రైసీనా డైలాగ్ లో పాలు పంచుకోవడం కోసం భారతదేశాని కి విచ్చేసిన రశ్యన్ ఫెడరేశన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సర్జెయి లెవ్ రోవ్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.
రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తరఫున శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి కి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ లెవ్ రోవ్ అందజేశారు. ప్రధాన మంత్రి నూతన సంవత్సరం లో రశ్యన్ ప్రజల కు శాంతి మరియు సమృద్ధి ప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ వారి కి శుభకామనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి 2020వ సంవత్సరం జనవరి 13వ తేదీ న అధ్యక్షుడు శ్రీ పుతిన్ తో టెలిఫోన్ ద్వారా జరిగిన విస్తృత చర్చ తో పాటు గత సంవత్సరం లో ఉభయ దేశాల మధ్య ప్రత్యేక మరియు విశేషాధికారాల తో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యం లో చోటు చేసుకొన్న పురోగతి ని కూడా ప్రస్తావించారు.
విజయ దినం తాలూకు 75వ వార్షికోత్సవాల లో పాలు పంచుకోవడాని కి 2020వ సంవత్సరం మే మాసం లో, అలాగే ఎస్‌సిఒ సమిట్, ఇంకా బ్రిక్స్ సమిట్ లలో పాలు పంచుకోవడం కోసం 2020వ సంవత్సరం జులై లో ప్రధాన మంత్రి రశ్యా సందర్శన కై అధ్యక్షుడు శ్రీ పుతిన్ నిరీక్షిస్తున్నారని విదేశాంగ మంత్రి శ్రీ లెవ్ రోవ్ చెప్పారు. అధ్యక్షుడు శ్రీ పుతిన్ తో భేటీ కావడం కోసం అనేక సందర్భాలు ఈ సంవత్సరం లో ప్రాప్తిస్తున్నాయంటూ ప్రధాన మంత్రి సహర్షం గా పలికారు. తాను కూడా ఈ సంవత్సరం చివర లో వార్షిక ద్వైపాక్షిక శిఖర సమ్మేళనం జరుగనున్న సందర్భం లో అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు భారతదేశం లో ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు తాను ఎంతో కుతూహలం తో వేచి ఉన్నానని ఆయన అన్నారు.
ఇరు దేశాల కు మధ్య 2019వ సంవత్సరం లో అనేక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమైంది మరి వాటి ఫలితాలు ఒనగూరాయని ప్రధాన మంత్రి అన్నారు. 2020వ సంవత్సరం రశ్యన్ ఫెడరేశన్ కు మరియు భారతదేశాని కి మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి 20వ వార్షికోత్సవ సందర్భం కూడా అని ఆయన పేర్కొంటూ, ఈ సంవత్సరం ఆయా నిర్ణయాల అమలు సంవత్సరం కూడా కావాలి అని ఆయన అభిలషించారు.
విదేశాంగ మంత్రి శ్రీ లెవ్ రోవ్ కీలకమైనటువంటి ప్రాంతీయ అంశాలు మరియు అంతర్జాతీయ అంశాల లో రశ్యా యొక్క వైఖరి ని ప్రధాన మంత్రి కి వివరించారు.
**
Foreign Minister of the Russian Federation Mr. Sergey Lavrov meets Prime Minister @narendramodi. https://t.co/bxfwzo1YKs
— PMO India (@PMOIndia) January 15, 2020
via NaMo App pic.twitter.com/a2utrsCLAu