జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది శుద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు కు (ఎఫ్ బి పి కి) చెందిన 58.81 ఎకరాల మిగులు భూమిని హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళానికి బదలాయించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ భూమిని పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లా కాలియాచాక్ పోలీస్ స్టేషన్ పరిధి మౌజా జగన్నాథ్ పూర్ జెఎల్ నం. 35 లోని ఖేజూరియా ఘాట్ వద్ద బి ఎస్ ఎఫ్ 04వ బెటాలియన్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయడం కోసం ఉద్ధేశించారు.
మాల్దా జిల్లాలో బంగ్లాదేశ్ తో భారతదేశానికి ఉన్నకీలకమైన సరిహద్దులకు బీఎస్ఎఫ్ అందజేస్తున్నరక్షణ వల్ల ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు కు కూడా కాపలా ప్రయోజనం సమకూరనున్నది. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు కు జాతీయ ప్రాధాన్యమే కాక, అంతర్జాతీయ ప్రాధాన్యం కూడా ఉన్నది. అంతేకాకుండా, బీఎస్ఎఫ్ అందజేస్తున్నరక్షణ వల్ల ఎఫ్‌బిపి భూమిలో ఎటువంటి ఆక్రమణల ముప్పు గాని, ఎఫ్‌బిపికి ఎటువంటి భద్రత సంబంధమైన ఆందోళనలు గాని తలెత్తకుండా ఉంటుంది.
***