Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గడువు తేదీకి 7 నెలల ముందే 8 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాన్ని సాధించిన ఉజ్వల యోజన


ఔరంగాబాదు లో ఈ రోజు మాహారాష్ట్ర మహిళా సంక్షేమ మేలా లేక స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారులైన మహిళల రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగించారు.

స్వయం సహాయక బృందాల ద్వారా తాము సాధికారత పొందడమే కాక తమ సామాజిక వర్గాలకు సాధికారత సాధించిన మహిళలను ప్రధాని తమ ప్రసంగంలో అభినందించారు.

సమీప భవిష్యత్తు లో ఔరంగాబాద్ పారిశ్రామిక నగరం (ఎయుఆర్ఐసి) ఔరంగాబాద్ పట్టణం లో ఒక ముఖ్యమైన భాగం కాగలదని మరియు దేశం లో ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం కాగలదని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేగాక, ఢిల్లీ – ముంబాయి పారిశ్రామిక కారిడార్ నందు ఒక ముఖ్యమైన భాగం కాగలదని ప్రధాని అన్నారు. అంతేకాక పారిశ్రామిక నగరంలో పెట్టుబడులు పెడుతున్న సంస్థల వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది.

ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన లో భాగం గా గడువు తేదీకి 7 నెలల ముందే 8 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్ల లక్ష్యాన్ని సాధించడాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి ఐదుగురు లబ్ధిదారుల కు వంటగ్యాస్ కనెక్షన్ల ను పంపిణీ చేశారు. అనుకున్న గడువు తేదీ కి 7 నెలల ముందే లక్ష్యాన్ని సాధించడాన్ని ప్రస్తావిస్తూ ఒక్క మహారాష్ట్ర లోనే 44 లక్షల ఉజ్జ్వల కనెక్షన్లు ఇచినట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు. లక్ష్య సాధన లో శ్రమించిన సహచరుల కు ఆయన సెల్యూట్ చేశారు. మట్టి పొయ్యిలపై (చుల్లా) వంట చేస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న స్త్రీల ఆరోగ్యం పట్ల తమకుగల ఆందోళనే ఈ లక్ష్య సాధనకు తోడ్పడిందని ప్రధాని అన్నారు.

వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే కాక పది వేల మంది ఎల్ పి జి పంపిణీదారుల తో ఒక సమగ్ర మౌలిక వ్యవస్థను ప్రధానం గా గ్రామీణ భారతం లో ఏర్పాటు చేయడం/నియమించడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. “సిలిండర్ల లో వంట గ్యాస్ నింపే కొత్త బాట్లింగ్ యూనిట్లను నిర్మించం. ఓడరేవుల వద్ద టర్మినళ్ళ సామర్ధ్యం పెంచాము మరియు పైపులైన్ యంత్రాంగాన్ని విస్తరించాము. 5- కిలోల బరువున్న చిన్న సిలిండర్ల ను ప్రోత్సహించడం జరుగుతోంది. పైపుల ద్వారా కూడా గ్యాస్ సరఫరా జరుగుతోంది. వంట గ్యాస్ కనెక్షన్ లేని ఒక్క ఇల్లు కూడా ఉండకూడదు అన్నది మా ఉద్దేశం” అని ప్రధాన మంత్రి తెలిపారు.

మహిళలు తాగునీటి కోసం మైళ్ళ కు మైళ్ళు నడిచి వెళ్ళడం నుంచి విముక్తి కలిగించేందుకు జల జీవన్ మిషన్ ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. “జల జీవన్ మిషన్ కార్యక్రమం ఉద్దేశం నీటిని ఆదా చేసి ఇంటి వద్ద పంపిణీ చేయడం. వచ్చే ఐదేళ్ళలో ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.” అన్నారు.

భారత స్త్రీ ఎదుర్కొనే రెండు ప్రధాన సమస్యలు మరుగుదొడ్లు, నీరు అని శ్రీ రాం మనోహర్ లోహియా చేసిన ప్రకటనను గుర్తు చేసుకొంటూ ఈ రెండు సమస్యల ను గనక పరిష్కరించ గలిగితే మహిళలు దేశాని కి నాయకత్వం వహించగలరని ప్రధాని అన్నారు. “జల జీవన్ మిషన్ వల్ల మరట్వాడా ప్రాంతం బాగా లభ్ధి పొందగలదు. దేశంలో మొదటి నీటి గ్రిడ్ మరట్వాడా ప్రాంతంలో ఏర్పాటవుతుంది. దానివల్ల ఈ ప్రాంతంలో నీటి లభ్యత పెరుగుతుంది”.

ప్రభుత్వ పథకాల లో ప్రజా ప్రాతినిధ్యాన్ని గురించి వివరిస్తూ అరవై ఏళ్ళు దాటిన ప్రతి రైతు కు ప్రభుత్వం పింఛను ఇస్తోందని, అదే విధంగా పశువుల కు టీకాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.

ఆజీవిక– జాతీయ గ్రామీణ జీవనోపాధి మిశన్ పథకం మహిళల కు ఆర్జన అవకాశాల ను కల్పిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. 2019 సంవత్సరపు కేంద్ర బడ్జెట్ లో స్వయం సహాయక బృందాల కు వడ్డీ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రత్యేక అంశాల ను చేర్చినట్లు ఆయన తెలిపారు. స్వయం సహాయక బృందాల కు చెందిన జనధన్ ఖాతాదారుల కు తమ ఖాతాల ద్వారా రూ. 5000 ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందవచ్చు. తద్వారా వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని ప్రధాన మంత్రి తెలిపారు.

స్వయం సహాయక బృందాల లో సభ్యులు గా ఉన్న మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ఇతర యత్నాల గురించి మాట్లాడుతూ “ముద్ర పథకం కింద ప్రతి స్వయం సహాయక బృందంలో ఒక సభ్యురాలికి లక్ష రూపాయల రుణం లభిస్తుంది. దాంతో వారు కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు మరియు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 20 కోట్ల విలువైన రుణాలు మంజూరు చేయడం జరిగింది. దానిలో 14 కోట్లు స్త్రీలకు ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో 1.5 కోట్ల మంది ముద్ర లభ్ధిదారులు ఉన్నారు. వారిలో 1.25 కోట్ల మంది స్త్రీలు” అని ప్రధాన మంత్రి వెల్లడించారు.

సమాజం లో సానుకూల సామాజిక మార్పు తేవడంలో మహిళల పాత్ర గురించి ప్రత్యేకం గా చెబుతూ “మీరు సామాజిక మార్పు తేవడంలో ముఖ్యులు. ఆడశిశువుల ను కాపాడేందుకు, వారి విద్యకు మరియు సంరక్షణకు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ఇందుకు సామాజిక సంబంధ దృష్టికోణం లో మార్పులు చేయాల్సిన అవసరం మనకు ఉంది. దాని లో మహిళల పాత్ర ముఖ్యమైంది. ముమ్మారు తలాక్ అనే చెడు అలవాటు నుంచి ముస్లిం మహిళల ను కాపాడటం జరిగింది. దీని గురించి మీరు జాగృతి కలుగజేయాలి” అని ప్రధాని అన్నారు.

చంద్రయాన్ 2 ప్రయోగం గురించి ప్రధాని వివరిస్తూ “మన శాస్త్రజ్ఞులు ఒక మైలురాయి సాధించాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు నేను వారితో పాటు ఉన్నాను. వారు ఎంతో ఉద్వేగం తో ఉన్నారు. అదే సమయం లో వారిది అనితర సాధ్యమైన స్ఫూర్తి. తమ తప్పుల ను సరిదిద్దుకొని ముందడుగు వేయాలన్నది వారి అభిమతం”.

ఇండియా త్వరలోనే తనకు తాను బహిరంగ మల విసర్జన లేని దేశంగా ప్రకటించుకుంటుందని ప్రధాని తెలిపారు.

ప్రభుత్వం కేవలం ఇళ్ళు కాకుండా అన్ని సౌకర్యాలు ఉన్న గృహాలు సమకూర్చాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్తూ “ కేవలం నాలుగు గోడల నిర్మాణం కాకుండా మీ కలలకు ప్రతిరూపమైన గృహాన్ని మీకు ఇవ్వాలన్నది మా ఉద్దేశం. దానిలో అనేక సౌకర్యాలు కల్పించదలిచాం. మూసలో పోసినట్లు కాకుండా స్థానిక అవసరాలకు తగినట్లు గృహ నిర్మాణం జరిగింది. వివిధ పథకాల కింద లభిస్తున్న ప్రయోజనాలు అన్నింటినీ ఒకచోట చేర్చి అన్ని మౌలిక సౌకర్యాలతో గృహాలు అందించే ప్రయత్నం చేశాం. ఒక కోటి 80 లక్షల గృహాల నిర్మాణం పూర్తయ్యింది. 2022లో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి అందరికీ పక్క గృహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం” అని ప్రధాన మంత్రి అన్నారు.

గృహాలు సమకూర్చడాన్ని గురించి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “మధ్యతరగతికి చెందినవారు సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు వీలుగా లక్షన్నర వరకు గృహ రుణాలపై వడ్డీ మినహాయింపు ఇవ్వడం జరిగిందని, నిధుల స్వాహాను అరికట్టడానికి, పారదర్శకంగా వ్యవహరించడానికి గృహ నిర్మాణంలో వివిధ దశల ఫోటోలను వెబ్సైటులో ఉంచడం జరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతకోసం రేరా చట్టాన్ని తెచ్చామని, ఆ చట్టాన్ని పలు రాష్ట్రాలలో ప్రకటించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం లక్షలాది ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది” అన్నారు.

ప్రభుత్వం నేలమాళిగలలో పనిచేయాలని అనుకోవడం లేదని, అన్ని పథకాలను జతకలిపి అభివృద్ధికి పాటుపడాలని బావిస్తోందని, ప్రభుత్వ పథకాల విజయానికి ప్రజలు తోడ్పాటును అందించగలరనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

సమర యోధుడు శ్రీ ఉమాజీ నాయక్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళులు అర్పించి ఆయన ఎంతో గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడని అన్నారు.

ఈ సందర్భంగా “గ్రామీణ మహారాష్ట్రలో పరివర్తన” అనే గ్రంథాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు.

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోశ్వారి; మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడనవీస్ ; కేంద్ర వాణిజ్య & పరిశ్రమలు మరియు రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళ & శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి పంకజ ముండే; మహారాష్ట్ర పరిశ్రమలు & గనుల శాఖ మంత్రి శ్రీ సుభాష్ దేశాయ్ తదితర ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

***