Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేవ‌డియా లో సాంకేతిక విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న స్థలి ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని కేవ‌డియా లో ఏర్పాటైన సాంకేతిక విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న స్థ‌లాన్ని ఈ రోజు న ప్రారంభించారు.

అక్క‌డ పోలీసు బలగాలు మ‌రియు అర్థ సైనిక బ‌ల‌గాల ద్వారా మార‌ణాయుధాలు మ‌రియు ఇత‌ర ఆయుధాల తో స‌హా అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని క‌ళ్ళ‌ కు క‌ట్టే వివిధ వ‌స్తువు లను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.  

విమాన‌యాన భ‌ద్ర‌త‌, బ‌ల‌గాల ఆధునికీక‌ర‌ణ‌, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాలు వంటి వివిధ ఇతివృత్తాలు ప్ర‌ధాన వ‌స్తువు గా సిఐఎస్ఎఫ్‌, సిఆర్‌ పిఎఫ్‌, బిఎస్ఎఫ్‌, ఎన్ఎస్‌జి మ‌రియు రాష్ట్ర పోలీసు ద‌ళాలు త‌మ త‌మ అధునాత‌న సాంకేతిక‌త ల‌ను ప్ర‌ద‌ర్శ‌న కు ఉంచాయి.

సిఐఎస్ఎఫ్ ఎంచుకొన్న ఇతివృత్తం ప్ర‌ధానం గా విమానాశ్ర‌యాల లో ముఖాల శీఘ్రతర గుర్తింపు నకు సంబంధించిన సాంకేతిక విజ్ఞానం పై శ్ర‌ద్ధ వ‌హిస్తూన్న‌ ఏకీకృత అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం పై కేంద్రితం కాగా, ఎన్ఎస్‌జి యేమో సెక్యూరిటీ కిట్ ల‌ను, అధునాత‌న ఆయుధ సామ‌గ్రి తో పాటు రిమోట్ కంట్రోల్ స‌హాయం తో న‌డిచే సామాగ్రి ని, ఇంకా వాహ‌నాల ను ప్ర‌ద‌ర్శిస్తోంది.

దేశీయ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌ముఖం గా ‘112’ సంబంధిత ప్ర‌ద‌ర్శ‌న ను ఏర్పాటు చేసింది.  ఈ సంఖ్య అన్ని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల లో ప్ర‌తిస్పందించేందుకు ఉద్దేశించింది.  అంతేకాకుండా ఇ-ములాకాత్, లైంగిక అప‌రాధుల తాలూకు జాతీయ సమాచార నిధి ల‌తో పాటు ఇత‌ర డిజిట‌ల్ కార్య‌క‌లాపాల ప్ర‌ద‌ర్శ‌న ఈ స్టాల్‌ ముఖ్యాక‌ర్ష‌ణ‌ల కొన్ని గా ఉన్నాయి.

ఇక సిఆర్‌ పిఎఫ్ స్టాల్ లో ఆ విభాగాని కి చెందిన సిబ్బంది అందుకొన్న సాహ‌స ప‌తకాలు మ‌రియు స‌త్కారాలు కొలువుదీరాయి.  1939వ సంవ‌త్స‌రం నాటి నుండి ప‌రాక్ర‌మాన్ని వివ‌రించే గాథ‌ల లోని స‌న్నివేశాలు మ‌రియు సిఆర్‌పిఎఫ్ స‌లిపిన స్మ‌ర‌ణీయ స‌మ‌రాల స‌న్నివేశాలు సైతం ప్ర‌ద‌ర్శ‌న కు నోచుకొన్నాయి.

గుజ‌రాత్ పోలీసు విభాగం ప్ర‌ద‌ర్శిస్తున్న విశ్వాస్ ప్రోజెక్టు మ‌రియు ఆధునిక సాంకేతిక స‌రంజామా తాలూకు ప్ర‌ద‌ర్శ‌న ల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శించారు.  ఢిల్లీ పోలీసు విభాగం డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల తాలూకు ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న ను ఏర్పాటు చేయ‌గా, జ‌మ్ము- క‌శ్మీర్ పోలీసు విభాగం దేశ ప్ర‌జ‌ల భ‌ద్ర‌త మ‌రియు సుర‌క్ష కు పూచీప‌డేట‌ట్టు త‌యారైన భ‌ద్ర‌త వాహ‌నాల ను ప్ర‌ద‌ర్శ‌ిస్తోంది.

***