ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మయన్మార్ డిఫెన్స్ సర్వీసెస్ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ శ్రీ మిన్ ఆంగ్ లాయింగ్ ఈ రోజు న సమావేశమయ్యారు.
ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో విజేత గా నిలచిన ప్రధాన మంత్రి కి సీనియర్ జనరల్ అభినందనలు తెలిపారు. గడచిన కొన్ని సంవత్సరాల లో భారతదేశం లో అభివృద్ధి శీఘ్ర గతి న చోటు చేసుకొందని, అదే విధం గా రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య రక్షణపరమైన సహకారం తో పాటు భద్రతపరమైన సహకారం సహా అన్ని రంగాల లో విశిష్టమైన సంబంధాలు సైతం నెలకొన్నాయని ఆయన తెలిపారు.
ప్రధాన మంత్రి తాను మయన్మార్ ను సందర్శించిన సందర్భాల లో తనకు లభించిన ఆప్యాయత ను మరియు ఆతిథ్యాన్ని గుర్తు కు తెచ్చుకొన్నారు. విద్రోహ కార్యకలాపాల నిరోధం, కెపాసిటీ బిల్డింగ్, సైన్యానికి- సైన్యానికి మధ్య సంబంధాలు మరియు సముద్ర సంబంధి సహకారం లతో పాటు ఆర్ధిక రంగం లో సహకారం, ఇంకా అభివృద్ధి పరం గా సహకారం వంటి రంగాల లో ద్వైపాక్షిక సహకారం శ్రేష్ఠమైన రీతి న కొనసాగుతున్నదని కూడా ఆయన అన్నారు.