లఖ్‌నవూ లోని యువ మిత్రులు అందరికీ నా అభినందన లు. దేశం లోని యువజనులు అందరికీ మరియు మీ అందరి కి జాతీయ యువ దినం సందర్భం లో శుభాకాంక్షలు.
ఈ రోజు భారతదేశం లో యువజనుల కు ఒక గొప్ప ప్రేరణ ను అందించేటటువంటి రోజు; ఇది నూతన సంకల్పాల ను స్వీకరించ వలసిన అటువంటి రోజు. ఈ రోజు వివేకానందుల వారి రూపం లో ఉత్సాహమయమైన శక్తి భారతదేశానికి అందిన రోజు. ఈ శక్తి ఈనాటి కి కూడాను మన దేశాన్ని శక్తివంతం చేస్తోంది. అంతేకాదు, ఈ శక్తి మనకు నిరంతర స్ఫూర్తి ని ప్రసాదిస్తూ ముందుకు సాగిపోయే మార్గాన్ని కూడా చూపుతోంది.
మిత్రులారా,
స్వామి వివేకానందుల వారు భారతదేశం లో యువజనుల ను ఒక భవ్యమైనటువంటి భూతకాలాని కి మరియు ఒక దివ్యమైనటువంటి భవిష్యత్తు కాలాని కి ఒక గట్టి లంకె గా దర్శించారు. వివేనందుల వారు అనే వారు ‘మీ లోపలే శక్తి అంతా ఇమిడి ఉంది, ఆ శక్తి ని జాగృత పరచండి’ అని. ప్రతి దాని ని సాధించగలుగుతాము అనే ఒక నమ్మకాన్ని మీరు తప్పక పెట్టుకోవాలి. స్వీయ శక్తి పట్ల ఉండేటటువంటి ఈ నమ్మకం మరియు అసాధ్యాన్ని సాధ్యం గా మార్చడం అనేది దేశ యువత కు ఇప్పటికీ ప్రాసంగికం గానే ఉన్నాయి. మరి ఈ సంగతి ని భారతదేశ యువత బాగా గ్రహించిందన్న విషయం నాకు సంతోషాన్ని ఇస్తున్నది. యువత వారి పట్ల వారికి గల విశ్వాసం తో ముందుకు సాగుతోంది.
భారతదేశం లో ప్రస్తుతం నూతన ఆవిష్కరణల ను, ఇన్ క్యూబేశన్ మరియు స్టార్ట్-అప్ ప్రవాహాన్ని పారిస్తున్నది ఎవరు? వాటి ని పారిస్తున్నది మన దేశ యువజనులే. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ స్టార్ట్- అప్ ఇకో సిస్టమ్ లోని అగ్రగామి మూడు దేశాల సరస న నిలబడింది అంటే మరి దీని వెనుక గల కఠోర శ్రమ ఎవరిది? అది మీది; దీని వెనుక మీ వంటి దేశ యువజనులు ఉన్నారు. ఇవాళ భారతదేశం ప్రపంచం లో యూనికార్న్ ల ను ఆవిష్కరించే ఒక బిలియన్ డాలర్ లకు పైగా క్రొత్త కంపెనీల ను స్థాపించే మూడో అతి పెద్ద దేశం గా మారింది. అయితే మరి దీని వెనుక ఉన్న బలం ఎవరిది? మీది, మీ వంటి నా యొక్క దేశ నవ యువతీయువకులది.
మిత్రులారా,
2014వ సంవత్సరాని కన్నా ముందు మన దేశం లో ప్రతి సంవత్సరాని కి సరాసరి నాలుగు వేల పేటెంట్ లు ఉండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య ఏటా 15 వేల కు పైగా పెరిగి, దాదాపు నాలుగింతలు అయింది. దీని వెనుక ఉన్న కఠోర శ్రమ ఎవరిది? మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, అది మీరే. దీని వెనుక ఉంది మీ వంటి యువజనులు, మీవంటి యువత యొక్క బలమే.
మిత్రులారా,
26 వేల క్రొత్త స్టార్ట్-అప్ లను ఏర్పాటు చేయడం అనేది ప్రపంచం లో ఏ దేశానికైనా ఒక కల వంటిదే అవుతుంది. ఈ స్వప్నం ప్రస్తుతం భారతదేశం లో రూపుదాల్చింది. ఈ కారణం గా భారతదేశం యొక్క యువత తాలూకు కల లు మరియు సాధన దీని వెనుక ఉన్నాయి. దీని కన్నా ముఖ్యమైంది ఏమిటంటే భారతదేశ యువజనులు వారి కలల కు దేశం యొక్క అవసరాల తో, దేశం యొక్క ఆశల తో మరియు ఆకాంక్షల తో జోడించుకొన్నారు. ‘దేశాన్ని నిర్మించే కార్యం నాది. దీని ని నేను పూర్తి చేయవలసి ఉంది’ అనే భావన ఈ నాడు భారతదేశ యువత లో నిండివుంది.
మిత్రులారా,
దేశ యువత ఈ రోజు న నూతన యాప్స్ ను సృష్టిస్తోంది. ఫలితం గా వాటి తాలూకు లాభాలు వారి కి మాత్రమే కాక దేశ ప్రజల కు కూడా మేలు చేస్తోంది. ఇవాళ దేశ యువత సాంకేతిక విజ్ఞానం ద్వారా, హ్యాకథన్ స్ మాధ్యమం ద్వారా వారి యొక్క మస్తిష్కాల కు పదును పెడుతూ దేశం లో వేలాది సమస్యల కు పరిష్కార మార్గాల ను అన్వేషిస్తున్నారు. పరిష్కార మార్గాల ను శోధించి, సాధిస్తున్నారు. ప్రస్తుతం కొలువు ల స్వభావం లో చోటు చేసుకొంటున్న మార్పుల కు అనుగుణంగా దేశ యువత క్రొత్త సంస్థల ను నెలకొల్పుతూ వారి కోసం పని చేసుకోవడం తో పాటు ఇతరుల కు కూడా పని ని ఇచ్చేందుకు ధైర్యం తో కూడినటువంటి రిస్కుల ను తీసుకొంటున్నారు.
ఏ పథకాన్ని ఎవరు మొదలు పెట్టారు అని నేటి దేశ యువత చూడటం లేదు. వారు నాయకత్వం వహించడానికై ముందంజ ను వేస్తున్నారు. మన యువత స్వచ్ఛ్ భారత్ అభియాన్ కు నేతృత్వం వహిస్తున్నది. నేడు దేశ యువత పరిసర ప్రాంతాల నుండి, గృహాల లో నుండి, ఇరుగు పొరుగు ప్రదేశాల నుండి, నగరాల నుండి మరియు సముద్రపు ఒడ్డుల లో నుండి ప్లాస్టిక్ ను తొలగించడం కోసం సిద్ధమవుతున్నది.
మిత్రులారా,
దేశ యువజనుల సామర్ధ్యం తో ప్రస్తుతం ఒక ‘న్యూ ఇండియా’ను నిర్మించే పనులు జరుగుతున్నాయి; ఆ ‘న్యూ ఇండియా’లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తో పాటు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’కు కూడా తావు ఉంటుంది; ఆ ‘న్యూ ఇండియా’లో ‘ఎర్ర బల్బు’ గాని, విఐపి సంస్కృతి గాని ఉండదు; ఆ ‘న్యూ ఇండియా’లో ప్రతి ఒక్క మనిషి సమానం గా, ప్రతి ఒక్క మనిషి ముఖ్యం గా ఉంటారు; ‘న్యూ ఇండియా’ లో అవకాశాలు, ఇంకా విహరించేందుకు విశాలమైన నింగి ఉంటాయి.
మిత్రులారా,
ప్రస్తుత 21వ శతాబ్ద కాలం, అందులోని ఈ దశాబ్దం భారతదేశం కోసం ఒక మహద్భాగ్యాన్ని తీసుకు వచ్చాయి. మనం చేసుకున్న అదృష్టం ఏమిటంటే భారతదేశ జనాభా లో ఎక్కువ మంది 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు కావడం. ఇటీవలి కాలం లో భారతదేశం లో అనేక ప్రధాన నిర్ణయాల ను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని సంపూర్ణం గా వినియోగించుకోగలిగేలా ఎన్నో విధానాల కు రూపకల్పన జరిగింది. యువ శక్తి ని ఒక జాతీయ శక్తి గా తీర్చిదిద్దేందుకు ఒక బృహత్ ప్రయత్నం ప్రస్తుతం దేశం లో జరుగుతున్నది. నైపుణ్యాల కు సాన పట్టడం మొదలుకొని ముద్ర రుణం వరకు ప్రతి ఒక్క పద్ధతిన యువత కు అండదండల ను ఇవ్వడం జరుగుతోంది. స్టార్ట్-అప్ ఇండియా కావచ్చు, స్టాండ్-అప్ ఇండియా కావచ్చు, ఫిట్ ఇండియా ప్రచార ఉద్యమం కావచ్చు, లేదా ఖేలో ఇండియా కావచ్చు.. ప్రతి ఒక్కటి యువత పట్ల శ్రద్ధ తో కూడుకొన్నది.
నాయకత్వం లోను, నిర్ణయాలు చేయడం లోను యువత క్రియాశీల ప్రాతినిధ్యాని కి మేము ప్రాధాన్యాన్ని కట్టబెడుతున్నాము. మీరు వినే ఉంటారు ఇటీవలే నాకు డిఆర్‌డిఒ లో రక్షణ సంబంధిత పరిశోధన తాలూకు ‘యంగ్ సైంటిస్ట్ లేబ్స్’ అయిదిటి ని ఆరంభించే అవకాశం దక్కింది అన్న సంగతి ని. ఈ ప్రయోగశాలల్లో పరిశోధన నుండి నిర్వహణ వరకు పూర్తి నాయకత్వ బాధ్యతల ను 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన శాస్త్రవేత్తల కు ఇవ్వడమైంది. అంతటి ముఖ్యమైన ప్రయోగశాల లను 35 ఏళ్ళ కన్నా తక్కువ వయస్సు గల యువత కు అప్పజెప్పే పోకడ ను గురించి మీరు ఇదివరకు ఎన్నడూ ఆలకించి ఉండరేమో. కానీ, మా ఆలోచన విధానం ఇది; మా వైఖరి ఇది. మేము ఇటువంటి ప్రయోగాన్ని ప్రతి ఒక్క రంగం లో, ప్రతి ఒక్క స్థాయి లో ప్రవేశపెట్టే దిశ గా అదే పని గా కృషి చేస్తున్నాము.
మిత్రులారా,
సమస్యల కు క్రొత్త క్రొత్త పరిష్కారాల ను అన్వేషించగల అసాధారణమైనటువంటి సామర్ధ్యం యువతీయువకుల లో ఉంటుంది. ఈ తాజా ఆలోచనల సరళి ఊహించడాని
కి అయినా అసాధ్యం అనిపించేటటువంటి నిర్ణయాల ను ఎలా తీసుకోవాలో మనకు బోధిస్తుంది. ఈ ఆలోచనల పరంపర మనకు సమస్యల ను ఎదుర్కొనే మరియు సమస్యల ను తీర్చే పద్ధతుల ను సూచిస్తుంది. దేశం కూడాను ఇటువంటి ఆలోచనల ను అనుసరిస్తున్నది. ఇవాళ జమ్ము, కశ్మీర్ లో 370వ అధికరణాన్ని రద్దు చేయడమైంది. సుదీర్ఘ కాలం గా కొనసాగుతూ వచ్చిన రామ జన్మభూమి తాలూకు వివాదం సమసిపోయింది. మూడు సార్లు తలాక్ కు వ్యతిరేకం గా చట్టం రూపుదిద్దుకొంది. పౌరసత్వ (సవరణ) చట్టం వాస్తవ రూపం దాల్చింది. ఒక ఉగ్రవాద దాడి జరిగిన అనంతరం కిమ్మనకుండా ఉండిపోవడానికి అలవాటు పడ్డ మనస్తత్వం అంటూ ఒకటి దేశం లో ఉండేది. కానీ, ప్రస్తుతం మీరు వాయు దాడుల ను మరియు సర్జికల్ స్ట్రయిక్స్ ను చూశారు.
మిత్రులారా,
మా ప్రభుత్వం యువత వెన్నంటి ఉన్నది. అది యువజనుల స్ఫూర్తుల తో, యవ్వనభరితమైనటువంటి స్వప్నాల తో కలసివుంది. మీ యొక్క సాఫల్యం ఒక బలమైన, సమర్ధమైన మరియు సమృద్ధమైన భారతదేశం అనే సంకల్పాన్ని సైతం నెరవేర్చగలుగుతుంది. మరి, ఈ నాటి సందర్భం లో నేను మిమ్మల్ని ఒక అభ్యర్ధన సైతం చేయదలచుకొన్నాను. నేను మిమ్మల్ని విశ్వసిస్తున్న కారణం గా ఈ మేరకు అభ్యర్ధిస్తున్నాను.. మీ యొక్క నాయకత్వం లో దేశాన్ని విజయవంతం చేయండంటూ మిమ్ముల ను కోరుతున్నాను. మరి ఈ సంకల్పం వివేకానంద జయంతి నాడు మన బాధ్యత గా మారిపోతుంది.
మీకు అందరికీ తెలిసిన విషయమే.. 2022వ సంవత్సరం వచ్చే సరికి మన స్వాతంత్య్రాని కి 75 సంవత్సరాలు వస్తాయి అనేది. దేశ స్వాతంత్య్ర యోధులు ఒక సమృద్ధమైనటువంటి భారతదేశం కోసం స్వప్నించి, అందుకోసమే వారి యొక్క జీవితాల ను సమర్పణం చేశారు. ఆ మహాపురుషుల కలల ను పండించడం కోసం మనం ఎన్నో పనుల ను చక్కబెట్టవలసివుంది. నేను ఈ రోజు న మిమ్ముల ను కోరుతున్నాను, నేను యువత ను కోరుతున్నాను, నేను మిమ్ముల ను దేశమంతటా ఒక ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తారన్న అపేక్ష తో కోరుతున్నాను; 2022వ సంవత్సరం వచ్చే వరకు మనం సాధ్యమైనంతగా ఒక్క స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయగలమా? ఇలా చేయడం ద్వారా మీరు మీలో కొంత మంది యువ స్నేహితుల కు సహాయం చేయగలుగుతారు. మీరు మీ యొక్క లక్ష్యాల లో, మీ యొక్క జీవితాల లో సఫలం అవుతారన్న కామన తో మరియు ఆశ తో నేను నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను.
జాతీయ యువ దినం నాడు మరొక్క మారు నేను మీ అందరి కి అత్యంత శుభం జరగాలని అభిలషిస్తూ, భరతమాత మహా పుత్రుడైనటువంటి శ్రీ వివేకానందుల వారి చరణాల కు నమస్కరిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.
Sharing my message for the National Youth Festival in Lucknow. Highlighted a variety of issues including the thoughts of Swami Vivekananda and our Government’s efforts towards empowering India’s youth. https://t.co/SQ29QqmNNH
— Narendra Modi (@narendramodi) January 12, 2020