిటల్ లావాదేవీల ను ప్రోత్సహిస్తుంది.
4. సామర్ధ్యాల నిర్మాణం పై దృష్టి :
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాల కొలాబరేషన్‌తో , రాష్ట్ర మిషన్ లైన డి.ఎ.వై- ఎన్యుఎల్ఎం, యుఎల్బిలు, ఎస్ఐడిబిఐ, సిజిటిఎమ్ఎస్ఇ, ఎన్పిసిఐ, డిజిటల్ పేమెంట్ అగ్రిగేటర్ లతో కలసి సామర్థ్యాల నిర్మాణం,స్టేక్ హోల్డర్లందరి కి ఉపయోగపడే ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలు, ఐఇసి కార్యక్రమాల ను దేశవ్యాప్తం గా ఈ సంవత్సరం జూన్ లో చేపడుతారు. రుణాల అందజేత జూలై లో ప్రారంభం అవుతుంది.
జయ్ కిసాన్ స్ఫూర్తి కి ప్రేరణ :
2020-21 ఖరీఫ్ సీజన్ కు ఉత్పత్తి ఖర్చుకు1.5 రెట్లు కనీస మద్దతు ధర ను నిర్ణయిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చింది. 2020-21 ఖరఫ్ సీజన్‌కు సంబంధించి 14 పంటల కనీస మద్ధతు ధరను సిఎసిపి సిఫారసు ల ప్రకారం ప్రకటించడం జరిగింది. ఈ 14 పంటల కు అయిన ఖర్చు పై రాబడి 50 శాతం నుండి 83 శాతం మేరకు ఉంటుంది.
వ్యవసాయం, ఇతర అనుబంధ కార్యకలాపాల కోసం బ్యాంకులు అడ్వాన్స్ గా ఇచ్చిన 3 లక్షల రూపాయల వరకు అన్ని స్వల్పకాలిక రుణాలకు తిరిగి చెల్లించే తేదీని 31.08.2020 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకులు యథాప్రకారం వడ్డీ లో ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందనుండగా, రైతులు సైతం సకాలం లో రుణాన్ని తిరిగి చెల్లించినందుకు గాను ప్రోత్సాహకాన్ని పొందనున్నారు.
మార్చి 1, 2020 నుండి 31 ఆగస్టు 2020 మధ్య చెల్లించవలసిన వ్యవసాయ స్వల్ప కాలిక రుణం పై 2 శాతం వడ్డీ రాయితీ (ఐఎస్) ని, సకాలం లో రుణం తిరిగి చెల్లించినందుకు రైతుల కు ఇచ్చే 3 శాతం ప్రోత్సాహకం (పిఆర్ఐ) ని పొందడానికి వీరికి వీలు ఉంటుంది. ఇటువంటి రుణాల ను రైతుల కు సంవత్సరానికి 7 శాతం వార్షిక వడ్డీ తో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2 శాతం వడ్డీ రాయితీ ని బ్యాంకుల కు, 3 శాతం అదనపు ప్రోత్సాహకాన్ని రుణాల ను సకాలం లో తిరిగి చెల్లించినందుకు రైతుల కు ఇస్తారు. దీని తో రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణాన్ని 4 శాతం వడ్డీ తో పొందినట్టు అవుతుంది.
రాయితీ పై స్వల్పకాలిక పంట రుణాల ను ఇవ్వడానికి వడ్డీ రాయితీ పథకం (ఐఎస్ఎస్) ను ప్రవేశపెట్టడం జరిగింది. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు కింద తీసుకున్న రుణాలకూ ఇది వర్తిస్తుంది. గడచిన కొన్ని వారాల లో చాలా మంది రైతులు వారి స్వల్పకాలిక రుణాల బకాయిల ను తిరిగి చెల్లించేందుకు బ్యాంకు శాఖల కు వెళ్లలేకపోయారు. అందువల్ల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కోట్లాది రైతుల కు ఉపయోగపడుతుంది.
పేద ల సంరక్షణ పై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి :
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లోని ప్రభుత్వ ప్రాధాన్యాల లో పేదలు, అణగారిన వర్గాల వారు అత్యున్నత స్థాయి లో ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సమయం లో, లాక్డౌన్ ప్రకటించిన రోజు నుండే, పేద ప్రజల అవసరాల కు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. లాక్ డౌన్ ప్రారంభమైన రెండు రోజులలోనే, అంటే మార్చి 26, 2020 న ప్రధాన మంత్రి ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ లో ఇది కనిపించింది. 80 కోట్ల మంది ప్రజల కు ఆహార భద్రత కు పూచీ పడడం తో పాటు 20 కోట్ల మంది మహిళ లు, వయోధికులు, పేద వితంతువులు, పేద దివ్యాంగుల బ్యాంకు ఖాతాల లో ప్రత్యక్షనగదు బదలీ పథకం లో భాగం గా నేరు గా నగదు బదిలీ చేయడం, కోట్లాది రైతుల కు పిఎమ్ కిసాన్ కిస్తీల చెల్లింపు వంటి చర్యల ను ప్రకటించారు. వివిధ వర్గాల అణగారిన ప్రజల కు ప్రభత్వం వీటిని వెంటనే వర్తింప చేసింది. లేకుంటే వారు లాక్ డౌన్ కారణం గా ఇబ్బందులు ఎదుర్కొని ఉండే వారు. అంతేకాదు, ఇవి ప్రకటనలు మాత్రమే కాదు, ప్రభుత్వం ప్రకటించిన సహాయం, కొద్ది రోజులలోనే కోట్లాది ప్రజల కు నేరుగా నగదు లేదా సహాయం రూపం లో అందింది.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగం గా, ఒక దేశం- ఒక రేషన్ కార్డు పథకం, రేషన్ కార్డు లేని వారికి సైతం ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, పేదల కోసం కొత్త చౌక అద్దె పథకం, ఇంకా ఎన్నో ఇతర చర్యల ను వలస కార్మికుల కోసం ప్రకటించడం జరిగింది.
రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తు న సంస్కరణలను ప్రభుత్వం ప్రకటించింది. రైతుల ఆదాయాన్ని చెప్పుకోదగిన రీతి లో పెంచే నిర్ణయాలు ప్రకటించారు. దీనికి తోడు వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగం లోకి పెట్టుబడుల ను అధికం గా ప్రతిపాదించడమైంది. చేపల పెంపకం వంటి సంబంధిత కార్యకలాపాల కు కూడా ఒక ఆర్థిక సహాయ చర్యల ప్యాకేజీ ని ప్రకటించడమైంది.
అత్యంత దుర్బలమైన స్థితి లో ఉన్న వర్గాల వారి యొక్క అవసరాలను తీర్చడం లో భారత ప్రభుత్వం ప్రతి దశ లో చాలా వేగం గా స్పందించడం తో పాటు వారి పట్ల కరుణ ను చూపించింది.
**
आज कैबिनेट ने कई महत्वपूर्ण और ऐतिहासिक फैसले लिए। इनसे हमारे अन्नदाताओं, मजदूरों और श्रमिकों के जीवन में बड़े सकारात्मक बदलाव आएंगे। सरकार के इन निर्णयों से किसानों, रेहड़ी-पटरी वालों और एमएसएमई को जबरदस्त लाभ पहुंचने वाला है। https://t.co/jgGTO4gKH1
— Narendra Modi (@narendramodi) June 1, 2020
आत्मनिर्भर भारत अभियान को गति देने के लिए हमने न केवल MSMEs सेक्टर की परिभाषा बदली है, बल्कि इसमें नई जान फूंकने के लिए कई प्रस्तावों को भी मंजूरी दी है। इससे संकटग्रस्त छोटे और मध्यम उद्योगों को लाभ मिलेगा, साथ ही रोजगार के अपार अवसर सृजित होंगे।
— Narendra Modi (@narendramodi) June 1, 2020
देश में पहली बार सरकार ने रेहड़ी-पटरी वालों और ठेले पर सामान बेचने वालों के रोजगार के लिए लोन की व्यवस्था की है। ‘पीएम स्वनिधि’ योजना से 50 लाख से अधिक लोगों को लाभ मिलेगा। इससे ये लोग कोरोना संकट के समय अपने कारोबार को नए सिरे से खड़ा कर आत्मनिर्भर भारत अभियान को गति देंगे।
— Narendra Modi (@narendramodi) June 1, 2020
'जय किसान' के मंत्र को आगे बढ़ाते हुए कैबिनेट ने अन्नदाताओं के हक में बड़े फैसले किए हैं। इनमें खरीफ की 14 फसलों के लिए लागत का कम से कम डेढ़ गुना एमएसपी देना सुनिश्चित किया गया है। साथ ही 3 लाख रुपये तक के शॉर्ट टर्म लोन चुकाने की अवधि भी बढ़ा दी गई है।
— Narendra Modi (@narendramodi) June 1, 2020
As this Government enters its second year, the Cabinet took important decisions that will have a transformative impact on the MSME sector, our hardworking farmers and street vendors. Today’s decisions will ensure a better quality of life for them. https://t.co/5QtQL2djtT
— Narendra Modi (@narendramodi) June 1, 2020
MSME sector is of great importance for us. Decisions taken for the MSME sector in today’s Cabinet meet will draw investments, ensure ‘Ease of Doing Business’, and easier availability of capital. Many entrepreneurs will gain from the revised definition of MSMEs.
— Narendra Modi (@narendramodi) June 1, 2020
India will prosper when our farmers prosper. Our Government has fulfilled its promise to our hardworking farmers, of fixing the MSP at a level of at least 1.5 times of the cost of production. Care has also been taken towards improving the financial situation of our farmers.
— Narendra Modi (@narendramodi) June 1, 2020
PM Street Vendor's AtmaNirbhar Nidhi (PM SVANidhi) is a very special scheme. For the first time, our street vendors are a part of a livelihood programme. This scheme will ensure support for street vendors. It harnesses technology and emphasises on capacity building.
— Narendra Modi (@narendramodi) June 1, 2020