ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జపాన్ ప్రధాని గౌరవనీయ షింజో అబేతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విసిరిన ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై దేశాధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సంక్షోభ నివారణకు తమతమ దేశాల్లో చేపట్టిన చర్యలపై వారు చర్చించారు. ఈ పరీక్షా సమయంలో తమతమ దేశాల్లోని భారత, జపాన్ పౌరుల సంక్షేమంలో చూపిన శ్రద్ధకు పరస్పరం కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ సమన్వయ కృషిని కొనసాగించేందుకు వారిద్దరూ అంగీకరించారు. ప్రపంచ మహమ్మారి నిర్మూలన దిశగా అంతర్జాతీయ సహకారంలో భారత్-జపాన్ భాగస్వామ్యానికిగల కీలక పాత్రపై వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
****