ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఇండియన్ ఫారిన్ సర్వీస్ 2014 మరియు 2015 బ్యాచ్ లకు చెందిన, శిక్షణ లో ఉన్న అధికారులు 64 మంది ఈ రోజు కలుసుకొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి వారితో తన ఆలోచనలను పంచుకొన్నారు; భారతదేశానికి మరియు వెలుపలి ప్రపంచానికి మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించే దిశగా కృషి చేయంనడంటూ యువ అధికారులలో ఆయన ఉత్తేజాన్ని నింపారు. వారు దేశం పట్ల లోతైన అవగాహనను ఏర్పరచుకొంటుండాలని, సహకార సమాఖ్య స్ఫూర్తితో భారతదేశం లోని రాష్ట్రాలకు వెలుపలి ప్రపంచంతో సంబంధాలను బలపరచాలని, ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలతో పాటు సాంస్కృతిక సంబంధాలను కూడా ఇప్పటి కన్నా మరింతగా ప్రోత్సహించాలని, వ్యాపారం- పెట్టుబడులు, సాంకేతిక విజ్ఞాన సంబంధాలను పటిష్టపరచాలని, విదేశాలలో నివసిస్తున్న భారతీయుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మరింత ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలని, ఇంకా.. వారి సంక్షేమంపై ధ్యాస ఉంచాలంటూ పలు సూచనలు చేశారు.
***
Met our young diplomats…officer trainees of the IFS. pic.twitter.com/BjgevKEzmN
— Narendra Modi (@narendramodi) April 5, 2016