Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేట‌రిస్ అయిదింటి ని దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి


డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేట‌రిస్ అయిదింటి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బెంగ‌ళూరు లోని డిఫెన్స్ రిస‌ర్చ్ ఎండ్ డివెల‌ప్‌ మెంట్ ఆర్గ‌నైజేశన్ (డిఆర్‌డిఒ)లో దేశ ప్ర‌జ‌ల కు ఈ రోజు న‌ అంకితం చేశారు.

డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లాబరేట‌రిస్ (డివైఎస్ఎల్ స్‌)లు అయిదు న‌గ‌రాల లో ఏర్పాట‌య్యాయి. ఆ న‌గ‌రాలు.. బెంగ‌ళూరు, ముంబ‌యి, చెన్నై, కోల్‌కాతా మ‌రియు హైద‌రాబాద్‌. ప్ర‌తి ఒక్క ప్ర‌యోగ‌శాల ఆర్టిఫిశ‌ల్ ఇంటెలిజెన్స్, క్వాంట‌మ్ టెక్నాల‌జీస్, కాగ్నిటివ్ టెక్నాలజీస్, అసిమెట్రిక్ టెక్నాల‌జీస్, ఇంకా స్మార్ట్ మెటీరియ‌ల్స్ ల వంటి భ‌విష్య‌త్తు లో అనుసరించ‌ద‌గ్గ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ లను అభివృద్ధి ప‌ర‌చ‌డం కోసం ప్రాముఖ్యం క‌లిగిన ఒక కీల‌క‌మైన అధునాత‌న సాంకేతిక విజ్ఞానాన్ని ఆవిష్క‌రించ‌డం గురించి కృషి చేస్తుంది.

ఈ త‌ర‌హా ప్ర‌యోగ‌శాల‌ లను ఏర్పాటు చేయాల‌న్న ప్రేర‌ణ 2014వ సంవ‌త్స‌రం ఆగ‌స్టు 24వ తేదీ న జ‌రిగిన డిఆర్‌డిఒ పుర‌స్కార కార్య‌క్ర‌మ సంద‌ర్భం లో స్వ‌యం గా ప్ర‌ధాన మంత్రి నుండే ల‌భించింది. శ్రీ న‌రేంద్ర మోదీ అప్ప‌ట్లో యువ‌జ‌నుల కు సాధికారిత ను క‌ల్పించ‌వ‌ల‌సింది గా డిఆర్‌డిఒ కు సూచ‌న చేశారు.

అందుకు గాను వారి కి స‌వాళ్ళ తో కూడిన ప‌రిశోధ‌న సంబంధిత అవ‌కాశాల ను మ‌రియు నిర్ణ‌యాల ను చేసేట‌టువంటి అధికారాల ను ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు.

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగ క్రమం లో, దేశం లో ఆవిర్భ‌వించే సాంకేతిక ప‌రిజ్ఞాన రంగం లో ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి తాలూకు ఆకృతి ని మ‌ల‌చ‌డం లో ఈ ప్ర‌యోగ‌శాల లు స‌హాయ‌కారి కాగ‌లుగుతాయ‌న్నారు.

ఒక క్రొత్త ద‌శాబ్ది కి స్థిరమైనటువంటి మార్గ‌సూచీ ని రూపొందించవలసింది గా శాస్త్రవేత్తల‌ ను ప్ర‌ధాన మంత్రి కోరారు. అటువంటి నూత‌న ద‌శాబ్ది లో డిఆర్‌డిఒ భార‌త‌దేశం లోని వివిధ రంగాల లో శాస్త్ర ప‌రిశోధ‌న లకు వేగాన్ని మ‌రియు దిశ ను నిర్దేశించే స్థితి లో ఉండాలి అని ఆయ‌న అన్నారు.

శాస్త్రవేత్త‌ల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, భార‌త‌దేశం యొక్క క్షిప‌ణి కార్య‌క్ర‌మం ప్ర‌పంచం లోని విశిష్ట కార్య‌క్ర‌మాల లో ఒక‌ కార్యక్రమం గా ఉంద‌న్నారు. ఆయ‌న భార‌త అంత‌రిక్ష కార్య‌క్ర‌మాన్ని మ‌రియు వాయు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ల‌ను కూడా ప్రశంసించారు.

విజ్ఞానశాస్త్ర ప‌రిశోధ‌న రంగం లో భార‌త‌దేశం వెనుక‌బ‌డి ఉండ‌జాల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. జాతీయ భ‌ద్ర‌త కోసం అవ‌స‌ర‌మైన నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లు మ‌రియు సాంకేతిక ప‌రిజ్ఞానాల కోసం కాలాన్ని వెచ్చించ‌గ‌లిగేలా శాస్త్రవేత్త‌ల స‌ముదాయం తో క‌ల‌సి అద‌న‌పు కృషి చేయ‌డం లో పాలు పంచుకోవ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధం గా ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

మేక్ ఇన్ ఇండియా వంటి కార్య‌క్ర‌మాల ను ప‌టిష్ట ప‌ర‌చ‌డం లోను, అలాగే దేశం లో ఒక హుషారైన ర‌క్ష‌ణ రంగాన్ని ప్రోత్స‌హించ‌డం లోను డిఆర్‌డిఒ యొక్క నూత‌న ఆవిష్క‌ర‌ణ లు ఒక ప్ర‌ధాన‌మైన పాత్ర ను పోషించగలవు అని ఆయ‌న అన్నారు.

.
డిఆర్‌డిఒ యంగ్ సైంటిస్ట్ స్ లా బ్స్ ను అయిదింటి ని ఏర్పాటు చేయ‌డం తో భావి త‌రాల లో అనుస‌రించ‌ద‌గిన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి ప‌ర‌చ‌డం మ‌రియు త‌త్సంబంధిత ప‌రిశోధ‌న‌లు చేయ‌డం కోసం పునాది ని వేసిన‌ట్టు అవుతోంది. భార‌త‌దేశాన్ని స్వయంసహాయ దేశం గా తీర్చిదిద్దే ల‌క్ష్యం నుండి ర‌క్ష‌ణ సంబంధిత సాంకేతిక విజ్ఞాన ప‌రం గా భావి అవ‌స‌రాల కు త‌గిన‌ది గా ఉండేట‌ట్లు ఒక పెద్ద ముంద‌డుగు ను డిఆర్‌డిఒ వేసే విధం గా ఈ ప్ర‌యోగ‌శాల ల స్థాప‌న దోహ‌ద‌ప‌డుతుంది.

శ‌ర‌వేగం గా మార్పుల కు లోన‌వుతున్న‌టువంటి ఆర్టిఫిశ‌ల్ ఇంటెలిజెన్స్ రంగం లో ప‌రిశోధ‌న ను బెంగ‌ళూరు లో చేప‌డుతారు. అత్యంత ప్రాముఖ్యం క‌లిగిన‌టువంటి క్వాంట‌మ్ టెక్నాల‌జీ రంగం లో ప‌రిశోధ‌న లు ఐఐటి ముంబ‌యి కేంద్రం గా సాగుతాయి. భ‌విష్య‌త్ కాలం కాగ్నిటివ్ టెక్నాల‌జీస్ పైన ఆధార‌ప‌డి ఉంటుంది కాబట్టి ఈ రంగం లో ప‌రిశోధ‌న కు న‌డుం బిగించే ప్ర‌యోగ‌శాల కు ఐఐటి చెన్నై నిల‌యం గా ఉంటుంది. యుద్ధాలు చేసే ప‌ద్ధ‌తుల ను మార్చివేయ‌గ‌లిగిన‌టువంటి అసిమెట్రిక్ టెక్నాల‌జీస్ సంబంధిత ప‌రిశోధ‌న ల‌కు కోల్‌కాతా లోని జాద‌వ్‌ పుర్ యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణం కేంద్ర స్థానం గా ఉంటుంది. ఇక, స్మార్ట్ మెటీరియ‌ల్స్ మ‌రియు వాటి వినియోగ ప‌ద్ధ‌తులు అనేవి మ‌రొక అత్యంత కీల‌క‌మైన రంగం గా ఉంది. ఈ రంగం లో ప‌రిశోధ‌న ను హైద‌రాబాద్ ముఖ్య స్థానం గా చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.