Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘స్వ‌చ్ఛ్ భార‌త్ దివ‌స్ 2019’ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు అహ‌మ‌దాబాద్ లో ‘స్వ‌చ్ఛ్ భార‌త్ దివ‌స్ 2019’ని ప్రారంభించారు. ఆయ‌న మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి స్మృత్య‌ర్థం త‌పాలా బిళ్ళ ను, వెండి నాణేన్ని ఆవిష్కరించారు. స్వ‌చ్ఛ్ భార‌త్ పుర‌స్కారాల ను విజేత‌ల కు ఆయ‌న ప్ర‌దానం చేశారు. అంత‌క్రితం, ఆయ‌న సాబ‌ర్ మ‌తీ ఆశ్ర‌మం లో మ‌హాత్మ గాంధీ కి శ్ర‌ద్ధాంజ‌లి ని ఘటించారు. ఆయ‌న మ‌గ‌న్ నివాస్ (చ‌ర‌ఖా గేల‌రీ)ని ద‌ర్శించారు. అలాగే, అక్క‌డి చిన్నారుల తో ఆయ‌న భేటీ అయ్యారు.

‘స్వ‌చ్ఛ్ భార‌త్ దివ‌స్’ కార్య‌క్ర‌మాని కి త‌ర‌లి వ‌చ్చిన స‌ర్పంచ్ లను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగిస్తూ, మ‌హాత్మ గాంధీ 150వ జ‌యంతి ని యావ‌త్తు ప్ర‌పంచం స్మ‌రించుకొంటోంద‌న్నారు. కొద్ది రోజుల క్రితం గాంధీజీ కి సంబంధించిన ఒక త‌పాలా బిళ్ళ ను ఐక్య రాజ్య స‌మితి విడుద‌ల చేసిన తరువాత ఈ కార్య‌క్ర‌మం మ‌రింత స్మ‌ర‌ణీయం గా మారింద‌ని శ్రీ మోదీ చెప్పారు. త‌న‌కు త‌న జీవ‌న కాలం లో అనేక ప‌ర్యాయాలు సాబ‌ర్ మ‌తీ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించే అవ‌కాశం దొరికింద‌ని, అలాగే ప్ర‌తి సారి మాదిరిగా ఈ రోజు న కూడా కొత్త శ‌క్తి త‌న‌ కు ల‌భించిందని ఆయ‌న వెల్ల‌డించారు.

బ‌హిరంగ ప్ర‌దేశాల లో మ‌ల‌మూత్రాదుల విస‌ర్జన కు వీలు లేనివి గా గ్రామ సీమ‌లు త‌మ‌ంతట తాము ఈ రోజు న ప్ర‌క‌టించుకొన్నాయ‌ని చెప్తూ, దీని కి గాను దేశం లోని ప్ర‌తి ఒక్క‌రి కీ.. ప్ర‌త్యేకించి, ప‌ల్లెల లో నివ‌శిస్తున్న‌ వారికి, స‌ర్పంచుల తో పాటు స్వ‌చ్ఛ‌త కోసం శ్ర‌మించిన వారంద‌రికీ కూడాను.. ఆయన శుభాకాంక్ష‌లు తెలిపారు. వ‌య‌స్సు, సామాజిక స్థాయి, ఇంకా ఆర్థిక స్థితిగ‌తులు అనే అంశాల‌ కు అతీతం గా, అందరూ స్వ‌చ్ఛ‌త‌, గరిమ, ఇంకా సమ్మానం కోసం ఈ ప్ర‌తిజ్ఞ లో వారి యొక్క తోడ్పాటు ను అందించార‌ని ఆయన అన్నారు. మ‌నం సాధించిన‌టువంటి ఈ స‌ఫ‌ల‌త ను చూసి ఈ రోజు న ప్ర‌పంచం అబ్బురపడి, మ‌రి మ‌న‌ కు బ‌హుమ‌తి ని అంద‌జేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. భారతదేశం 60 మాసాల లో 11 కోట్ల కు పైగా టాయిలెట్ ల‌ను నిర్మించడం ద్వారా 60 కోట్ల కు పైగా జ‌నాభా కు టాయిలెట్ వసతి ని స‌మ‌కూర్చ‌డం ప‌ట్ల ప్ర‌పంచం ఆశ్చ‌ర్య‌చ‌కితురాల‌యింద‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం మ‌రియు స్వ‌చ్ఛంద ప్రాతిప‌దిక అనేది స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ కు ఒక గుర్తింపు ను తెచ్చిపెట్టి, ఈ ఉద్య‌మ సాఫ‌ల్యాని కి కార‌ణాలయ్యాయి అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. ఈ ఉద్య‌మాని కి హృద‌యపూర్వ‌క మ‌ద్ధ‌తు ను అందించినందుకు యావ‌త్తు దేశ ప్ర‌జ‌ల కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం యొక్క ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాన మంత్రి నొక్కి వక్కాణిస్తూ, జ‌ల్ జీవ‌న్ మిశ‌న్ మ‌రియు ఒక‌సారి వినియోగించే ప్లాస్టిక్ ను 2022 క‌ల్లా నిర్మూలించ‌డం వంటి ముఖ్య‌మైన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు స‌ఫ‌లం కావాలి అంటే స‌మ‌ష్టి ప్ర‌య‌త్నాలు ఎంత‌యినా అవ‌స‌ర‌మ‌న్నారు.

మ‌హాత్మ గాంధీ క‌ల‌ల ను నెర‌వేర్చే దిశ గా ప‌య‌నించాల‌ని త‌న ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకొన్నదని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ సంద‌ర్భం గా ఆయ‌న స్వావ‌లంబ‌న కు పూచీ ప‌డే విధం గా ప్ర‌భుత్వం న‌డుం క‌ట్టిన కార్య‌క్ర‌మాల ను గురించి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ గురించి, మ‌రి అలాగే అభివృద్ధి ఫ‌లాల‌ ను వ‌రుస‌ లోని క‌డ‌ప‌టి వ్య‌క్తి కి అందించ‌డం గురించి ప్ర‌స్తావించారు. దేశ ఉన్న‌తి కోసం సంక‌ల్పం తీసుకోవాల‌ని, మ‌రి ఆ సంక‌ల్పం సిద్ధించే విధంగా పాటు ప‌డాల‌ని ప్ర‌జ‌ల కు ఆయ‌న విజ్ఞప్తి చేశారు. అటువంటి 130 కోట్ల మంది యొక్క సంక‌ల్పం విస్తృతమైన ప‌రివ‌ర్తన‌ ను తీసుకు రాగ‌లుగుతుందని ఆయ‌న చెప్పారు.