Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పాలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ షాంఘయ్ కార్యదర్శి శ్రీ హాన్ జెంగ్ భేటీ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పాలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ షాంఘయ్ కార్యదర్శి శ్రీ హాన్ జెంగ్ భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పాలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ షాంఘయ్ కార్యదర్శి శ్రీ హాన్ జెంగ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గత ఏడాది తాను షాంఘయ్ ను సందర్శించినప్పుడు శ్రీ హాన్ జెంగ్ తో సమావేశమైన సంగతిని సహర్షంగా గుర్తుకు తెచ్చుకొన్నారు. శ్రీ హాన్ జెంగ్ కూడా కిందటి సంవత్సరంలో ప్రధాన మంత్రి షాంఘయ్ పర్యటనను జ్ఞ‌ప్తికి తెచ్చుకొంటూ, ఆ పర్యటన అనంతకం భారతదేశం పట్ల అవగాహన అధికం అయిందని, షాంఘయ్ నుంచి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చే ప్రజల సంఖ్య పెరిగిందన్నారు.

ముంబయ్- షాంఘయ్ సిస్టర్ సిటీ అగ్రిమెంట్ భారతదేశం, చైనా ల ఆర్థిక రాజధాని నగరాల మధ్య బలమైన సంబంధాలకు పునాది వేసిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇండియా- చైనా ప్రవిన్షల్ లీడర్స్ ఫోరమ్ ను ఏర్పాటు చేసుకోవడం సైతం ఇరు దేశాల సంబంధాలను విస్తరించే మరియు పటిష్టపరిచే దిశగా స్వాగతించదగిన చర్య అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ మోదీ, శ్రీ హాన్ జెంగ్ లు ఉభయులు ప్రపంచ తాజా ఆర్థిక స్థితిగతులను గురించి చర్చించారు. భారతదేశం లోను, చైనా లోను నమోదు అవుతున్న బలమైన ఆర్థిక వృద్ధి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి చోదక శక్తిగా ఉండగలదని వారు అభిప్రాయపడ్డారు.