ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) లోని గ్రూప్ ‘ఎ’ జనరల్ డ్యూటీ (ఎగ్జిక్యూటివ్) కాడర్ లో మరియు నాన్-జిడి కాడర్ లో కాడర్ సమీక్ష ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సమావేశం లో దిగువన పేర్కొన్న నిర్ణయాల ను తీసుకోవడమైంది:
i. ఐటిబిపి లో సీనియర్ డ్యూటీ పోస్టుల లో పర్యవేక్షక సిబ్బంది ని పెంచడం కోసం అసిస్టెంట్ కమాండెంట్ నుండి అడిషనల్ డైరెక్టర్ జనరల్ వరకు వివిధ ర్యాంకు లకు చెందినటువంటి గ్రూప్ ‘ఎ’ జిడి (ఎగ్జిక్యూటివ్) కాడర్ మరియు నాన్-జిడి కాడర్ లలో కాడర్ సమీక్ష ను చేపట్టాలన్న నిర్ణయం.
ii. అడిశనల్ డైరెక్టర్ జనరల్ అధిపతి గా, ఇన్స్ పెక్టర్ జనరల్ సహాయాన్ని అందించే విధం గా రెండు నూతన కమాండ్ లను (వెస్టర్న్ కమాండ్ ను చండీగఢ్ లో మరియు ఈస్టర్న్ కమాండ్ ను గువాహాటీ లో) ఏర్పాటు చేస్తారు.
ప్రధాన ప్రభావం:
• ఐటిబిపి లో ఈ మేరకు గ్రూప్ ‘ఎ’ పోస్టు లను ఏర్పాటు చేసిన అనంతరం ఫోర్సు యొక్క పర్యవేక్షణ సంబంధిత సామర్ధ్యం మరియు కెపాసిటీ బిల్డింగ్ ఇతోధికం అవుతాయి. ఫోర్సులోని గ్రూప్ ‘ఎ’ పోస్టుల యొక్క కాడర్ రివ్యూ లో భాగం గా ప్రతిపాదిత పదవుల ను సకాలం లో ఏర్పాటు చేయడం వల్ల దాని యొక్క పరిపాలన పరమైనటువంటి సామర్ధ్యాల తో పాటు పర్యవేక్షణ సంబంధిత సామర్ధ్యాలు కూడా పెంపొందుతాయి.
• వివిధ స్థాయిల లో గ్రూప్ ‘ఎ’ ఎగ్జిక్యూటివ్ జనరల్ డ్యూటీ కాడర్ లో 60 పోస్టుల ను, గ్రూప్ ‘ఎ’ నాన్-జిడి కాడర్ లో 2 పోస్టుల ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.
• ఇదే ప్రతిపాదన అడిశనల్ డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహించే మరియు ఇన్స్ పెక్టర్ జనరల్ సహాయాన్ని అందించే విధం గా రెండు కొత్త కమాండ్ (చండీగఢ్ లో వెస్టర్న్ కమాండ్ మరియు గువాహాటీ లో ఈస్టర్న్ కమాండ్) లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
అమలు:
లాంఛన పూర్వకమైన నోటిఫికేషన్/మంనజూరు ను అందుకోవడం తోనే నూతనం గా ఏర్పాటు చేసిన పోస్టుల ను నియామక సంబంధ నియమ నిబంధన లకు అనుగుణం గా భర్తీ చేయడం జరుగుతుంది.
ముఖ్యాంశాలు:
జిడి కాడర్
గ్రూప్ ‘ఎ’ పోస్టుల ప్రస్తుతం స్వరూపం లో ఈ కింద పేర్కొన్న విధం గా 1147 నుండి 1207 పోస్టుల కు పెంచడం జరుగుతుంది:
1. అడిశనల్ డైరెక్టర్ జనరల్ పోస్టుల లో నికరం గా 2 పోస్టు ల పెరుగుదల
2. ఇన్స్ పెక్టర్ జనరల్ పోస్టుల లో నికరం గా 10 పోస్టుల పెరుగుదల
3. డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ పోస్టుల లో నికరం గా 10 పోస్టుల పెరుగుదల
4. కమాండెంట్ పోస్టుల లో నికరం గా 13 పోస్టుల పెరుగుదల
5. 21సి పోస్టుల లో నికరం గా 16 పోస్టుల పెరుగుదల
6. డిప్యూటీ కమాండెంట్ పోస్టుల లో నికరం గా 9 పోస్టుల పెరుగుదల
బి) నాన్-జిడి కేడర్
సి) ఇన్స్ స్పెక్టర్ జనరల్ పోస్టుల లో నికరం గా 2 పోస్టుల పెరుగుదల.
**************