జమ్ము & కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 లోని సెక్షన్ 96 లో భాగం గా జమ్ము & కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (రాష్ట్ర చట్టాల అనుసరణ) రెండో ఉత్తర్వు, 2020 జారీ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వు తో కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము & కశ్మీర్ సివిల్ సర్వీసెస్ (వికేంద్రీకరణ మరియు నియామకాల) చట్టం (2010 యొక్క చట్టం సంఖ్య XVI) ప్రకారం అన్ని స్థాయి ల ఉద్యోగాల కు స్థిర నివాసం షరతు ల అనువర్తనీయత మరింత గా సవరణ కు లోనైంది.
ఈ ఉత్తర్వు తో కేంద్ర పాలిత జమ్ము & కశ్మీర్ లో అన్ని పదవుల నియామకాని కి గాను నిర్దిష్ట స్థిరనివాసం ప్రమాణం అమలు లోకి వస్తుంది.