ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఐఐఎఫ్సిఎల్కు 2019-20 ఆర్థిక సంవత్సరంలొ రూ 5300కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10,000 కోట్లు అదనపు ఈక్విటీ సహాయాన్ని అందిచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇది సాధారణ బడ్జెట్ మద్దతు ద్వారా , లేదా రీ కాపిటలైజేశన్ బాండ్ల జారీ ద్వారా జరుగుతుంది. ఇందుకు తగిన సమయం, నిబంధనలు , షరతుల ను ఆర్థిక వ్యవహారాల శాఖ నిర్ణయిస్తుంది. ఐఐఎఫ్సిఎల్ అధీకృత మూలధనాన్ని రూ. 6,000 కోట్ల నుంచి రూ. 25 వేల కోట్ల రూపాయల కు పెంచేందుకు కేబినెట్ ఆమోదించింది.
ప్రధాన ప్రభావం:
దీనివల్ల ఐఐఎఫ్సిఎల్కు రుణ సేకరణ కు అవసరమైన వెసులుబాటు కలుగుతుంది. రాగల 5 సంవత్సరాల లో మౌలిక సదుపాయాల రంగం లో 100 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్న భారత ప్రభుత్వ లక్ష్యాని కి అనుగుణం గా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు ఫైనాన్స్ చేసేందుకు ఇది వీలు కలిపిస్తుంది.
నేపథ్యం:
• ఐఐఎఫ్సిఎల్ పూర్తి గా భారత ప్రభుత్వ యాజమాన్యం లోని కంపెనీ. దీని ని 2006లో ఏర్పాటు చేశారు. వివిధ రంగాల కు చెందిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు ఇది దీర్ఘకాలిక ఫైనాన్స్ ను సమకూరుస్తుంది. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ- మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీ. 2013 సెప్టెంబర్ నుంచి ఆర్బిఐ వద్ద రిజిస్టర్ అయింది . కంపెనీ అధీకృత మూలధనం, పెయిడ్ అప్ మూలధనం ప్రస్తుతం వరుస గా రూ 6000 కోట్లు, 4072.32 కోట్ల రూపాయలుగా ఉంది.
• రాగల 5 సంవత్సరాల లో మౌలిక సదుపాయాల రంగం లో 100 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి ని భారత ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఈ స్థాయి లో మౌలిక సదుపాయాల రంగం లో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తం లో ఈక్విటీ, రుణం అవసరం అవుతాయి. రుణ ఫండింగ్ సాధ్యం కావడం లో ఐఐఎప్సిఎల్ పాత్ర కీలకం. ఐఐఎఫ్సిఎల్ ఒక ప్రాజెక్టు ఫండింగ్ లో పాల్గొంటే పెద్ద బ్యాంకులు, ఇతర సంస్థలు సహ ఫైనాన్సింగ్ సంస్థలు గా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువల్ల ఐఐఎఫ్సి కి అదనపు కేపిటల్ అందించడం వల్ల ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు ఫైనాన్స్ అందించేందుకు వీలుగా అది తన బాధ్యత నిర్వర్తించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.