ధ్రువ సంబంధి విజ్ఞాన శాస్త్రం లో సహకారం అంశం పై భారతదేశ పృథ్వీ శాస్త్రాల మంత్రిత్వ శాఖ (ఎంఒఇఎస్) కు మరియు స్వీడన్ కు చెందిన విద్య మరియు పరిశోధన మంత్రిత్వ శాఖ కు మధ్య కుదిరిన ఒప్పందాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకురావడమైంది. ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పై 2019వ సంవత్సరం లో డిసెంబర్ 2వ తేదీ న సంతకాలు అయ్యాయి.
పర్యావరణ పరిరక్షణ అంశం పై అంటార్క్ టిక్ ట్రీటీ కి సంబంధించిన ప్రోటోకాల్ మరియు అంటార్క్ టిక్ ట్రీటీ లు రెంటికి భారతదేశం మరియు స్వీడన్ లు రెండూ సంతకందారులు గా ఉన్నాయి. ఆర్క్ టిక్ దేశాలు ఎనిమిదిటిలో ఒక దేశం గా స్వీడన్ ఆర్క్ టిక్ కౌన్సిల్ లో ఒక సభ్యత్వ దేశం గా ఉండింది. కాగా ఆర్క్ టిక్ కౌన్సిల్ లో భారతదేశం అబ్జర్వర్ హోదా ను కలిగివుంది. ఆర్క్ టిక్ మరియు అంటార్క్ టిక్ .. ఈ రెండు ధ్రువ ప్రాంతాల లో స్వీడన్ చురుకైన వైజ్ఞానిక కార్యక్రమాల ను నిర్వహిస్తున్నది. అదే విధం గా భారతదేశం జోడు ధ్రువ ప్రాంతాలతో పాటు మహాసముద్ర ప్రాంతం లో సైతం వైజ్ఞానిక కార్యక్రమాల ను అమలుపరుస్తున్నది.
ధ్రువ సంబంధి విజ్ఞాన శాస్త్రం లో భారతదేశానికి మరియు స్వీడన్ కు మధ్య సహకారం ఈ రెండు దేశాలలోను లభ్యం అయ్యే నైపుణ్యాన్ని పరస్పరం పంచుకొనేటందుకు వీలు కల్పిస్తుంది.