పర్యటన రంగం లో సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఫిన్ లాండ్ కు మరియు భారతదేశాని కి మధ్య ఓ అవగాహనపూర్వక ఒప్పందాని కి (ఎంఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
లాభాలు:
ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం యొక్క ప్రధానోద్దేశ్యాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి:
• పర్యటన రంగం లో ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడం కోసం మరియు వర్ధిల్లేటట్టు చూడడం కోసం సమన్వయ పూర్వక సంబంధాల ప్రాతిపదిక ను ఏర్పాటు చేయడం;
• పర్యటన రంగాని కి సంబంధించిన సమాచారం, పరిచయాలు, ప్రావీణ్యం వగైరా అంశాల ను ఒక పక్షాని (దేశాని)కి మరొక పక్షం (దేశం) వెల్లడించడం;
• పర్యటన విధానాన్ని రూపొందించడం, అమలు చేయడం మరియు అభివృద్ధి పరచడం లో ప్రమాణాల ను వికసింపచేయడానికి సంబంధించినటువంటి అనుభవాల ను గుర్తించే సదుపాయం మరియు వాటి ని ఒక పక్షాని కి మరొక పక్షం వెల్లడించడం;
• కంపెనీ లు మరియు సంస్థ ల మధ్య సంయుక్త పథకాలు మరియు భాగస్వామ్యాల గుర్తింపున కు, విస్తరణ కు మార్గాన్ని సుగమం చేయడం. దీని కోసం ఆయా బృందాల రాక పోక లు, బృందాల మధ్య సమావేశాలు, కార్యశాల లు, సదస్సుల సహ నిర్వహణ ను అవలంబించడం;
• భారతదేశాని కి మరియు ఫిన్లాండ్ కు చెందిన నిపుణుల కు అధ్యయనాత్మక యాత్రల ను నిర్వహించడం ద్వారా ఉత్తమ అభ్యాసాల ను ఇచ్చి పుచ్చుకోవడం;
• ఇరు పక్షాల కు ఉమ్మడి ప్రయోజనాలు ఇమిడి ఉండే అంశాల లో అంతర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థ ల పథకాల లో పాలు పంచుకోవడాన్ని ప్రోత్సహించనున్నారు.