Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అసోచామ్ కు వంద సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భం గా ఏర్పాటు చేసిన ప్రారంభ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


అసోచామ్ అధ్య‌క్షుడు బాల‌కృష్ణ గోయంకా గారు, సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ శ్రీ దీప్ సూద్ గారు, అసోచామ్ కు చెందిన ల‌క్ష‌లాది స‌భ్యులు, భార‌త‌దేశ పారిశ్రామిక రంగ ప్ర‌ముఖులు, ఇత‌ర ప్ర‌ముఖులు, ఇక్క‌డ‌ కు హాజ‌రు అయిన మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా,

అసోచామ్ ఈ రోజు న ఒక అతి ముఖ్య‌మైనటువంటి మైలు రాయిని అధిగ‌మించింది.  ఒక సంస్థ గాని, లేదా ఒక వ్య‌క్తి గాని వంద సంవ‌త్స‌రాల అనుభ‌వాన్ని గ‌డించారు అంటే అప్పుడు అది ఎంతో అమూల్య‌మైన‌టువంటి విష‌యం అవుతుంది.

అసోచామ్ స‌భ్యులు అంద‌రికీ ఇవే నా అభినంద‌న‌ లు.

ఈ కార్య‌క్ర‌మాన్ని వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దాదాపు గా ఒక 100 చోట్ల ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న‌ట్టు నాతో చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మం తో ముడిప‌డిన అంద‌రి ని- న‌వ పారిశ్రామికుల‌ ను, అలాగే ప్ర‌త్యేకించి ఎమ్ఎస్‌ఎమ్ఇ రంగం తో సాన్నిహిత్యం ఉన్న వారి ని-  నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

2019వ సంవ‌త్స‌రం ముగియడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలివున్నాయి.  నూత‌న సంవ‌త్స‌రమైన 2020 తో పాటు నూత‌న ద‌శాబ్దం మీకు అంద‌రి కి సుఖాన్ని, స‌మృద్ధి ని మరియు సాఫ‌ల్య‌త ను ప్ర‌సాదించు గాక‌; మీరు మీ యొక్క ల‌క్ష్యాల ను సాధించెద‌రు గాక‌.  ఈ ఆకాంక్ష తో నేను నా యొక్క ప్ర‌సంగాన్ని మొద‌లుపెడుతున్నాను.  

మిత్రులారా,

మీరు మీ శ‌తాబ్ది ఉత్స‌వం కోసం ఎంపిక చేసుకొన్న ఇతివృత్తం దేశ ప్ర‌జ‌ల యొక్క మ‌రియు దేశం యొక్క స్వ‌ప్నాల తో, ల‌క్ష్యాల తో జోడించబడి ఉంది.  మ‌రి భార‌త‌దేశాన్ని 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ క‌లిగినటువంటి ఒక ఆర్థిక వ్య‌వ‌స్థ గా తీర్చిదిద్దే అంశం హ‌ఠాత్తు గా రేకెత్తిందేమీ కాదు.  ఈ త‌ర‌హా ల‌క్ష్యాల ను నిర్దేశించుకోగ‌ల‌గ‌డం తో పాటు వాటి ని సాధించేటంత గా దేశం గ‌డ‌చిన అయిదు సంవ‌త్స‌రాల కాలం లో ప‌టిష్టం అయింది.  5-6 సంవ‌త్స‌రాల క్రితం మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ ఒక వినాశం దిశ గా ప‌య‌నించిన సంగతి మీకు అందరి కి తెలిసినటువంటి విషయమే.   దీని ని ఆపివేయ‌డమొక్కటే కాకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ లో ఒక క్ర‌మ‌శిక్ష‌ణ ను తీసుకు రావ‌డం కోసం మా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది.  

మేము వ్య‌వ‌స్థ లో ప్రాథ‌మిక‌మైన‌టువంటి మార్పుల ను ప్ర‌వేశ‌పెట్టాము.  అన్ని రంగాల లో నిర్ణ‌యాలు తీసుకొన్నాము.  అంతేకాకుండా భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కొన్ని నియ‌మాల పై ఆధార‌ప‌డి, త‌న ల‌క్ష్యాల దిశ గా కదిలేట‌ట్లుగా ద‌శాబ్దాల నాటి ప‌రిశ్ర‌మ‌ల యొక్క కోర్కెల ను నెర‌వేర్చ‌డం ప‌ట్ల శ్ర‌ద్ధ ను వ‌హించాము.   మ‌రి ప్ర‌స్తుతం ఒక 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ క‌లిగిన ఆర్థిక వ్య‌వ‌స్థ కోసం బ‌ల‌మైన పునాది ని వేయ‌డం జ‌రిగింది.  మేము భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ను ఫార్మ‌లైజేశన్‌, ఇంకా మాడర్నైజేశన్ అనేట‌టువంటి రెండు ముఖ్య స్తంభాల మీద కు తీసుకు పోతున్నాము.  డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ ను పెంచ‌డం, జిఎస్‌టి, ఆధార్ తో ముడిపెట్టిన చెల్లింపు మ‌రియు డిబిటి ల వంటి వివిధ ప్ర‌య‌త్నాల ను చేప‌ట్టడం జ‌రిగింది.  త‌ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు చెందిన అనేక అంశాల ను ఒక క్రమబద్ధ వ్య‌వ‌స్థ లోకి తీసుకు రావాల‌న్న‌దే దీని లోని ఉద్దేశ్యం.

దీనికి తోడు మ‌నం ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకొని, ఆర్థిక వ్య‌వ‌స్థ ను శీఘ్ర‌త‌రం చేసే దిశగాను, అధునాత‌నం చేసే దిశ గా కూడాను సాగాము.   

ప్ర‌స్తుతం ఒక కంపెనీ ని న‌మోదు చేయడాని కి అనేక వారాల కు బ‌దులుగా కేవ‌లం కొన్ని గంట‌లు స‌రిపోతున్నాయి.  స‌రిహ‌ద్దుల వెంబ‌డి వ్యాపారానికి పట్టే కాలాన్ని యాంత్రీక‌ర‌ణ ద్వారా త‌గ్గించ‌డం కూడా జ‌రిగింది.  మౌలిక స‌దుపాయాల ను ఉత్త‌మ‌మైన ప‌ద్ధ‌తి లో సంధానించ‌డం ద్వారా విమానాశ్ర‌యాల లో, నౌకాశ్ర‌యాల లో ట‌ర్న్ అరౌండ్ టైమ్ లో త‌గ్గింపు చోటు చేసుకొంది.  ఇవి అన్నీ ఆధునికమైనటువంటి ఆర్థిక వ్య‌వ‌స్థ కు ఉదాహరణలు గా ఉన్నాయి.

మిత్రులారా,

ప్ర‌స్తుతం దేశం లో పారిశ్రామిక ప్రపంచాని కి చెవి ని ఒగ్గుతున్నటువంటి ప్ర‌భుత్వమొక‌టి ఏర్ప‌డింది.  అది వాటి యొక్క అవ‌స‌రాల‌ ను అర్థం చేసుకొని, వాటి స‌ల‌హాల‌ కు అనుగుణం గా పూర్తి సంవేదనశీలత్వం తో కృషి చేస్తున్న‌ది.   దేశం లో ప‌న్ను ల వ‌ల‌యం ప‌రిధి త‌గ్గాలని, ప్ర‌తి ఒక్క రాష్ట్రం లో వేరు వేరు ప‌న్ను రేటు ల స‌మ‌స్య బారి నుండి బ‌య‌ట ప‌డాల‌ని పారిశ్రామిక జ‌గ‌తి భావించ‌డం లేదా?   ఈ కోర్కె ను మా ప్ర‌భుత్వం రేయింబ‌గ‌ళ్ళు శ్ర‌మించి, తీర్చింది.  పైపెచ్చు వ్యాపార జ‌గ‌త్తు నుండి మాకు అందిన‌టువంటి ప్ర‌తిస్పంద‌న‌ లు అన్నిటి ని దృష్టి లో పెట్టుకొని మేము జిఎస్‌ టి ని సంస్క‌రించ‌డం మ‌రియు మెరుగు ప‌ర‌చ‌డం చేస్తూ వ‌స్తున్నాము. 

మిత్రులారా,

భార‌త‌దేశ పారిశ్రామిక ప్ర‌పంచం సంవ‌త్స‌రాలు గా ఒక సీదా సాదా వ్యాపార  ప్ర‌క్రియ కోసం ప‌ట్టుబ‌డుతూ వ‌స్తున్న‌ది.  అది ప్ర‌క్రియ‌ల ను సీదా సాదా గాను, పార‌ద‌ర్శ‌కం గాను ప్ర‌భుత్వం తీర్చిదిద్దాలి అని అపేక్షించింది.  మీ డిమాండ్ మేరకు మా ప్రభుత్వమూ వ్యవహరించింది.  ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో అగ్రగామి పది దేశాల సరసన నిలచింది.  భారతదేశం గత మూడు సంవత్సరాల లో ఉత్త‌మ‌మైన రీతి న వ్యాపార నిర్వ‌హణ లో సౌల‌భ్యం తాలూకు స్థానాన్ని వ‌రుస‌ గా మెరుగు ప‌ర‌చుకొంది.  మ‌నం ప్ర‌స్తుతం 190 దేశాల ర్యాంకింగు లో 142వ స్థానం నుండి 63వ స్థానాని కి పురోగ‌మించాము.  ఇది ఏమైనా సుల‌భ‌మైన ప‌నేనా?
 
ఇది నాలుగు ప‌దాలతో కూడిన మాటే అయినప్ప‌టి కి క‌ఠోర శ్ర‌మ కు తోడు క్షేత్ర స్థాయి లో నియ‌మాలు మారిన‌పుడు మాత్ర‌మే ర్యాంకింగ్ అనేది మారుతుంది.  

అది విద్యుత్తు క‌నెక్ష‌న్ లు, నిర్మాణం సంబంధిత అనుమ‌తులు ఇవ్వడం కావచ్చు, లేదా ఎగుమ‌తి- దిగుమ‌తి ల‌కు సంబంధించిన ఆమోదాలు ఇవ్వ‌డం కావ‌చ్చు వంద‌ల కొద్దీ ప్ర‌క్రియ‌ల ను స‌ర‌ళ‌త‌రం చేసి, ఎన్నో అడ్డంకుల‌ ను ఏక మొత్తం గా తొల‌గించిన‌ప్పుడు ర్యాంకింగులు మెరుగు ప‌డుతాయి.  దీని ని ఇకముందు కూడా అదే ప‌ని గా సంస్కరించే పని లో పడ్డాము.

మిత్రులారా,
 
చిన్న పొర‌పాటుల కు సైతం క్రిమినల్ యాక్షన్ ను చేపట్టేందుకు అనుమ‌తించిన‌ అటువంటి కంపెనీల చ‌ట్టం యొక్క నిబంధ‌న‌లు వంద‌ల కొద్దీ ఉన్నాయ‌న్న సంగ‌తి మీలో చాలా మంది ఎరుగుదురు.  ఈ నిబంధ‌న‌ల ను అనేకం మా ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం నేర ప‌రిధి లో నుండి త‌ప్పించింది.  నేరం కింద‌కు వ‌చ్చే మ‌రిన్ని నిబంధ‌న‌ల ను కొట్టివేసే ప్ర‌క్రియ పురోగ‌మిస్తోంది.

అదే మాదిరి గా మా ప్ర‌భుత్వం ‘ఇన్‌ వ‌ర్టెడ్ డ్యూటీ’ని ముగించి వేసే దిశ గా నిరంత‌రం గా కృషి చేస్తున్నది.  గ‌డ‌చిన బ‌డ్జెటు లో దీనిని గురించి శ్ర‌ద్ధ తీసుకోవ‌డమైంది.  ఈ కారణం గా భార‌త‌దేశం లో త‌యారీ కి అయ్యే వ్య‌యం కూడా దిగి వ‌స్తోంది.  

మిత్రులారా,

ఈ సంవ‌త్స‌రం లో అక్టోబ‌రు నెల మొద‌లుకొని దేశ ప‌న్నుల సంబంధిత వ్య‌వ‌స్థ లో మ‌రొక చ‌రిత్రాత్మ‌క‌మైన ఆరంభం అంటూ ఒక‌టి చోటు చేసుకొన్నది.  మేము ప‌న్ను చెల్లింపుదారు కు మ‌రియు ఆదాయ‌పు ప‌న్నుల విభాగాని కి మ‌ధ్య ఎటువంటి మాన‌వ జోక్యం ఉండ‌న‌టువంటి దిశ గా అడుగు వేశాము.  ప‌న్నుల వ్య‌వ‌స్థ లో పార‌ద‌ర్శ‌క‌త్వాని కి, ద‌క్ష‌త కు మ‌రియు జ‌వాబుదారీ కి చోటు క‌ల్పిస్తూ, ఫేస్ లెస్ టాక్స్ అడ్మినిస్ట్రేశన్ వైపు సాగి పోతున్నాము.

మిత్రులారా,

కార్పొరేట్ ప‌న్ను ను త‌గ్గించ‌డాని కి, త‌త్సంబంధిత ప్ర‌క్రియ ను సుల‌భ‌త‌రం గా మార్చ‌డాని కి దేశం లో ఏళ్ళ త‌ర‌బ‌డి అనేక చ‌ర్చ‌లు జ‌రిగాయి.  ఈ విష‌యం లో కూడాను నిర్ధుష్ట‌మైన చ‌ర్య‌ల ను చేప‌ట్టింది ఎవ‌రు?  అది మా ప్ర‌భుత్వ‌మే.  దేశం లో ఇవాళ కార్పొరేట్ టాక్స్ ఇంత త‌క్కువ‌ గా ఇదివ‌ర‌కు ఎన్న‌డూ లేదు.  దీని కి అర్థం ఏమిటి అంటే ప‌రిశ్ర‌మ‌ల పై అతి త‌క్కువ కార్పొరేట్ ప‌న్ను రేటు ను విధించిన ప్ర‌భుత్వం ఏదైనా ఉంది అంటే గ‌నుక అది మా యొక్క ప్ర‌భుత్వ‌మే.
 
మిత్రులారా,

శ్రామిక సంస్క‌ర‌ణ‌ల కు సంబంధించిన చ‌ర్చ‌ లు సైతం దేశం లో అనేక సంవ‌త్స‌రాలు గా జరుగుతున్నాయి.  శ్రామిక వ‌ర్గాని కి ఏదీ చేయ‌క‌పోవ‌డం ఉత్త‌మం అని న‌మ్మిన వారు కూడా కొంత మంది ఉన్నారు.  అంటే, ఎక్క‌డ ఉన్న‌ది అలాగే వ‌ద‌లి వేయ‌డమూ, అదే ప‌రిస్థితి ని కొన‌సాగేందుకు అనుమ‌తించ‌డమూను.  కానీ, మా ప్ర‌భుత్వం దాని ని న‌మ్మ‌డం లేదు.  

శ్రామిక శ‌క్తి ని కూడా ప్ర‌తి ఒక్క విధం గా సంర‌క్షించాల‌ని మేము విశ్వ‌సిస్తాము.  వారి జీవితాల ను సుల‌భ‌త‌రం గా మార్చాలి.  వారు భ‌విష్య నిధి ని మ‌రియు ఆరోగ్య సేవ‌ల లాభాల ను స‌కాలం లో అందుకోవాలి.  ఈ అన్ని రంగాల లో ప్ర‌భుత్వం కృషి చేసింది.

ఈ కార‌ణం గా ప‌రిశ్ర‌మ యొక్క మ‌రియు కార్మిక సంఘాల యొక్క సూచ‌న‌ల ను దృష్టి లో పెట్టుకొని మేము ప్ర‌స్తుతం త‌క్ష‌ణావ‌స‌ర‌మైన రీతి న శ్రామిక చ‌ట్టం లో ఎన్నో మార్పుల ను చేశాము.  అయితే, మిత్రులారా, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ను బ‌ల‌మైంది గాను, పార‌ద‌ర్శ‌క‌మైంది గాను  తీర్చిదిద్ద‌డం కోసం ప‌రిశ్ర‌మ‌ల కు హిత‌క‌ర‌మైన విధం గా మేము చేసే ప్ర‌తి ఒక్క నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించ‌డం త‌మ యొక్క బాధ్య‌త అని కొంత మంది ఆలోచ‌న లు చేస్తున్నారు.

2014వ సంవ‌త్స‌రం క‌న్నా ముందు ఆర్థిక వ్య‌వ‌స్థ కు చేటు జ‌రుగుతూ ఉన్న‌ప్పుడు ఆర్థిక వ్య‌వ‌స్థ స్థితి కి బాధ్యులు అయిన వారు మౌనం గా ఎలా ఉన్న‌దీ దేశ ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌ర‌చి పోకూడ‌దు.

మాకు వార‌స‌త్వం గా అందిన‌టువంటి ఆర్థిక వ్య‌వ‌స్థ యొక్క వివ‌రాల ను గురించి గాని, లేదా వార్తాప‌త్రిక‌లు ప్ర‌చురించిన క‌థ‌నాల తీరు ఏ విధం గా ఉంద‌న్న‌ది గాని, లేదా అంత‌ర్జాతీయ స్థాయి లో దేశం యొక్క విశ్వ‌స‌నీయ‌త తీరును గురించి గాని- ఈ వివ‌రాల జోలి కి నేను వెళ్ళ‌ద‌ల‌చుకోలేదు.  కానీ, ఆ కాలం లో నెల‌కొన్న ప‌రిస్థితుల ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డాని కి మేము తీసుకొన్న శాశ్వ‌త చ‌ర్య‌లు ఒక 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ కు భారీ పునాది ని వేశాయి.

మిత్రులారా,

2014వ సంవ‌త్స‌రాని క‌న్నా ముందు దేశ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ లో త‌ల ఎత్తిన సంక్షోభం ఏ విధ‌మైనది అన్న‌ది మీకు అంద‌రికీ బాగా తెలుసు ను.  అప్ప‌ట్లో ప‌రిస్థితి ఎలా ఉండేదంటే బ్యాంకులు న‌ష్టాల ను పూడ్చ‌టం కోసం సుమారు గా 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మూల‌ధ‌నాన్ని స‌ర్దుబాటు చేయ‌వ‌ల‌సి వ‌చ్చింది.  ప్ర‌భుత్వం ఇంద్ర‌ధ‌నుష్ ప‌థ‌కం లో భాగం గా 70 వేల కోట్ల రూపాయ‌ల ను, మ‌రి అలాగే మూల‌ధ‌న పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ద్వారా 2 ల‌క్ష‌ల 36 వేల కోట్ల రూపాయ‌ల ను అందించ‌డం జ‌రిగింది.

మిత్రులారా,

ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌స్తుతం 13 బ్యాంకులు తిరిగి లాభాల‌ ను ఆర్జించాయి.  6 బ్యాంకులు పిసిఎ నుండి బ‌య‌ట ప‌డ్డాయి.  మేము బ్యాంకుల విలీనాన్ని కూడా శీఘ్ర‌త‌రం చేశాము.  బ్యాంకు లు ప్ర‌స్తుతం వాటి యొక్క దేశ‌వ్యాప్త నెట్‌వ‌ర్క్ ను విస్త‌రించుకొంటూ, త‌మ వ్యాప్తి ని ప్ర‌పంచ స్థాయి కి తీసుకు పోయేందుకు సిద్ధం గా ఉన్నాయి.   బ్యాంకు ల వ్యాపార‌ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ లో ఎటువంటి జోక్యాని కి అయినా మా ప్ర‌భుత్వం స్వ‌స్తి ప‌లికింది.  

ప్ర‌భుత్వ ప్ర‌మేయం లేకుండా ఒక పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్ధ‌తి లో అర్హ‌త క‌లిగిన వ్య‌క్తుల‌ ను నియ‌మించ‌డం కోసం బ్యాంకు బోర్డ్ బ్యూరో ను ఏర్పాటు చేయ‌డ‌మైంది.  వెలుప‌లి నిపుణులు మ‌రియు ఆర్‌బిఐ ల ద్వారా బ్యాంకు లకు పూర్తి స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి ని క‌ల్పించ‌డమైంది.  ఇక మీరు బ్యాకుల లో ఉన్న‌త స్థానాల కు నియామ‌కం జ‌రిగినపుడు, ఎటువంటి గుసగుస‌ల‌ ను విన‌రేమో.

మిత్రులారా,

మా ప్ర‌భుత్వం న‌మ్మేది ఏమిటి అంటే వ‌ర్ధిల్లుతున్న‌టువంటి ఒక ఆర్థిక వ్య‌వ‌స్థ లో అనేక ప‌ర్యాయాలు మ‌నం కంపెనీ ల వైఫ‌ల్యాన్ని కూడా స్వీక‌రించ‌వ‌ల‌సి ఉంటుంది అనేదే.  అన్ని వైఫ‌ల్యాలు, ఏ ఆర్థిక నేరం కార‌ణం గానో త‌ల ఎత్తేటటువంటివే కావు.  కాబ‌ట్టి, ప్ర‌భుత్వం అటువంటి కంపెనీల కు మ‌రియు వాటి య‌జ‌మానుల కు ఒక ఉత్త‌మ‌మైన‌ నిష్క్ర‌మ‌ణ మార్గాన్ని ఇవ్వ‌డం పట్ల కూడాను శ్ర‌ద్ధ తీసుకొన్నది.

ఇవాళ‌, ఇన్‌సోల్వన్సి ఎండ్ బ్యాంక్‌ ర‌ప్ట‌సి కోడ్ (ఐబిసి) ఏదో ఒక కార‌ణం గా వైఫ‌ల్యాల బారిన ప‌డ్డ ఎన్నో కంపెనీల‌ కు స‌హాయ‌కారి గా నిల‌బ‌డుతోంది.  

అటువంటి కంపెనీ లు వాటి యొక్క అనుభ‌వాల నుండి పాఠాల ను నేర్చి, భ‌విష్య‌త్తు లో కొంత ఉత్త‌మ‌మైన ప‌ని ని చేసేట‌ట్లు గా వాటి కి ప్ర‌భుత్వం చేదోడు గా ఉండేందుకు సాగిన ఒక ప్ర‌య‌త్న‌మే ఇది.

మిత్రులారా,

ఈ నిర్ణ‌యాలు అన్నీ కూడాను ప‌రిశ్ర‌మ ను మ‌రియు ప‌రిశ్ర‌మ యొక్క మూల‌ధ‌నాన్ని ప‌రిర‌క్షించ‌డం లో ఎంతో స‌హాయ‌కారి కానున్నాయి.

ఇవాళ‌, అసోచామ్ వేదిక మీది నుండి నేను దేశం లో బ్యాంకింగ్ తో సాన్నిహిత్యం క‌లిగిన‌టువంటి ప్ర‌జ‌ల కు, కార్పొరేట్ జ‌గ‌తి కి చెందిన ప్ర‌జ‌ల కు ఒక హామీ ని ఇవ్వ‌ద‌ల‌చుకొన్నాను.  అది ఏమిటంటే, గ‌త కాల‌పు బ‌ల‌హీన‌త‌ల ను చాలా వ‌ర‌కు అధిగ‌మించ‌డం జ‌రిగింది అనేదే.  అందువ‌ల్ల బాహాటం గా నిర్ణ‌యాలు తీసుకోవ‌ల‌సింద‌ని, స్వేచ్ఛ గా పెట్టుబ‌డి పెట్టండి అని, అలాగే, స్వ‌తంత్రించి ఖ‌ర్చు చేయండి అని మీకు సూచిస్తున్నాను.  స‌రి అయిన రీతి లో చేసిన నిర్ణ‌యాల పై, అలాగే నిజాయ‌తీ తో కూడిన వ్యాపార నిర్ణ‌యాల పై ఎటువంటి అసమంజ‌స‌మైన చ‌ర్య ఉండ‌బోద‌ని నేను భ‌రోసా ను ఇస్తున్నాను.

మిత్రులారా,

దేశ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ యొక్క పునాది ప్ర‌స్తుతం ఎంత పార‌ద‌ర్శ‌కం గాను, బ‌లం గాను మారిపోయింది అంటే, అది 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ అనే ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డాని కి దోహ‌ద‌ ప‌డుతుంది అని మ‌నం చెప్పుకోవ‌చ్చును.  ఈ రోజు కు కూడాను మ‌నం ప్ర‌పంచం లో 10 అగ్ర‌గామి ఎఫ్‌డిఐ గ‌మ్య‌స్థానాల లో ఒక‌టి గా ఉన్నాము.  గ‌డ‌చిన కొన్ని సంవ‌త్స‌రాల లో భార‌త‌దేశం లోకి ఎఫ్‌డిఐ ప్ర‌వాహాలు అధికం అయ్యాయి.  

ఎఫ్‌డిఐ కి రెండు అర్థాలు ఉన్నాయి అని నేను న‌మ్ముతాను.  వాటి ని సంద‌ర్భానుసారం గా నేను ఉప‌యోగిస్తాను. ఒక‌టో అర్థం ఏమిటి మీలో చాలా మందికి తెలిసిందే. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్‌ వెస్ట్‌మెంట్‌.  ఇక, నాకు తెలిసిన రెండో అర్థం ‘‘ఫ‌స్ట్ డివెల‌ప్‌డ్ ఇండియా’’.  గ‌డ‌చిన 20 సంవ‌త్స‌రాల లో దేశం లోకి వ‌చ్చిన‌టువంటి ఎఫ్‌డిఐ లో సుమారు 50 శాతం గ‌త 5 సంవ‌త్స‌రాల లోనే వ‌చ్చింది.  మ‌నం మ‌న యొక్క ప్ర‌పంచ స్ప‌ర్ధాత్మ‌క‌త ను కాల‌క్ర‌మం లో ఎంతో గొప్ప‌దైన రీతి లో మెరుగు ప‌ర‌చుకొన్నాము.  ఇవాళ, ప్ర‌పంచం లో మూడో అతి పెద్ద స్టార్ట్-అప్ ఇకో సిస్ట‌మ్ మ‌న దేశం లో ఉంది.  నూత‌న ఆవిష్క‌ర‌ణ మ‌రియు వ్యాపార సంస్థ ల‌కు సంబంధించిన ఒక న‌వీన వాతావ‌ర‌ణాన్ని దేశం లో నెల‌కొల్ప‌డ‌మైంది.  ప్ర‌పంచ ఇన్వెస్ట‌ర్ ల‌లో అనేకులు ఈ రోజు న భార‌త‌దేశానికేసి సంపూర్ణ‌మైన‌టువంటి ఆశ‌ తో, విశ్వాసం తో చూస్తున్నారు.  భార‌త‌దేశం యొక్క స‌త్తా విష‌యం లో ప్ర‌పంచం లో మున్నెన్న‌డూ ఎరుగ‌నంత‌టి విశ్వాసం నెల‌కొంది.  

మిత్రులారా,      

ఇదే స‌కారాత్మ‌క‌త ప్రాతిప‌దిక‌ గా మ‌నం 5 ట్రిలియ‌న్ విలువైన ఓ ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ గా ప‌య‌నిస్తున్నాము.  రానున్న సంవ‌త్స‌రాల లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కోసం 100 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డి ఈ దేశాని కి బ‌లాన్ని ఇవ్వ‌నుంది.  దేశ గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ లో 25 ల‌క్ష‌ల కోట్ల రూపాయల మేర‌కు పెట్టుబ‌డి ఈ ల‌క్ష్యాన్ని సాధించ‌డం లో స‌హాయ‌కారి కానుంది.  ప్ర‌తి ఒక్క కుటుంబాని కి నీటి ని చేరవేయడం కోసం 3.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి దీనికి ఒక నూత‌నోత్తేజాన్ని ప్ర‌సాదించ‌నుంది.
 
ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న లో భాగం గా 2 కోట్ల క్రొత్త ఇళ్ళ నిర్మాణం కావ‌చ్చు లేదా దేశం లోని ప్ర‌తి ఒక్క‌రి కి త‌క్కువ ఖ‌ర్చు లో ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాన్ని అందించాల‌న్న సంక‌ల్పం కావ‌చ్చు లేదా రైతుల ఆదాయాన్ని రెండింత‌లు చేయాల‌న్న కృషి కావ‌చ్చు లేదా దేశ వ్యాప్తం గా ల‌క్ష‌లాది ఎమ్ఎస్ఎమ్ఇ ల‌కు, కోట్లాది స్వ‌యం సహాయ స‌మూహాల కు సుల‌భ‌త‌ర ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డం కావ‌చ్చు.. ఒక 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ క‌లిగిన ఆర్థిక వ్య‌వ‌స్థ ను ఏర్పాటు చేయాలి అనేటటువంటి ల‌క్ష్యాన్ని సాధించ‌డం కోసం నూత‌న శక్తి ని మరియు ఒక నూతన విశ్వాసాన్ని అందిస్తాయి.

మిత్రులారా,

భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ను సుమారు గా రెండింతలు చేసే దిశ గా మా యొక్క ప్రయత్నాలు ఢిల్లీ కే ప‌రిమితం కావు.  దీని కోసం రాష్ట్రాల ను కూడా మేము ప్రోత్స‌హిస్తున్నాము.  త‌యారీ ని, ఎగుమ‌తుల ను పెంచడం కోసం మ‌రియు ‘మేక్ ఇన్ ఇండియా’ను విస్త‌రించ‌డం కోసం అనేక చ‌ర్య‌ల ను తీసుకోవ‌డం జ‌రుగుతోంది.  ర‌క్ష‌ణ మ‌రియు సాంకేతిక విజ్ఞాన రంగం లో త‌యారీ అనేది మా యొక్క ప్రాథ‌మ్యం గా ఉంది.  ఇలెక్ట్రానిక్స్ సంబంధిత త‌యారీ లో కూడాను మ‌నం వేగం గా ప‌య‌నిస్తున్నాము.

మిత్రులారా,

ఈ ప‌రిస్థితులు అన్నింటి నడుమ, ఆర్థిక వ్య‌వ‌స్థ పట్ల ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌ల సంగతి కూడా నాకు తెలుసును.  అయితే మునుప‌టి ప్ర‌భుత్వం యొక్క హ‌యాము లో ఒక త్రైమాసికం లో జిడిపి తాలూకు వృద్ధి రేటు 3.5 శాతం స్థాయి కి చేరింద‌న్న సంగతి ని సైతం మ‌నం జ్ఞాప‌కం పెట్టుకొని తీరాలి.

ఒక్క‌సారి జ్ఞప్తి కి తెచ్చుకొనే ప్ర‌య‌త్నం చేసి చూడండి..  ఆ కాలం లో సిపిఐ హెడ్ లైన్ ఇన్ ఫ్లేశన్ ఏ స్థాయి కి పోయిందో?  అది 9.4 శాతాని కి చేరింది.  సిపిఐ కోర్ ఇన్ ఫ్లేశన్ ఏ స్థాయి లో ఉండింది?  అది 7.3 శాతం గా న‌మోద‌యింది !!!  డ‌బ్ల్యుపిఐ ద్ర‌వ్యోల్బ‌ణం ఎక్క‌డ‌కు చేరుకొంది?  అది 5.2 శాతం గా ఉండింది.  ప్రభుత్వ కోశ సంబంధి లోటు ఎంత దూరం వరకు వెళ్ళింది? అది జిడిపి లో 5.6 శాతం స్థాయి కి పోయింది.  ఆ కాలం లో, అనేక త్రైమాసికాల పాటు జిడిపి ఎంత తీక్ష‌ణం గా ఉండిందంటే ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వ‌ర‌కు కుంగిపోయింది.  ఆ కాలం లో కొంత మంది మౌనాన్ని ఎందుకు ఆశ్ర‌యించారో అనే ఓ వివాదం జోలికి వెళ్లాలని నేను కోరుకోవ‌డం లేదు.

మిత్రులారా,

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ లో అటువంటి హెచ్చు త‌గ్గులు ఇది వ‌ర‌కు చోటు చేసుకొన్నాయి.  అయితే, ప్ర‌తి సారి అటువంటి స్థితి నుండి బ‌య‌టకు వ‌చ్చేట‌టువంటి సామ‌ర్ధ్యమూ, మునుప‌టి తో పోలిస్తే మ‌రింత బ‌లం గా కూడా బ‌య‌ట‌ కు రాగ‌ల‌ సత్తా దేశాని కి ఉన్నాయి.  ఈ కారణం గా, భార‌త‌దేశం ప్ర‌స్తుత ప‌రిస్థితి నుండి త‌ప్ప‌క బ‌య‌ట‌ కు వ‌స్తుంది.

మిత్రులారా,

భ‌విష్య‌త్తు ప‌ట్ల మా యొక్క ఉద్దేశ్యాలు స్వ‌చ్ఛం గా ఉన్నాయి.  మ‌రి మేము దృఢ నిశ్చ‌యం తో ఉన్నాము.  ఈ ప్ర‌భుత్వం ఏమి చెప్తుందో అది చేస్తుందనే పేరు ను తెచ్చుకొన్నదనే సంగతి తెలిసిందే.  ఇదివ‌ర‌కు అసాధ్యం గా తోచిన అనేక ప‌నుల ను దేశం సాధించింది కాబ‌ట్టి 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ అనే లక్ష్యాన్ని సాధించ‌డం కూడా కుదిరే ప‌నే.  60 నెల‌ల కాలం లో 60 కోట్ల మంది ని ఆరుబ‌య‌లు ప్రాంతాల లో మ‌ల‌మూత్రాదుల విస‌ర్జ‌న బారి నుండి విముక్తం చేయ‌డం అసాధ్యం గా తోచింది.  ప్ర‌స్తుతం ఇది సాధ్య‌ప‌డింది.  మూడు సంవ‌త్స‌రాల కన్నా తక్కువ కాలం లో 8 కోట్ల ఇళ్ళ కు గ్యాస్ క‌నెక్ష‌న్ ల ను స‌మ‌కూర్చ‌డం, 10 ల‌క్ష‌ల కు పైగా గ్యాస్ పంపిణీ కేంద్రాల‌ ను ఏర్పాటు చేయ‌డం అనేది అసాధ్యం అనిపించిన‌ప్ప‌టి కీ వాటిని చేసి చూపించ‌డ‌మైంది. 

ప్ర‌తి ఒక్క కుటుంబాన్ని బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ తో అంత త‌క్కువ కాలం లో జోడించ‌డం అనే పని మునుపు అసాధ్యం గా తోచింది. అయిన‌ప్ప‌టి కి, ప్ర‌స్తుతం అది సాధ్యం అయింది.  దేశంలోని ఒక పెద్ద  జ‌నాభా కు డిజిట‌ల్ బ్యాంకింగ్ ను తీసుకుపోవ‌డం అంటే అది అయ్యే ప‌ని కాదు అని లోగ‌డ అభిప్రాయ‌ప‌డటమైంది.  ఇవాళ దేశం లో ప్ర‌తి  రోజూ కోట్ల కొద్దీ డిజిట‌ల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.  BHIM యాప్ మ‌రియు RuPay కార్డు లు సైతం దేశం లో ఇంత‌గా వ్యాపిస్తాయని ఎవ‌రు అనుకున్నారు?  కానీ, ఈ రోజు న అది నెర‌వేరింది.  గృహ వ‌స‌తి లేన‌టువంటి ప్ర‌తి ఒక్కరి కి ఒక ఇంటి ని సమకూర్చడం అసాధ్యం గా తోచింది.  అయినప్ప‌టి కి అది ప్ర‌స్తుతం సాధ్యమవుతోంది.  ఇక నేను గ‌డ‌చిన 6 నెల‌ల కాలం తాలూకు మ‌రిన్ని ఉదాహ‌ర‌ణ‌ల ను ప్రస్తావించడాన్ని మొదలు పెట్టానంటే, మీరు మీ భోజ‌న విరామాన్ని కోల్పోవ‌ల‌సి వ‌స్తుంది.

మిత్రులారా,

‘సంక‌ల్ప్ సే సిద్ధి’ తాలూకు ఈ స‌కారాత్మ‌క‌మైన‌టువంటి మ‌రియు పార‌ద‌ర్శ‌క‌మైన‌టువంటి వాతావ‌ర‌ణం లో అవ‌కాశాలు కూడాను మీ కోసం విస్తరిస్తున్నాయి.  
 
భార‌త‌దేశ పారిశ్రామిక జ‌గ‌తి తో ప్ర‌భుత్వం అన్ని విధాలుగాను వెన్నంటి నిలుస్తుంది.  తద్వారా మీ యొక్క ఉత్సాహం మునుప‌టి తో పోలిస్తే మ‌రింత మెరుగు ప‌డుతుంది; వ్య‌వ‌సాయం లో దిగుబ‌డులు మ‌రియు కంపెనీల లో ఉత్ప‌త్తి మునుప‌టి క‌న్నా ఉత్త‌మం గా ఉంటాయి.  అదే మాదిరి గా సంప‌ద సృష్టి, ఇంకా ఉద్యోగాల సృష్టి సైతం గ‌తం క‌న్నా ఉత్త‌మం గా ఉంటాయి.  ఈ వేదిక మీది నుండి నేను దేశం లో న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల కు చెప్పేది ఏమిటి అంటే- మీరు ముందంజ వేయండి,  అందుకు మీరు  స‌మ‌ర్ధులు అనేదే.  ప్ర‌పంచ విప‌ణి మ‌న ఎదుట ఉన్న‌ది.  యావ‌త్తు ప్ర‌పంచం తో పోటీ ప‌డే ధైర్యాన్ని మనం క‌లిగివున్నాము.   5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువైన ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఆవిర్భ‌వించాల‌నే భారతదేశం యొక్క కల ను పండించడం లో మీ యొక్క సంక‌ల్పం మ‌రియు మీ యొక్క బ‌లం ఒక బృహత్తర పాత్ర ను పోషించ‌బోతున్నాయి.

మీ యొక్క సుసంప‌న్న‌మైన సంప్రదాయం కూడాను విస్త‌రించి 21వ శతాబ్ద‌పు ‘న్యూ ఇండియా’ను ప‌టిష్ట ప‌ర‌చ‌బోతోంది.  మీ యొక్క ప్ర‌య‌త్నాల‌ లో మీరు స‌ఫ‌లీకృతులు అవుతార‌న్న ఆకాంక్ష తో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

మ‌రొక్క మారు మీకు అంద‌రి కీ ఇవే నా అభినంద‌న‌లు మ‌రియు శుభాకాంక్ష‌లు.

మీకు ధ‌న్య‌వాదాలు.

https://youtu.be/Le5B8w8S7Ew