Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా ఫెడరల్ ప్రెసిడెంటు మాన్య శ్రీ డాక్టర్ ఎలెక్జెండర్ వాన్ దెర్ బేలన్ తో టెలిఫోన్ లో సంభాషించిన ప్ర‌ధాన‌ మంత్రి


రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా ఫెడరల్ ప్రెసిడెంటు మాన్య శ్రీ డాక్టర్ ఎలెక్జండర్ వాన్ దెర్ బేలన్ తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ  న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు న టెలిఫోన్‌ లో మాట్లాడారు.

అమ్ఫాన్ తుఫాను వల్ల భారతదేశానికి వాటిల్లిన నష్టం పట్ల ఆస్ట్రియా అధ్యక్షుడు సానుభూతి ని వ్యక్తంచేశారు.  కోవిడ్-19 విశ్వమారి కారణం గా వారి వారి దేశాల లో ఆరోగ్య రంగం పైన మరియు ఆర్థిక రంగం పైన పడిన ప్రతికూల ప్రభావాన్ని సంబాళించడం కోసం చేపట్టిన చర్యల పై ఇరువురు నేత లు ఒకరి ఆలోచనల ను మరొకరి కి వెల్లడి చేసుకొన్నారు.  వర్తమాన సవాళ్ల ను పరిష్కరించడం లో అంతర్జాతీయ సమన్వయాని కి ప్రాముఖ్యం ఎంతయినా ఉంది అంటూ వారు వారి యొక్క సమ్మతి ని వ్యక్తం చేశారు.

భారతదేశం- ఆస్ట్రియా సంబంధాల ను కోవిడ్ అనంతర కాలం లో మరింత గా బలోపేతం చేసుకోవడం తో పాటు వివిధ రంగాల కు విస్తరించుకోవాలన్న తమ ఉమ్మడి అభిలాష ను ఉభయ నేత లు ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.  మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక విజ్ఞానం, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ, ఎస్ఎమ్ఇ స్ ఇత్యాది రంగాల లో ఇప్పటి కంటే మరింత ఎక్కువ సహకారాన్ని అందించుకొనేందుకు అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.

పర్యావరణాని కి సంబంధించిన ఆరోగ్యం వంటి దీర్ఘకాలిక ఆందోళన ల పట్ల ప్రపంచం శ్రద్ధ వహించగలిగే విధం గా, వర్తమాన స్వాస్థ్య సంకటాన్నుండి త్వరలో బయటపడుతుందన్న ఆశ ను నేత లు వ్యక్తం చేశారు. 

**