ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబయ్ ఇన్ మినట్స్ దార్శనికత కు అనుగుణం గా ముంబయి మెట్రో కు చెందిన వివిధ పథకాల ను ఈ రోజు న ప్రారంభించడం మరియు పునాదిరాయి ని వేయడం చేశారు. ఈ పథకాలు నగరం లోని మెట్రో సంబంధిత మౌలిక సదుపాయాల కు ఊతాన్ని ఇవ్వడమే కాక ముంబయి లోని ప్రతి ఒక్కరి కి భద్రమైనటువంటి, వేగవంతమైనటువంటి మరియు శ్రేష్టమైనటువంటి రాకపోకల సౌకర్యాన్ని అందిస్తాయి.
ముంబయి నివాసుల స్ఫూర్తి ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, లోక్ మాన్య తిలక్ గారు ప్రారంభించిన గణేశ్ ఉత్సవాలు దేశ విదేశాల లో సైతం ప్రజాదరణ కు నోచుకొన్నాయన్నారు.
ఐఎస్ఆర్ఒ (‘ఇస్రో’) యొక్క మరియు ఇస్రో శాస్త్రవేత్తల బృందం యొక్క దృఢ సంకల్పాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, “లక్ష్యాల ను సాధించడం కోసం పాటు పడే వారి లో మూడు రకాల వారు ఉంటారన్నారు. వారిలో – ఒక వర్గం వైఫల్యం తాలూకు భయం కారణం గా అసలు పనినే మొదలు పెట్టరని, మరో వర్గం వారు పని ని మొదలు పెట్టినప్పటికీ సవాళ్ళు ఎదరైనప్పుడు ఆ పని ని విడచిపెట్టి పారిపోతారని, ఇంకొక వర్గం వారు పెను సవాళ్ళు ఎదురయినప్పటికీ కూడాను అదే పని గా శ్రమిస్తారని ఆయన వివరించారు. ఇస్రో, ఇంకా ఇస్రో తో సంబంధం కలిగినటువంటి వారు మూడో కేటగిరి కి చెందుతారని, వారు పని ని ఆపి వేయడం గాని, లేదా అలసట కు లోనవడం గాని, లేదా సాహస యాత్ర యొక్క లక్ష్యాన్ని సాధించే కన్నా ముందే పని ని ఆపివేసే వారు గాని కాదు అని ప్రధాన మంత్రి వివరించారు. మనం మిశన్ చంద్రయాన్– 2 లో ఒక సవాలు ను ఎదుర్కోవలసివచ్చిందని, అయితే ఇస్రో యొక్క శాస్త్రవత్త లు లక్ష్యాన్ని సాధించనంత వరకు ఆగిపోయే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. చంద్రుడి ని జయించాలన్న లక్ష్యాన్ని తప్పక సాధిస్తామన్నారు. ఆర్బిటర్ ను చంద్ర గ్రహ కక్ష్య లోకి ప్రవేశపెట్టడం లో సాఫల్యం సాధించడం చరిత్రాత్మకమైనటువంటి కార్యసిద్ధి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ముంబయి లో ఈ రోజు న ప్రారంభించుకున్న పథకాలు 20,000 కోట్ల రూపాయలు విలువ చేస్తాయి అని ప్రధాన మంత్రి తెలిపారు. 1.5 లక్షల కోట్ల రూపాయల నిధుల ను ఇప్పటికే ముంబయి మెట్రో లో పెట్టుబడి పెట్టడమైందని ఆయన వివరించారు. కొత్త మెట్రో మార్గాలు, మెట్రో భవన్, ఇంకా మెట్రో స్టేశన్ ల లోని నూతన సౌకర్యాలు ముంబయి కి ఒక కొత్త దిశ ను అందించి, ముంబయి లో నివసించే వారి జీవనాన్ని సులభతరం చేసివేస్తాయని ఆయన వివరించారు. ‘‘బాంద్రా కు మరియు ఎక్స్ ప్రెస్ వే కు మధ్యన ఏర్పడిన సంధానం వృత్తి నిపుణుల కు జీవనాన్ని సులభతరం గా మార్చివేస్తుంది. ఈ పథకాల తో ముంబయి ని నిమిషాల వ్యవధి లో చేరుకోవచ్చును’’ అని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల రంగం లో తీసుకు వస్తున్న మార్పుల కు గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.
భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ గా అవతరించే దిశ గా పురోగమించే క్రమం లో మన నగరాలు సైతం 21వ శతాబ్దపు నగరాలు గా తయారు కావాలి. ఈ లక్ష్యాని కి అనుగుణం గా ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాల కాలం లో 100 లక్షల కోట్ల రూపాయల ను ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణాని కి వెచ్చిస్తోంది. దీని తో ముంబయి కి మరియు అనేక ఇతర నగరాల కు లబ్ధి చేకూరనుంది. భవిష్యత్తు అవసరాల కు తగినట్లు ఉండే మౌలిక సదుపాయాల కల్పన తాలూకు ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి వివరిస్తూ, నగరాల ను అభివృద్ధి పరచే క్రమం లో భద్రత ను, స్థిరత్వాన్ని, ఉత్పాదకత ను మరియు సంధానాన్ని పరిగణన లోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.
రవాణా ను సులభతరం చేయడం కోసం ప్రభుత్వం ఏకీకృత రవాణా వ్యవస్థల నిర్మాణాని కి పాటుపడుతోంది. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ కోసం మెరుగైన మౌలిక సదుపాయల ను కల్పించడాని కి ఒక దార్శనిక పత్రాన్ని విడుదల చేయడమైంది. ఈ పత్రం ముంబయి లోకల్, బస్సు వ్యవస్థ ల వంటి వివిధ రవాణా సాధనాల ను ఏ రకం గా ఉత్తమమైన రీతి లో వినియోగించుకోవచ్చో తెలియజెప్తుంది.
ముంబయి మెట్రో కోసం ఒక బృహత్ ప్రణాళిక ను రూపొందించడమైంది. ముంబయి మెట్రో కోసం ఉద్దేశించిన ఒక విస్తరణ ప్రణాళిక ను గురించి ప్రధాన మంత్రి పౌరుల కు తెలియజేస్తూ, ‘‘ఈ రోజు న 11 కిలో మీటర్ల నుండి నగర మెట్రో నెట్ వర్క్ 2023-2024 కల్లా 325 కి.మీ. కి పెరుగుతుంది’’ అన్నారు. ప్రస్తుతం ముంబయి లోకల్ చేరవేస్తున్న ప్రజల సంఖ్య తో సమానమైన స్థాయి కి మెట్రో యొక్క సామర్ధ్యం చేరుకొంటుంది. మెట్రో మార్గాల పై నడిచే రైలు పెట్టెల ను కూడా భారతదేశం లో తయారు చేయడం జరుగుతుంది” అని ఆయన చెప్పారు.
మెట్రో పథకాల వల్ల 10,000 మంది ఇంజినీర్ల తో పాటు, నైపుణ్యం కలిగిన శ్రామికులు మరియు నైపుణ్యం అంతగా లేని శ్రామికులు కలుపుకొని 40,000 మంది ఉద్యోగ అవకాశాల ను పొందుతారు అని ప్రధాన మంత్రి తెలిపారు. నవీ ముంబయి విమానాశ్రయం, ముంబయి ట్రాన్స్ హార్బర్ టర్మినల్, ఇంకా బులిట్ ట్రైన్ ప్రోజెక్టు లను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, ప్రస్తుతం వివిధ ప్రోజెక్టుల ను అమలు పరుస్తున్న స్థాయి మరియు వేగం ఇది వరకు ఎరుగనివి అని పేర్కొన్నారు.
భారతదేశం లో మెట్రో వ్యవస్థ విస్తరణ వేగాన్ని గురించి ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఇటీవలి కాలం వరకు మెట్రో కేవలం కొన్ని నగరాల లో ఉండేదని, అయితే ప్రస్తుతం ఒక మెట్రో ఉనికి లో ఉండటం లేదా సమీప భవిష్యత్తు లో ఈ సదుపాయం ప్రారంభాని కి నోచుకోవడం అనేది 27 నగరాల లో చోటు చేసుకుందని ఆయన వివరించారు. “675 కి.మీ. ల మేర మెట్రో మార్గాలు ప్రస్తుతం రాకపోకల కు అనువు గా ఉన్నాయి. వీటి లో దాదాపు గా 400 కి.మీ. మార్గం గడచిన అయిదు సంవత్సరాల లో అందుబాటు లోకి వచ్చింది. 850 కి.మీ. ప్రాంతం లో పనులు పురోగతి లో ఉన్నాయి. కాగా, మెట్రో మార్గాల తాలూకు 600 కి.మీ పనుల కు ఆమోదం ఇవ్వడమైంది’’ అని ప్రధాన మంత్రి వెల్లడించారు.
భారతదేశం లో శీఘ్రగతి న అభివృద్ధి పరచే క్రమం లో మౌలిక సదుపాయాల కల్పన ను సమగ్రంగా వికసింపచేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని ప్రధాన మంత్రి చెప్పారు.
ప్రభుత్వం తొలి 100 రోజుల కాలం లో చరిత్రాత్మకమైన నిర్ణయాల ను తీసుకొందని ప్రధాన మంత్రి తెలిపారు. జల్ జీవన్ మిశన్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, మూడు సార్లు తలాక్ పద్ధతి రద్దు మరియు బాలల భద్రత కోసం చట్టం ల వంటి అంశాల ను ఆయన ప్రస్తావిస్తూ, ప్రభుత్వం నిర్ణయాత్మకమైనటువంటి చర్యల ను మరియు పరివర్తనాత్మకమైనటువంటి చర్యల ను తీసుకొందన్నారు.
ఒకరి బాధ్యతలు ఏమిటన్నది తెలుసుకొనేందుకు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, సురాజ్య అనేది భారతదేశం లో ప్రతి ఒక్కరి కర్తవ్యం అన్నారు. దేశం కోసం ప్రతి ఒక్కరు ఒక సంకల్పాన్ని తీసుకోవాలని, మరి ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం కష్టపడి పని చేయాలని ప్రధాన మంత్రి అన్నారు. వినాయక నిమజ్జనం కాలం లో జల వనరుల ను కలుషితం చేయకూడదని ఆయన సూచించారు. పండుగ కాలం లో బోలెడంత వ్యర్థాలు మరియు ప్లాస్టిక్ సముద్రం లో కలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మీఠీ నది, ఇంకా ఇతర జల వనరుల ను ప్లాస్టిక్ రహితం గా మార్చుకోవలసింది గా కూడా ప్రజల కు ఆయన పిలుపునిచ్చారు. ఇలా చేయడం ద్వారా భారతదేశం లోని మిగతా ప్రాంతాల కు ఒక ఉదాహరణ గా నిలవాలని, అదే మాదిరి గా భారతదేశాన్ని ప్లాస్టిక్ కు తావు లేనిది గా మార్చే ప్రయత్నం లో పాలు పంచుకోవాలని ప్రధాన మంత్రి కోరారు.
పథకాల సంక్షిప్త వివరాలు
ప్రధాన మంత్రి మూడు మెట్రో మార్గాల కు శంకు స్థాపన చేశారు. ఇవి అన్నీ కలుపుకొని, నగరం లో మెట్రో నెట్ వర్క్ కు అదనం గా 42 కి.మీ. ల మార్గాన్ని జోడిస్తాయి. ఈ మూడు కారిడార్ ల లో గాయ్ ముఖ్ నుండి శివాజీచౌక్ (మీరా రోడ్) వరకు ఉండేటటువంటి మెట్రో-10 కారిడార్ 9.2 కి.మీ ల పొడవు న సాగుతుంది. కాగా, వడాలా నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ మెట్రో-11 కారిడార్ 12.7 కి.మీ. ల పొడవు న మరియు కళ్యాణ్ నుండి తలోజా మెట్రో- కారిడార్ 20.7 కి.మీ. పొడవు న సాగుతుంది.
అత్యంత అధునాతనమైన మెట్రో భవన్ కు కూడా ప్రధాన మంత్రి పునాదిరాయి ని వేశారు. 32 అంతస్తుల తో ఏర్పాటయ్యే ఈ కేంద్రం దాదాపు 340 కిలో మీటర్ల మేరకు విస్తరించిన 14 మెట్రో మార్గాల రాక పోక ల పర్యవేక్షణ తో పాటు నియంత్రణ కు కూడా పూచీ పడుతుంది.
ప్రధాన మంత్రి కాందివలీ ఈస్ట్ ప్రాంతం లోని బన్దోంగరీ మెట్రో స్టేశన్ ను ప్రారంభించారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగం గా రూపుదిద్దుకున్న అత్యాధునికమైన ఒకటో మెట్రో కోచ్ ను కూడా ఆయన ప్రారంభించారు. మహా ముంబయి మెట్రో కు సంబంధించిన ఒక బ్రాండ్ విజన్ డాక్యుమెంట్ ను ప్రధాన మంత్రి విడుదల చేశారు.
మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింహ్ కోశ్యారీ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ణవీస్, రైల్వేలు, ఇంకా వాణిజ్యం, పరిశ్రమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ లతో పాటు సామాజిక న్యాయం & సాధికారిత శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ దాస్ అఠావలే కూడా ఈ కార్యక్రమాని కి హాజరయ్యారు.
**
Enhancing ‘Ease of Living’ for the people of Mumbai.
— Narendra Modi (@narendramodi) September 7, 2019
Work has begun on developmental projects worth over Rs. 20,000 crore for the city. This includes better metro connectivity, boosting infrastructure in metro stations, linking BKC with Eastern Express Highway and more. pic.twitter.com/ZZ6blu1N2e
Improving comfort and connectivity for Mumbai.
— Narendra Modi (@narendramodi) September 7, 2019
Delighted to inaugurate a state-of-the-art metro coach, which is also a wonderful example of @makeinindia. pic.twitter.com/Dsqe6lmaYy