Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ ఆరోగ్య కార్యక్రమం (NHM) ప్రగతి, సాధికార కార్యక్రమ కమిటీ (EPC), NHM పరిధిలోని కార్యక్రమ సారథ్య బృందం (MSG)నిర్ణయాలపై మంత్రిమండలికి నివేదన


 

జాతీయ ఆరోగ్య కార్యక్రమం (NHM) ప్రగతి, సాధికార కార్యక్రమ కమిటీ (EPC), NHM పరిధిలోని కార్యక్రమ సారథ్య బృందం (MSG)నిర్ణయాలు తదితరాల గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలికి సంబంధిత వర్గాలు నివేదించాయి.

కీలకాంశాలు – గమనార్హ విశేషాలు:

  • జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం/జాతీయ ఆరోగ్య కార్య‌క్రమాల‌ (NRHM/NHM)కు శ్రీ‌కారం చుట్టిన‌ప్ప‌టి నుంచి ప్రసూతి మరణాల నిష్పత్తి (MMR), ఐదేళ్ల‌లోపు బాల‌ల మ‌ర‌ణాల నిష్ప‌త్తి (U5MR)స‌హా న‌వ‌జాత శిశు మ‌ర‌ణాల నిష్ప‌త్తి (IMR) వేగంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. ప్రస్తుత క్షీణత నిష్ప‌త్తి ఇలాగే కొన‌సాగితే… భార‌త దేశం ఐక్య‌రాజ్య స‌మితి నిర్దేశిత (MMR-70, U5MR-25) స్థాయిని సాధించి, నిర్ణీత గ‌డువైన 2030 సంవత్సరంక‌న్నా చాలా ముందుగానే సుస్థిర ప్ర‌గ‌తి ల‌క్ష్యాన్ని (SDG) చేరుకోగ‌లుగుతుంది.
  • ప్ర‌పంచంలోని మ‌లేరియా పీడిత దేశాల్లో ఒక‌టిగా ఉన్న‌ప్ప‌టికీ ఆ మ‌హ‌మ్మారిని స‌మ‌ర్థంగా నియంత్రించ‌డంలో భార‌త విజ‌య‌గాథ అన్ని దేశాల‌కూ ఆద‌ర్శం. ఆ మేరకు 2013తో పోలిస్తే 2017లో మ‌లేరియా కేసులు, సంబంధిత మ‌ర‌ణాలు 49.09 శాతం, 50.52 శాతం వంతున‌ త‌గ్గుముఖం ప‌ట్టాయి.
  • సవరించిన జాతీయ క్షయ (TB) నియంత్రణ కార్యక్రమం (RNTCP) గణనీయ స్థాయిలో బలోపేతం కావ‌డంతోపాటు దేశ‌మంత‌టా ముమ్మరంగా అమ‌లు చేయ‌బ‌డింది. త‌ద‌నుగుణంగా అన్ని జిల్లాల్లోనూ ఔష‌ధ నిరోధ‌క ర‌కంస‌హా అన్ని ర‌కాల TBని క‌చ్చితంగా గుర్తించ‌గ‌ల 1,180  CBNAAT యంత్రాలు ఏర్పాటు చేయ‌బ‌డ్డాయి. దీంతో గ‌డ‌చిన ఏడాది కాలంలో ఈ యంత్రాల వాడ‌కం మూడు రెట్లు పెరిగి, కొత్త కేసుల గుర్తింపులోనూ 16 శాతందాకా పెరుగుద‌ల న‌మోదైంది. సార్వ‌త్రిక ఔష‌ధ స్పంద‌క కేసులు కూడా 54 శాతం పెరిగిన‌ట్లు తేలింది. బెడాక్విలిన్, డెలామినైడ్‌తో కూడిన స‌రికొత్త ఔష‌ధ ప్ర‌యోగంతోపాటు దేశ‌వ్యాప్తంగా రోగులంద‌రికీ చికిత్స పొందినంతం కాలం పోషకాహార స‌ర‌ఫ‌రా కూడా కొన‌సాగింది.
  • దేశంలో 2018-19కిగాను 52744 ఆయుష్మాన్ భార‌త్‌-ఆరోగ్య శ్రేయో కేంద్రాల (AB-HWC) ఏర్పాటుకు ఆమోదం తెలిపి, 15000 కేంద్రాల త‌క్ష‌ణ ఏర్పాటు ల‌క్ష్యం నిర్దేశించ‌గా, అంత‌కుమించి 170009 కేంద్రాలు నెలకొల్ప‌బ‌డ్డాయి. అంతేకాకుండా అసాంక్ర‌మిక వ్యాధుల (NCD)పై 2018^19లో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు (PHC-MO) ఆశా (ASHA), బ‌హుళ సేవా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు (MPHW)స‌హా మొత్తం 1,81,267 మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వ‌బడింది. అలాగే ఆరోగ్య శ్రేయో కేంద్రాల (HWC) ప్రారంభానికి రాష్ట్రాలు కూడా చ‌ర్య‌లు చేప‌ట్టాయి.
  • పెద్దలలో గొంతువాపు (డిఫ్తీరియా) వ్యాధి నిరోధకత పెంపు దిశగా సార్వత్రిక వ్యాధి నిరోధకత పెంపు కార్యక్రమం కింద 2018లో ప్రారంభించిన కొత్త టీకాల కార్యక్రమంలో భాగంగా టెటనస్ టాక్సైడ్ (TT) స్థానంలో ‘టెటనస్ అండ్ అడల్ట్ డిఫ్తీరియా’ (Td) టీకా ప్రవేశపెట్టబడింది.
  • అదేవిధంగా 2018లో అదనంగా 17 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చేపట్టిన మీజిల్స్-రుబెల్లా (MR) టీకాల కార్యక్రమం కింద 2019 మార్చివరకూ 30.50 కోట్లమంది పిల్లలకు టీకాలు వేయబడ్డాయి.
  • అలాగే 2018-19లో అదనంగా రెండు రాష్ట్రాల్లో చేపట్టిన రోటావైరస్ టీకా (RVV)ల కార్యక్రమంతో ప్రస్తుత సమయానికి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ దీని అమలు పూర్తయింది.
  • మరోవైపు 2018-19లో న్యుమోకాకల్ కంజుగేటెడ్ టీకా (PCV) కార్యక్రమం  మధ్యప్రదేశ్, హర్యానాలతోపాటు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మిగిలిన జిల్లాలకు విస్తరించబడింది.
  • ఆశా కార్యకర్తలకు క్రమబద్ధంగా అందించే ప్రోత్సాహకాలు నెలకు రూ.1000 నుంచి రూ.2000కు పెంచబడ్డాయి. అంతేకాకుండా ఆ కార్యకర్తలతోపాటు ఈ కార్యక్రమానికి సహకరించేవారికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (రూ.330 బీమా రుసుమును కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది)సహా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (ఇందుకు రూ.12 వంతున రుసుమును ప్రభుత్వం చెల్లిస్తుంది) అమలు చేయబడ్డాయి.
  • పోషకాహార కార్యక్రమం కింద 2018 ఏప్రిల్ నెలలో ‘రక్తహీనత రహిత భారతం’ కార్యక్రమం (AMB) ప్రారంభించబడింది.
  • ఆరోగ్య శ్రేయో కేంద్రాలుగా రూపొందించిన ఉప ఆరోగ్య కేంద్రాలకు ఆంక్షలరహిత నిధుల మొత్తం రూ.20,000 నుంచి రూ.50,000కు పెంచబడింది.
  • పోషకాహార కార్యక్రమం కింద బాలల గృహ సంరక్షణ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది.
  • క్షయ/కుష్ఠు/మలేరియా/విషజ్వరం/బోదకాలు/కంటిశుక్లాలు వంటి వ్యాధులరహిత లక్ష్యాన్ని సాధించే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/జిల్లాలకు అవార్డు ప్రదాన పథకానికి ఆమోదముద్ర పడింది. బహిరంగ విసర్జనరహిత (ODF) రాష్ట్రాలు/జిల్లాల పోటీ తరహాలో వ్యాధిరహిత రాష్ట్రాలు/జిల్లాలుగా జాతీయస్థాయి ధ్రువీకరణ పొందడానికి అవి ఆరోగ్యకర రీతిలో పోటీపడే వాతావరణం నెలకొంటుంది.
  • జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమానికి ఆమోదం… ఈ మేరకు ‘హెపటైటిస్ ఎ, బి, సి, ఇ’ రకాల నిరోధం, చికిత్సకు వీలు కలిగింది. దీనివల్ల హెపటైటిస్ బాధితులైన దాదాపు 5 కోట్లమందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా.

లక్ష సజీవ శిశు జననాలకు ప్రసూతి మరణాల నిష్పత్తిలో క్షీణత

5.3%

8%

లక్ష జననాలకు నవజాత శిశు మరణాల నిష్పత్తిలో క్షీణత

2.8%

4.7%

ఐదేళ్లలోపు పిల్లల మరణాల నిష్పత్తిలో క్షీణత

3.9%

6.6%

  1990-2013 2013-2016

 

వెయ్యి జనాభాకు మలేరియా పరాన్నజీవి సోకే నిష్పత్తి క్షీణత

2017లో 0.64

2018లో 0.30

 

****