Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2019 జి-20 సదస్సు నేపథ్యం లో ” రష్యా-ఇండియా -చైనా” (ఆర్ఐసి) నేత ల లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి ప్రారంభిక వ్యాఖ్య లు


శ్రేష్ఠులు, నా మిత్రులైన అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ మరియు అధ్యక్షుడు శ్రీ పుతిన్,

కిందటి సంవత్సరం లో అర్జెంటీనా లో దీర్ఘకాలం అనంతరం మన మూడు దేశాలు శిఖర స్థాయి సమావేశాన్ని నిర్వహించుకొన్నాము.

ప్రధాన అంతర్జాతీయ సమస్యల పై ఉపయుక్తమైన అభిప్రాయలు ఇచ్చి పుచ్చుకున్నాక, మనం భవిష్యత్తు లో తిరిగి సమావేశం కావాలని అంగీకరించాము.

ఈ రోజు న జరుగుతున్న ఈ లాంఛనప్రాయం కానటువంటి ఆర్ఐసి శిఖర సమ్మేళనాని కి మిమ్ములను ఆహ్వానిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.

ప్రపంచం లోని ప్రముఖ ఆర్ధిక వ్యవస్థలు గా ఉన్న మనం, అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ, భద్రత పరిస్థితుల పై అభిప్రాయాల ను ఇచ్చి పుచ్చుకోవడం చాలా ముఖ్యం. ప్రధాన అంతర్జాతీయ సమస్యల పై చర్చించడాని కి, సమన్వయ పరచడాని కి మనం ఈ రోజు న జరిపే త్రైపాక్షిక సమావేశం ఒక ప్రయోజనకరమైన మాధ్యమం గా నిలుస్తుంది.

ఈ సంవత్సరం ఫిబ్రవరి లో చైనా లో నిర్వహించిన విదేశాంగ మంత్రుల సమావేశం లో అనేక విషయాల పైన మనం అభిప్రాయాలను ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. వీటి లో, ఆర్ఐసి లో భాగం గా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, అంతర్జాతీయ హాట్-స్పాట్ సమస్యలు, సంస్కరించబడిన బహుళ పాక్షికత, జల వాయు పరివర్తన , సహకారం మొదలైన అంశాలు ఉన్నాయి.

ఇక నేను శ్రేష్ఠుడు, అధ్యక్షుడు శ్రీ శీ ని వారి ప్రారంభిక వ్యాఖ్యల ను చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.

( అధ్యక్షుడు శ్రీ శీ ప్రారంభిక వ్యాఖ్య ల అనంతరం)

అధ్యక్షుడు శ్రీ కి ధన్యవాదాలు.

ఇప్పుడు నేను శ్రేష్ఠుడు, అధ్యక్షుడు శ్రీ పుతిన్ ను వారి ప్రారంభిక వ్యాఖ్యల ను చేయవలసింది గా అభ్యర్థిస్తున్నాను.

అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు కృతజ్ఞతలు.

అస్వీకరణ: ప్రధాన మంత్రి వ్యాఖ్యానం హిందీ భాష లో సాగింది. ఇది ఆ ఉపన్యాసాని కి ఉజ్జాయింపు అనువాదం.