ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈరోజు రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు మూన్ జే- ఇన్ తో ఫొన్లో మాట్లాడారు.
గత ఏడాది రిపబ్లిక్ ఆఫ్ కొరియా లో తన పర్యటనను ప్రధాని మోడీఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు . ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సన్నిహిత సంబంధాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలకు, ఆర్థిక పరిస్థితులకు దాని వల్ల ఏర్పడిన సవాళ్ళ గురించి ఇరువురు నాయకులు చర్చించారు. ఈ మహమ్మారిపై పోరాటానికి తమ తమ దేశాలలో తీసుకున్న చర్యల గురించి వారు పరస్పరం తెలియజేసుకున్నారు.
రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో కోవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత వ్యవస్థల వినియోగం పట్ల ప్రధాని ప్రశంసించారు. కోవిడ్ మహమ్మారి పై ఐక్య పోరాడటానికి భారత ప్రభుత్వం ,కోట్లాదిమంది భారతీయలకు ప్రేరణనందించిన తీరును అధ్యక్షుడు మూన్ జై-ఇన్ ప్రశంసించారు
భారతదేశంలోని కొరియా పౌరులకు, భారత అధికారులు అందిస్తున్న సహకారానికి కొరియా అధ్యక్షుడు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయ కంపెనీలు సరఫరా చేస్తున్న వైద్య పరికరాల, రవాణాను సులభతరం చేసినందుకు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు.
కోవిడ్ -19 వైరస్పైపోరాటంలో తగిన పరిష్కారాలను కనుగొనేందుకు సాగిస్తున్న పరిశోధనలకు , తమ నిపుణులు ఒకరినొకరు సంప్రదించుకుంటూ తమ అనుభవాలను పంచుకోవడం కొనసాగిస్తారని ఇరువురు నాయకులూ అభిప్రాయపడ్డారు
రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో త్వరలో జరగనున్న జాతీయ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అధ్యక్షుడు మూన్‌కు ప్రధానమంత్రి తమ శుభాకాంక్షలు తెలిపారు.
Had a telephone conversation with President @moonriver365 on the prevailing COVID-19 situation and how we can fight this pandemic through cooperation and leveraging the power of technology. https://t.co/e51GAApSaP
— Narendra Modi (@narendramodi) April 9, 2020