ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అంటే 2019వ సంవత్సరం నవంబర్ 21వ తేదీ న అకౌంటెంట్స్ జనరల్ మరియు డిప్యూటీ అకౌంటెంట్స్ జనరల్ సమావేశ లో ప్రసంగించనున్నారు. దేశ వ్యాప్త ఎఎస్‌జి మరియు డిప్యూటీ ఎఎస్‌జి లను ఉద్దేశించి ప్రసంగించే కన్నా ముందు కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం లో మహాత్మ గాంధీ విగ్రహాన్ని శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
ప్రస్తుత సమావేశాని కి ఇతివృత్తం గా ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఆడిట్ ఎండ్ అశ్యువరన్స్ ఇన్ ఎ డిజిటల్ వరల్డ్’ అనే అంశం ఉంటుంది. జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని ఏకీకృతం చేసుకోవడం కోసం మరియు రాబోయే కొన్ని సంవత్సరాల కాలాని కి గాను ఇండియన్ ఆడిట్ ఎండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ యొక్క పథాన్ని నిర్దేశించడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. ప్రభుత్వం ఏ విధం గా అయితే డేటా ఆధారితం గా పనిచేయడాన్ని పెంచుకొంటున్నదో- ఆ క్రమం లో భాగం గా- ప్రస్తుతం శర వేగం గా మారుతున్నటువంటి విధాన పరమైన మరియు పాలన సంబంధిత వాతావరణం లో ఈ విభాగాన్ని సాంకేతిక విజ్ఞాన చోదక సంస్థ గా మార్పు చేసేందుకు అనుసరించవలసిన మార్గాల ను గురించి చర్చించడం కోసం ప్యానెల్ చర్చల ను మరియు గ్రూపు వారీ చర్చల ను చేపట్టనున్నారు.
ఈ విభాగం ‘ఒన్ ఐఎ & ఎడి – ఒన్ సిస్టమ్’ను అమలు పరచడం ద్వారా అంతర్గతం గా ఆడిట్ ప్రక్రియల ను స్వయంచాలితం గా మార్చుతోంది. ఈ విభాగం ఇంటర్ యాక్టివ్ అకౌంట్ లు మరియు డిజిటల్ ఆడిట్ నివేదికల ను సమర్పించడం కోసం ఆడిటీ యూనిట్లు తరలి వచ్చే అవసరాన్ని కనీస స్థాయి కి కుదించే దిశ గా పయనిస్తున్నది. నాలిజ్ బేస్ ను సంస్థాగతం చేసే ప్రయత్నాలు, జ్ఞాన వనరుల ను నిల్వ చేసేందుకు ఐటి ఆధారిత ప్లాట్ ఫార్మ్ యొక్క సహాయాన్ని తీసుకొనేందుకు, అలాగే, ఆడిటర్ ల కోసం ఎనీ టైమ్, ఎనీ వేర్ లర్నింగ్ తో పాటు ఐటి ఆధారిత టూల్ కిట్స్ ను అభివృద్ధి పరచేందుకు కూడా కృషి జరుగుతున్నది. నూతన తరాని కి చెందిన, సాంకేతిక విజ్ఞాన చోదక భారతదేశం విసరుతున్నటువంటి సవాళ్ళ కు తట్టుకొని నిలచేటట్టు ఇండియన్ ఆడిట్ ఎండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ గత కొద్ది సంవత్సరాలు గా ఆడిట్ లో మార్పు ను ఆవిష్కరించే దిశ గా సాగుతున్నది.