Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌ ఆవిష్కారానికై పిలుపునిచ్చిన ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 


దేశ ప్ర‌జ‌ల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ప్ర‌సంగించారు. కోవిడ్ మ‌హ‌మ్మారి పై పోరాటం సాగిస్తూ మ‌ర‌ణించిన వారి ని స్మ‌రించుకుంటూ ప్ర‌ధాన‌ మంత్రి, కోవిడ్-19 వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన సంక్షోభం వంటిది మున్నెన్న‌డూ లేద‌ని అన్నారు. అయితే ఈ పోరాటం లో మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డం తో పాటు గా ముందుకు సాగిపోవ‌ల‌సి ఉంది అన్నారు.

స్వావలంబనయుత భార‌తదేశం

కోవిడ్ కు పూర్వ ప్రపంచాన్ని గురించి, కోవిడ్ కు అనంత‌రం ప్ర‌పంచాన్ని గురించి ప్ర‌ధాన‌ మంత్రి మాట్లాడుతూ, 21 వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశం యొక్క క‌ల‌ల ను నెరవేర్చే దిశ‌ గా ముందుకు సాగాలి అంటే అందుకు దేశం స్వావలంబ‌న ను సాధించేందుకు పూచీ ప‌డ‌డ‌మే మార్గం అన్నారు. సంక్షోభాన్ని అవ‌కాశం గా మ‌ల‌చుకోవ‌డం గురించి ప్ర‌ధాన‌ మంత్రి చెప్తూ , పిపిఇ కిట్ లు, ఎన్ -95 మాస్క్‌ల‌ కు సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌ ను ప్ర‌స్తావించారు. కోవిడ్ కు ముందు నామ‌మాత్రం గా ఉన్న వీటి త‌యారీ ఇప్ప‌డు రోజు కు 2 ల‌క్ష‌ల ఉత్ప‌త్తి స్థాయి కి చేరిన విష‌యాన్ని ప్ర‌ధాన‌ మంత్రి ఈ సంద‌ర్భం లో ప్ర‌త్యేకం గా ప్ర‌స్తావించారు.

నేటి ప్ర‌పంచీక‌ర‌ణయుతమైనటువంటి ప్ర‌పంచం లో స్వావ‌లంబ‌న‌ కు నిర్వ‌చ‌నం మారిపోయింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. దేశం స్వావ‌లంబ‌న ను గురించి మాట్లాడింది అంటే అది స్వీయ కేంద్రితం గా ఉండ‌డానికి భిన్న‌మైందని ఆయన పేర్కొన్నారు. ప్ర‌పంచ‌మంతా ఒకే కుటుంబం అని భార‌తీయ సంస్కృతి భావిస్తుంది అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. భార‌త‌దేశం ప్ర‌గ‌తి ని సాధించడం అంటే ఇది అందులో భాగ‌మ‌ని, ఇది మొత్తం ప్ర‌పంచ ప్ర‌గ‌తి కి దోహ‌ద‌ ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు. మానవాళి అభివృద్ధి కి భారతదేశం ఎంతో దోహద పడుతుందని ప్రపంచం విశ్వసిస్తున్న‌దని ఆయన పేర్కొన్నారు.

స్వావ‌లంబనయుత భార‌తదేశాని కి ఐదు స్తంభాలు

కచ్ఛ్ ప్రాంతాన్ని భూకంపం కుదిపివేసిన స‌మ‌యాన్ని గుర్తు చేసుకున్న ప్ర‌ధాన‌ మంత్రి, ప‌ట్టుద‌ల‌ తోను, సంక‌ల్పం తోను ఆ ప్రాంతం మళ్లీ మామూలు స్థితి కి వ‌చ్చి త‌న కాళ్ళ‌ మీద తాను నిల‌బ‌డ‌గ‌లిగింది అన్నారు. ఇటువంటి ప‌ట్టుద‌లే ఇప్ప‌డు దేశం స్వావ‌లంబ‌న ను సాధించేందుకు కావాలి అని ప్ర‌ధాన‌ మంత్రి సూచించారు.

స్వావ‌లంబన తో కూడిన భార‌త‌దేశం ఐదు స్తంభాల‌ పై నిల‌బ‌డుతుంద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. అవి..

ఆర్థిక వ్య‌వ‌స్థ‌- ఇది క్రమేణా పెరుగుదల తో కూడిన మార్పు కాకుండా గొప్ప‌ మార్పు ను తీసుకు వ‌స్తుంది.

మౌలిక‌ స‌దుపాయాలు- ఇది భార‌త‌దేశాని కి ఒక ప్ర‌త్యేక గుర్తింపుగా ఉండ‌బోతుంది.

వ్య‌వ‌స్జలు-21 వ శ‌తాబ్ద‌పు సాంక‌తిక ప‌రిజ్ఞానం ఆధారంగా రూపుదిద్దుకున్న వ్య‌వ‌స్థ‌లకు ఏర్పాట్లు.

చైత‌న్య‌వంతులైన జ‌నాభా- ఇది స్వావ‌లంబన భార‌త్‌ కు శ‌క్తి ని స‌మ‌కూరుస్తుంది.

డిమాండ్‌- మ‌న‌కు ఉన్న డిమాండ్, స‌ప్ల‌య్ చెయిన్‌ ను పూర్తి సామ‌ర్ద్యం తో ఉప‌యోగించుకోవాలి.

డిమాండు ను పెంచ‌డానికి , డిమాండు కు త‌గ్గ స‌ర‌ఫ‌రాల కు వీలుగా దీనితో సంబంధం ఉన్న స‌ప్ల‌య్ చెయిన్‌ ను బ‌లోపేతం చేయవలసిన ఆవ‌శ్య‌క‌త ను గురించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించారు.

ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ అభియాన్‌

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌ కు పిలుపునిచ్చారు. అలాగే ప్ర‌త్యేక ఆర్థిక ప్యాకేజ్ ను గురించి ప్ర‌క‌టించారు. ఈ ప్యాకేజ్, కోవిడ్ సంక్షోభం సంద‌ర్బం గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినవి, రిజ‌ర్వు బ్యాంకు ప్ర‌క‌టించిన‌వి క‌లిపి సుమారు 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అవుతాయ‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఇది భార‌త‌దేశం యొక్క జిడిపి లో సుమారు 10 శాతం గా ఉంటుంద‌ని అన్నారు. ఈ ప్యాకేజ్ ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి అవ‌స‌ర‌మైన మ‌రింత ఊతాన్ని ఇస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

ఈ ప్యాకేజ్ భూమి, కార్మికులు, లిక్విడిటీ, చ‌ట్టాలు.. ఇలా అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న లోకి తీసుకుంటుంద‌ని ప్రధాన మంత్రి అన్నారు. కుటీర ప‌రిశ్ర‌మ‌లు, ఎమ్ఎస్‌ఎమ్ఇ లు, కార్మికులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, ప‌రిశ్ర‌మ‌ల‌ వారు త‌దిత‌ర వ‌ర్గాల ప్ర‌యోజ‌నాల‌ ను తీర్చేది గా ఉంటుందన్నారు. ఈ ప్యాకేజ్ స్వ‌రూప స్వ‌భావాల‌ ను రేప‌టి నుండి రాబోయే కొద్ది రోజుల లో ఆర్థిక మంత్రి వెల్ల‌డిస్తార‌ని ఆయన తెలిపారు.

గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌ లో తీసుకు వ‌చ్చిన జెఎఎం, ఇత‌ర సంస్క‌ర‌ణ ల సానుకూల ప్ర‌భావాన్ని గురించి ప్ర‌ధాన‌ మంత్రి మాట్లాడుతూ, దేశాన్ని స్వావ‌లంబ‌న సాధించేటట్టు చేయ‌డానికి ప‌లు గొప్ప‌ సంస్క‌ర‌ణ‌ లు అవ‌స‌ర‌మ‌ని, అప్పుడే కోవిడ్ సంక్షోభం వంటి వాటి ప్ర‌భావాన్ని భవిష్య‌త్తు లో తిప్పికొట్ట‌డానికి వీలు క‌లుగుతుంద‌ని అన్నారు. ఈ సంస్క‌ర‌ణ‌ల‌ లో వ్య‌వ‌సాయ రంగాని కి సంబంధించి స‌ప్లయ్ చెయిన్ సంస్క‌ర‌ణ‌ లు, హేతుబ‌ద్దమైన ప‌న్ను విధానం, సుల‌భ‌మైన , స్ప‌ష్ట‌మైన చ‌ట్టాలు, స‌మ‌ర్ధ మాన‌వ వ‌న‌రులు, బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్జ వంటివి భాగం గా ఉంటాయ‌న్నారు. ఈ సంస్క‌ర‌ణ‌ లు వ్యాపారాన్ని ప్రోత్స‌హించి, పెట్టుబ‌డుల‌ ను ఆక‌ర్షించి ‘మేక్ ఇన్ ఇండియా’ను మ‌రింత బలోపేతం చేస్తాయ‌న్నారు.

స్వావలంబన, దేశాన్ని ప్రపంచ సరఫరా గొలుసు లో కఠినమైన పోటీ కి సిద్ధం చేస్తుందని, ఈ పోటీ లో దేశం గెలవడం చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్యాకేజీ ని రూపొందించేట‌పుడు దీనిని గుర్తుంచుకోవడం జ‌రిగింద‌న్నారు. ఇది వివిధ రంగాల లో సామర్థ్యాన్ని పెంచడమే కాక నాణ్యత కు కూడా హామీ ఇస్తుంద‌న్నారు. సంఘ‌టిత‌ రంగం లో, అసంఘ‌టిత రంగం లో దేశాని కి అందించిన సేవ‌ల‌ ను ప్రధాన మంత్రి ప్ర‌ముఖం గా ప్ర‌స్తావించి పేదలు, కార్మికులు, వలస కార్మికులు, మొదలైన వారి సాధికారిత కల్పన పై కూడా ఈ ప్యాకేజీ దృష్టి సారిస్తుందన్నారు.

ప్ర‌స్తుత సంక్షోభం స్థానిక తయారీ, స్థానిక విపణి, స్థానిక సరఫరా గొలుసు ల ప్రాముఖ్యాన్ని తెలియ‌జెప్పింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు. సంక్షోభ సమయం లో మ‌న‌ డిమాండ్లన్నీ ‘స్థానికం గా’ నెరవేరాయి. ఇప్పుడు, స్థానిక ఉత్పత్తుల గురించి గ‌ట్టి గా చెప్ప‌డానికి, వాటి కి మ‌ద్ద‌తివ్వ‌డానికి ఈ స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి కి ఎదిగేలా చేయ‌డానికి సహాయపడే సమయం ఆసన్నమైంది అని ఆయ‌న అన్నారు.

కోవిడ్ తో కలసి జీవించడం

వైరస్ చాలా కాలం పాటు మన జీవనం లో ఓ భాగం గా ఉండ‌బోతోంద‌ని పలువురు నిపుణులు, శాస్త్రవేత్త లు చెప్పారని ప్రధాన మంత్రి ప్ర‌స్తావించారు. కానీ, మన జీవితం దాని చుట్టూ మాత్రమే తిరగకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. మాస్క్‌ లు ధరించడం , ‘దో గ‌జ్ దూరీ’ (రెండు గజాల దూరాన్ని పాటించ‌డం) వంటి జాగ్రత్త లు తీసుకుంటూ ప్రజలు వారి లక్ష్యాల ను సాధించాలని ప్రధాన మంత్రి కోరారు.

నాలుగో ద‌శ లాక్ డౌన్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దీని కి సంబంధించిన విధానాలు ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన దాని కి పూర్తి గా భిన్నం గా ఉండ‌బోతాయ‌ని తెలిపారు. రాష్ట్రాల‌ నుండి వచ్చిన సిఫారసుల‌ కు అనుగుణం గా నూత‌న‌ నిబంధ‌న‌ల‌ ను రూపొందిస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించిన స‌మాచారాన్ని మే నెల 18వ తేదీ కి ముందే తెలియ‌జేయ‌నున్న‌ట్టు కూడా ప్ర‌ధాన‌ మంత్రి పేర్కొన్నారు.

 

**