Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వివాహిత‌లైన ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కులకు ర‌క్ష‌ణ‌


‘స‌బ్ కా సాథ్‌, స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్’ అనేవి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని ఎన్‌.డి.ఎ ప్ర‌భుత్వ కీల‌క అంశాలుగా ఉన్నాయి. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌లో ఒక‌దానిని నెర‌వేరుస్తూ , ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర‌కేబినెట్ , ముస్లిం మ‌హిళ‌ల‌( వివాహ హ‌క్కుల ర‌క్ష‌ణ‌) రెండ‌వ ఆర్డినెన్స్ 2019 ( ఆర్డినెన్స్ 4 ఆఫ్ 2019) స్థానంలో ముస్లిం మ‌హిళ‌ల‌( వివాహ హ‌క్కుల ర‌క్ష‌ణ‌) బిల్లు 2019ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఆమోదించింది.

ప్ర‌భావం …

ఈ బిల్లు ముస్లిం మ‌హిళ‌ల‌కు స్త్రీ ,పుర‌ష స‌మాన‌త్వం, స్త్రీ పురుష స‌మాన న్యాయాన్ని క‌ల్పిస్తుంది. ఈ బిల్లు వివాహితులైన ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కుల‌ను ర‌క్షించేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే త‌లాక్‌- ఎ- బిద్ద‌త్ ప‌ద్ధ‌తి ప్రకారం భార్య‌నుంచి, భ‌ర్త‌ విడాకులు పొంద‌డాన్నిఇది నిరొధిస్తుంది. ఈ బిల్లును రానున్న పార్ల‌మెంటు స‌మావేశాల‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

ఫ‌లితాలు….

• ఈ బిల్లు ట్రిపుల్ త‌లాక్ ప‌ద్ధ‌తి చెల్ల‌నేర‌నిదిగా, చ‌ట్ట‌వ్య‌తిరేక‌మైన‌దిగా ప్ర‌క‌టించ‌డానికి ప్ర‌తిపాదిస్తున్న‌ది

• దీనిని శిక్షార్హ‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తుంది. ఇందుకు మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కు జైలు శిక్ష‌, జ‌రిమానా విధిస్తారు.

• వివాహిత ముస్లిం మ‌హిళ‌లు, వారిపై ఆధార‌ప‌డిన పిల్ల‌ల‌కు స‌బ్‌సిస్టెన్స్ అల‌వెన్సునుకూడా బిల్లు ప్ర‌తిపాదిస్తున్న‌ది.

• త‌న భ‌ర్త త‌న ప‌ట్ల‌ త‌లాక్ చెప్పి నేరానికి పాల్ప‌డిన‌ దానికి సంబంధించిన స‌మాచారాన్ని వివాహిత మ‌హిళ‌ పోలీస్ స్టేష‌న్ ఇంఛార్జి అధికారికి అంద‌జేసినా లేక ఆమె ర‌క్త‌సంబంధీకులు లేదా వివాహ సంబంధంగా బంధువులైన వారు ఎవ‌రైనా స‌మాచారం అందించినా ఆ నేరాన్ని కాగ్న‌యిజ‌బుల్ నేరంగా ప‌రిగ‌ణిస్తూ బిల్లు ప్ర‌తిపాదిస్తున్న‌ది.

• త‌లాక్ కు గురైన మ‌హిళ విష‌యంలో జ‌రిగిన నేరానికి సంబంధించి ,ఈ నేరాన్ని మేజిస్ట్రేట్ అనుమ‌తితో కాంపౌండ‌బుల్ నేరంగా ప‌రిగ‌ణిస్తారు.

• నిందితుడిని మేజిస్ట్రేట్ బెయిల్‌పై విడుద‌ల చేయ‌డానికి ముందు , త‌లాక్ కు గురైన ముస్లిం వివాహిత మ‌హిళ వాద‌న‌ను వినేందుకు కూడా బిల్లు వీలు క‌ల్పిస్తున్న‌ది.

ముస్లిం మ‌హిళ‌( వివాహ హ‌క్కుల‌ర‌క్ష‌ణ‌) బిల్లు 2019, ముస్లిం మ‌హిళ‌(వివాహ హ‌క్కుల ర‌క్ష‌ణ ) రెండో ఆర్డినెన్స్ 2019 కి అనుగుణంగానే ఉంది.