మహిళలు మరియు సజ్జనులారా,
ఆలస్యం గా ఇక్కడికి చేరుకొన్నందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. ముందు గా లీలాధర్ బాలగోపాల్ నంద్లాల్ పుట్టిన గడ్డ నుండి మీ అందరికి ఇవే నా యొక్క శుభాకాంక్షలు.
కృష్ణ భగవానుని లీల లకు ఒక సాక్షి అయిన బ్రజ భూమి లో దివ్యమైనటువంటి మరియు పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనమంతా ఈ రోజు న దర్శించబోతున్నాం. భగవద్ గీత లోని ఒక శ్లోకాన్ని మీ సమక్షం లో నేను వినిపించాలనుకొంటున్నాను. కృష్ణ భగవానుడు చెప్పిందేమిటంటే –
दातव्य मिति यद्दानम् दीयते नुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम्॥
అని. ఈ మాటల కు- ప్రతిఫలం ఆశించకుండా ఒక కర్తవ్యం గా విరాళాన్ని ఇచ్చినప్పుడు, మరి ఆ యొక్క విరాళాన్ని సరి అయిన ప్రదేశం లో సరి అయిన సమయం లో తగిన వ్యక్తి కి ఇచ్చినప్పుడు అది సాత్విక దానం అవుతుంది- అని భావం.
అక్షయ పాత్ర ఫౌండేశన్ గత 18 సంవత్సరాలు గా దేశం లోని బాలల కు పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేటటువంటి మంచి పని ని చేస్తూ వస్తోంది. ఈ కృషి కి గాను మీకు నా శుభాశీస్సులు.
మిత్రులారా,
ఇప్పటి నుండి కొద్ది సేపట్లో, ఈ బాలల కు ఆహారాన్ని వడ్డించే అవకాశం నాకు లభించనుంది. ఇక్కడ వడ్డించే భోజనాల లో ఒక భోజనం మూడు వందల కోట్లవ భోజనం కానుంది. మోహన్ దాస్ గారు ఇప్పుడే చెప్పినట్లు, 1500 మంది బాలల తో ఈ ఉద్యమం మొదలైన ; ప్రస్తుతం 17 లక్షల మంది చిన్నారుల ను బలవర్ధక ఆహారాన్ని అందించడం జరుగుతోంది.
మాన్య శ్రీ అటల్ గారి హయాం లో మీరంతా కలసి ఒకటో భోజనాన్ని వడ్డించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ రోజు న మూడు వందల కోట్లవ భోజనాన్ని వడ్డించే అవకాశం నాకు దక్కింది.
మిత్రులారా,
మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పని అసాధారణమైంది. మీరు అందిస్తున్న ఈ సేవ అసామాన్యమైనటువంటిది. ఈ విధమైన అంకిత భావం సాటి లేనిది. వేల సంవత్సరాల పాతవైన మన సంప్రదాయాలు మనకు ప్రసాదించిన విలువలకు ఇది ఒక విస్తరణ. సేవ చేయడం మరియు సమర్పణభావం అనేవి ఏ గౌరవాన్నో పొందడానికి గాని, లేదా ఏ పురస్కారాన్నో పొందడానికి గాని ఉద్దేశించినవి కావని నేను ఎరుగుదును. ఏమైనా, ఇటీవల దేశ ప్రజలు మీ ప్రయత్నాల కు ఒక ప్రధానమైన గుర్తింపు ను ఇచ్చారు.
లక్షలాది చిన్న పిల్లల కు మధ్యాహ్న భోజనాల ను సమకూర్చుతున్నందుకు గాను అక్షయ పాత్ర ఫౌండేశన్ కు గాంధీ శాంతి బహుమతి ని ప్రదానం చేయడమైంది. అదీ కాక, స్వామి మధుపండిత్ దాస్ గారి ని సైతం పద్మశ్రీ పురస్కారం తో సమ్మానించడం జరిగింది. ఇందుకుగాను మీ అందరిని నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,
మధ్యాహ్న భోజనమనే సంప్రదాయం స్వాతంత్య్రం కన్నా ముందు కాలం లో ఆరంభం అయింది. దీని కి గల కారణాల లో భారతదేశం లోని పరిస్థితులు కూడా ఒక కారణం. దీర్ఘ కాలం పాటు బానిసత్వం లో మగ్గినందువల్ల, వనరుల కు కొరత ఏర్పడింది. పేదరికం దాని శిఖర స్థాయి కి చేరింది. మరి ప్రజల కు బతుకుదెరువును కల్పించడం కోసం మనం సంఘర్షించవలసివచ్చింది. ఆ పరిస్థితి యొక్క అత్యంత ప్రతికూల ప్రభావం బాలల పైన పడింది. ప్రస్తుతం మారినటువంటి పరిస్థితుల లో, బాలల కు చాలినంత పౌష్టిక విలువల తో కూడిగిన మరియు మంచి నాణ్యమైనటువంటి ఆహారం అందేటట్లుగా చూడడం జరుగుతోంది. అక్షయ పాత్ర ఫౌండేశన్ తో కలసి పాటుపడుతున్న వారు అందరూ.. వంట వారు, భోజనాల ను అందజేస్తున్న మరియు భోజనాల ను వడ్డిస్తున్న వారు.. దేశాని కి సహాయాన్ని అందిస్తున్నట్లే.
మిత్రులారా,
ఒక బలమైన భవనాన్ని నిర్మించాలంటే ఒక గట్టి పునాది రాయి ముఖ్యావసరం. అదే విధంగా ఒక బలమైన ‘న్యూ ఇండియా’ ఆవిష్కరింపబడాలి అంటే చక్కని బలవర్ధక ఆహారం తో పాటు ఆరోగ్యవంతమైనటువంటి బాల్యం కూడా ఎంతైనా అవసరమవుతుంది. దేశం లోని బాలలు బలహీనులు గా ఉండిపోతే, అటువంటప్పుడు ఆ దేశం యొక్క అభివృద్ధి వేగం నెమ్మదిస్తుంది. ఒక శిశువు పుట్టడాని కన్నా ముందు నుండి మరియు ఆ పాపాయి పుట్టిన వెనువెంటనే ఆ శిశువు పోషణ పట్ల మనం శ్రద్ధ ను వహించిన పక్షం లో, మరియు వ్యాధుల కు ఎదురొడ్డి పోరాడే నిరోధ స్థాయిల ను మెరుగు పరచగలిగిన పక్షంలో, అప్పుడు ఆ తరువాతి జీవనం లో ఆరోగ్య సంబంధిత సమస్య లు చాలా తక్కువ సంఖ్య కు పరిమితమవుతాయి.
భగవద్ గీత లో ఇలా బోధించబడింది:-
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा॥
ఈ మాటల కు- సమతుల ఆహారాన్ని తీసుకొనేటటువంటి, చక్కని అలవాట్లు మరియు నడవడిక కలిగినటువంటి, నిర్ణీత కాలం పాటు నిదురించే వైఖరి ని అలవరచుకొనే వ్యక్తి కి అతడి దురవస్థలన్నీ కూడాను ధ్యానసాధన తో సమసి పోతాయి- అని భావం. ఈ స్ఫూర్తి ని ముందుకు తీసుకు పోతూ, చిన్న పిల్లల కు ఒక స్వాస్థ్య జీవనాన్ని కల్పించేందుకు గాను మాతృమూర్తుల కు మరియు పిల్లల కు పౌష్టికాహారం అవసరమంటూ కేంద్ర ప్రభుత్వం గడచిన 55 నెలల్లో స్పష్టీకరించింది.
మిత్రులారా,
బాలల కు పోషకాహారాన్ని సమకూర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించింది. బాల్యాన్ని భద్రం గా ఉంచే ప్రయత్నాలను చేపట్టడమైంది. ఈ భద్రత కవచం లో మూడు అంశాలు ఉన్నాయి. వాటి లో ఒకటోది పోషకాహారం, బలవర్ధక విలువలు కలిగిన ఆహారం అనేది ఒక ప్రధానమైన అంశం కాగా; వ్యాధి నిరోధం మరియు స్వస్థత అనేవి మిగిలిన రెండు అంశాలు. ఈ అక్షయ పాత్ర తో ముడిపడిన భాగస్వామ్య పక్షాలన్నీ ఈ భద్రత కవచాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సాగిస్తున్న కృషి కి అండ గా నిలవడాన్ని నేను హర్షిస్తున్నాను.
మిత్రులారా,
ఆరోగ్యాని కి, పౌష్టికాహారాని కి మధ్య ఓ ప్రత్యక్ష సంబంధం ఉంది. మనం పోషణ విజ్ఞాన కార్యక్రమాన్ని ప్రతి తల్లి కి, ప్రతి బిడ్డ కు చేర్చడం లో సఫలమైన పక్షం లో ఎన్నో ప్రాణాల ను కాపాడిన వారం అవుతాం. ఇదే ఆలోచన తో మా ప్రభుత్వం దేశవ్యాప్తం గా కిందటి సంవత్సరం ‘పోషణ్ అభియాన్’ ను రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లా నుండి ప్రారంభించింది. ఈ అభియాన్ యొక్క ప్రాముఖ్యాన్ని దృష్టి లో పెట్టుకొని గత సంవత్సరం సెప్టెంబర్ మాసాన్ని పోషకాహారాని కి అంకితం ఇవ్వడం జరిగింది.
మిత్రులారా,
అది పోషక విలువ లు కావచ్చు, పారిశుధ్యం కావచ్చు లేదా వ్యాధి నిరోధం కావచ్చు. ఈ అంశాల ను ఇంతకు మునుపు ఎవ్వరూ ఆలోచించలేదని కాదు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నుండి ఈ అంశాల పై దృష్టి ని సారిస్తూ లెక్క లేనన్ని కార్యక్రమాలు అమలవుతూ వచ్చాయి. అయితే, అవి అంతగా విజయవంతం కాలేదు. తక్కువ వనరులు కలిగిన చిన్న దేశాలు కూడా ఈ రంగం లో మనను అధిగమించాయి. ఈ పరిస్థితి నుండి బయటకు రావడం కోసం మేము 2014వ సంవత్సరం నాటి నుండి ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరించాం. టీకాల ను ఇచ్చే కార్యక్రమాన్ని ఒక ఉద్యమం తరహా లో చేపట్టాలని మేము నిర్ణయించాము. మిశన్ ఇంద్రధనుష్ లో భాగం గా దేశం లోని ప్రతి ఒక్క చిన్నారి చెంతకు చేరుకోవాలని కూడా మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము.
మిత్రులారా,
ఈ ఉద్యమం లో భాగం గా ఇంతవరకు దేశం లో సుమారు 3 కోట్ల 40 లక్షల మంది చిన్నపిల్లల కు, మరి అలాగే దాదాపు 90 లక్షల మంది గర్భవతుల కు టీకాలు ఇవ్వబడ్డాయి. ఈ పని ఎంత వేగం గా పురోగమిస్తోందనేది అందరికీ టీకాల ను సమకూర్చాలన్న మా లక్ష్యం ఎంతో దూరం లో లేదు అని అనిపిస్తోంది.
మిత్రులారా,
మేము టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికే పరిమితం కాకుండా, టీకాల సంఖ్య ను కూడా పెంచాము. అయిదు కొత్త టీకా మందుల ను ఇదివరకటి కార్యక్రమాని కి జోడించడమైంది. వీటి లో ఒకటి మెదడువాపు వ్యాధి కి వ్యతిరేకం గా పని చేస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు ఈ వ్యాధి బారిన పడ్డాయి. ప్రస్తుతం చిన్నారుల కు మొత్తం 12 రకాల వ్యాక్సిన్ ల ను ఇస్తున్నారు.
మిశన్ ఇంద్రధనుష్ తో పాటు భారతదేశం అమలు చేస్తున్న ఇతర పథకాలు ప్రపంచ వ్యాప్తం గా ప్రశంసల కు నోచుకొంటున్నాయని తెలిసి నేను సంతోషిస్తున్నాను. ఇటీవల ఒక ప్రముఖ వైద్య పత్రిక ఈ కార్యక్రమాన్ని ప్రపంచం లో 12 ఉత్తమ విధానాల లో ఒకటిగా ఎంపిక చేసింది.
మిత్రులారా,
అది మిశన్ ఇంద్రధనుష్ కావచ్చు లేదా ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ లో భాగం గా గర్భిణుల కు పోషకాహారం కోసం అందిస్తున్న 6,000 రూపాయల సహాయం కావచ్చు.. ఇవి అప్పుడే పుట్టిన శిశువు లను మరియు ప్రసవ కాలం లో తల్లుల ను ప్రాణాపాయకర వ్యాధుల దాడుల నుండి కాపాడుతాయి.
మిత్రులారా,
చిన్నారుల కు రక్షణ కవచాన్ని కల్పించడం లో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించేది స్వచ్ఛతే. అనారోగ్యకర పరిస్థితులు మరీ ముఖ్యం గా పిల్లల విషయం లో ప్రాణాంతకం గా పరిణమిస్తాయి. ఎందుకంటే వారు అటువంటి స్థితిగతుల లో మనుగడ సాగించక తప్పని పరిస్థితి ఉంది. 5 ఏళ్ళ లోపు బాలలు అతిసారాని కి లోనవుతారు. మేము ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ ద్వారా ఈ అపాయాన్ని నిర్మూలించే బాధ్యత ను స్వీకరించాము. కిందటి ఏడాది వెలువడిన ఒక అంతర్జాతీయ నివేదిక ప్రకారం కేవలం స్వచ్ఛ భారత్ అభియాన్ సహాయం తో మరియు మరుగుదొడ్ల ఉపయోగం ద్వారా సుమారు 3 లక్షల మంది ప్రజల ప్రాణాల ను కాపాడవచ్చని అంచనా వేయడమైంది. పేద ప్రజల కు ఉచితం గా సరిక్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్న పరిశుభ్రత యొక్క శక్తి ఇది.
ఈసారి కుంభ్ పరిశుభ్రత కు మారుపేరు గా ఉంటుందని యోగి గారు నాతో చెప్తూ వచ్చారు. శతాబ్దాలు గా కుంభ్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. సమాజాని కి సందేశాన్ని పంపించేందుకు ఒక ప్రత్యేక సందర్భం గా దీని ని పరిగణించారు. ఈ సంవత్సరం కుంభ్ దేశాని కి ‘స్వచ్ఛత’ సందేశాన్ని ఇవ్వడం లో కృతార్థురాలు అయింది. కుంభ్ మేళా కు వచ్చే సరికి దేశం లోని మరియు ప్రపంచం లోని వార్తా పత్రికలు, సాధువులు మరియు నాగ సాధువు లను గురించి వివరాలు అందించడం సర్వ సాధారణం గా జరుగుతోంది. కాని, మొట్టమొదటి సారిగా న్యూయార్క్ టైమ్స్ కుంభ మేళా యొక్క పరిశుభ్రత గురించిన కథనాన్ని అందించింది.
అక్షయ పాత్ర ఫౌండేశన్ కూడా ‘శుభ్రమైన విద్యార్థులు, స్వచ్ఛమైన పాఠశాలలు మరియు పరిశుభ్రమైన ఇళ్ళు’ అంటూ ఒక ప్రచారాన్ని ఆరంభించినట్లు నాతో చెప్పారు. పాఠశాలల్లో పారిశుధ్యం పట్ల జాగృతి ని ఏర్పరచడానికే ఈ పని చేశారు. ఇటువంటి మరొక పవిత్రమైన కార్యాన్ని చేపట్టినందుకు మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఇదివరకు ఒక చిన్నారి ఆరోగ్యాన్ని గురించి, పోషణ ను గురించి పట్టించుకోవలసి వచ్చే సరికి, తల్లి యొక్క బాధ ను మరియు ఆమె సమస్య లను ఉపేక్షించే వారు.
వనరుల లేమి తో సతమతమవుతున్న ఒక పేద కుటుంబం లో, ఒక తల్లి నిరాదరణ కు గురి అయ్యే వారు. ఆవిడ తన కుటుంబం కోసమని పొగ తో పోరాటం చేసే వారు. ఈ పరిస్థితి ని మార్చేందుకు గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలం లో ప్రయత్నాలు జరిగాయి. ‘ఉజ్జ్వల యోజన’లో భాగం గా 6.25 కోట్ల కు పైగా గ్యాస్ కనెక్షన్ లను పేద సోదరీమణుల కు మరియు పుత్రికల కు అందించడం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఒక కోటి మంది సోదరీమణుల కు ఉచిత గ్యాస్ కనెక్షన్ లను కల్పించడమైంది. ఇది పొగ కారణం గా ఆరోగ్య సంబంధమైన సమస్య ల బారిన పడకుండా తల్లుల కు మరియు పిల్లల కు విముక్తి ని ప్రసాదించడంతో పాటు వంట చెరకు సేకరణ మరియు పిడకల తయారీ కి వెచ్చించవలసిన సమయాన్ని ఆదా చేసింది కూడాను.
మిత్రులారా,
దేశం యొక్క బాల్యాన్ని మరియు మన జీవితాల ను నిరంతరం గా పెంచి పోషిస్తున్న మరొక తల్లి ని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మరి ఆమె కు నేను గోకుల క్షేత్రం నుండి నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేయదలచుకున్నాను. ఈ తల్లి ఎవరంటే, మన గోమాత. పాల ను అందిస్తున్న ఈమె కు మన భారతీయులం అందరం రుణపడి పోయాము. తల్లి గోవు తన బాల గోపాలుడిని క్షీరం తోను, వెన్న తోను, ఇంకా పెరుగు తోను.. ఇలాగ సాధ్యమైన అన్ని విధాలు గాను పెంచి పెద్ద చేసింది.
మిత్రులారా,
గోవులు మన సంస్కృతిలో, సంప్రదాయం లో ఒక కీలక పాత్ర ను పోషిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో కూడా వాటి కి ఒక ప్రధాన భూమిక ఉంది. మధుర లో గో సేవ అనే ఒక సంపన్న సంప్రదాయం అంటూ ఉంది. ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొన్న సోదరి సుదేవీ దాసి గారి జీవనం మన విలువల యొక్క శక్తి ని చాటుతోంది.
మిత్రులారా,
ఈ గోకుల స్ఫూర్తి ని ముందుకు తీసుకు పోవడానికి మరియు పశుగణం యొక్క ఆరోగ్యాన్ని మెరుగు పరచడాని కి మా ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిశన్ ను ప్రారంభించింది. దీనిని విస్తరింప చేయడం కోసం రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ను ఏర్పాటు చేయాలని ఈ సంవత్సరపు బడ్జెటు లో ఒక నిర్ణయాన్ని తీసుకోవడమైంది. ఈ కమిశన్ లో భాగం గా గోమాతల కు మరియు తత్సంబంధిత నియమ నిబంధన ల కు 500 కోట్ల రూపాయల ను సర్దుబాటు చేయడమైంది.
మిత్రులారా,
పశువుల ను పెంచుతున్న కుటుంబాల కు తోడ్పడటానికి ప్రస్తుతం బ్యాంకుల తలుపులు తెరవబడ్డాయి. పంట రుణాల మాదిరిగా పశువుల కాపరులు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాల ను పొందగలుగుతారు. పశువుల పెంపకం లో నిమగ్నమై ఉన్న మన సోదరులు మరియు సోదరీమణుల కు ఇది సహాయకారి కానుంది. దేశం లోని పాడి పరిశ్రమ విస్తరించడం లోను ఈ చర్య దోహద పడనుంది. పాడి పరిశ్రమ వర్ధిల్లితే పశువుల సంరక్షకులు మరింత అధిక ఆదాయాన్ని పొంది, చక్కనైన జీవనోపాధి కి నోచుకోగలుగుతారు.
మిత్రులారా,
పశువుల పెంపకందారు లతో పాటు దేశాని కి ఆహార ధాన్యాల ను అందిస్తున్న మన రైతుల కోసం కూడా మా ప్రభుత్వం పథకాల ను రూపొందించింది. ఉత్తర్ ప్రదేశ్ పిఎం కిసాన్ యోజన నుండి అత్యంత లబ్ది ని పొందే రాష్ట్రం కానుంది.
ఇలా ఎందుకంటే ఇక్కడి రైతు లలో ఎక్కువ మంది ఒకటి లేదా రెండు ఎకరాలు లేదా అయిదు ఎకరాల లోపు భూమి ని కలిగి ఉన్నవారే. అటువంటి రైతు కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం వద్ద నుండి ఏటా 6,000 రూపాయల మొత్తాన్ని వారి యొక్క బ్యాంకు ఖాతాల లో నేరుగా అందుకోనున్నాయి. రైతు కుటుంబాలు ఒక్కొక్క విడత లో 2000 రూపాయల వంతు న 3 వాయిదా లను అందుకొంటాయి.
మిత్రులారా,
మన కర్షకులు రికార్డు స్థాయి లో దిగుబడి ని సాధిస్తున్నారు. మరి అంకిత భావం కలిగినటువంటి శ్రామికులైన వీరు చిన్నారుల కు ఆహారాన్ని అందించడం ద్వారా దేశ పునాది ని బలపరుస్తున్నారు.
మీ కృషి కి గాను మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నాలు ‘నేను’ నుండి ‘మనము’ కు పయనించేటట్లు చేస్తున్నాయి. ఇది ఒక వ్యక్తి నుండి సామాన్యుల కు చేరే ప్రయాణం. ‘నేను’ అనేది ‘మనము’ అయిందంటే సమాజాన్ని గురించి మనం ఆలోచించడం మొదలు పెట్టామన్న మాట. ‘నేను’ అనేది ‘మనము’ గా మారిందంటే ఆలోచన ల ప్రమాణం మరింత ఉన్నతం గా ఎదిగినట్లు. సమష్టి ఆలోచన అనేది ఒక వ్యక్తి యొక్క దేశాని కి, సంస్కృతి కి మరియు వారసత్వాని కి మరింత ప్రాముఖ్యాన్ని కట్టబెడుతుంది. సమష్టి తత్వం అనే భావన యుగాల నాటిది.
మిత్రులారా,
దేశం యొక్క ఈ విలువ లను న్యూ ఇండియా దృఢతరం చేస్తుంది. ప్రతి ఒక్కరి తోడ్పాటు తో మనలో ప్రతి ఒక్కరి కోసం.. సబ్కా సాథ్ సబ్కా వికాస్.. అనేది ఒక న్యూ ఇండియా కు బాట వేస్తుంది. మీ యొక్క ఘనమైన సేవల కు గాను మీకు నేను మరోసారి అభినందనలు తెలియ జేస్తున్నాను. సేవ చేయాలనే ఇటువంటి స్ఫూర్తి చెరిగిపోకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
అనేకానేక ధన్యవాదాలు.
आज थोड़ी देर बाद मुझे कुछ बच्चों को अपने हाथ से खाना परोसने का अवसर मिलने वाला है।
— PMO India (@PMOIndia) February 11, 2019
जितनी थालियां परोसी जाएंगी, उसमें से एक थाली 3 अरबवी है।
जैसा कि यहां बताया गया है कि 1500 बच्चों से ये अभियान शुरु हुआ था और आज 17 लाख बच्चों को पोषक आहार से जोड़ रहा है: PM
अब बदली परिस्थितियों में पोषकता के साथ, पर्याप्त और अच्छी गुणवत्ता वाला भोजन बच्चों को मिले, ये सुनिश्चित किया जा रहा है।
— PMO India (@PMOIndia) February 11, 2019
इस काम में अक्षय पात्र से जुड़े आप सभी लोग, खाना बनाने वालों से लेकर खाना पहुंचाने और
परोसने वाले तक के काम में जुटे सभी व्यक्ति देश की मदद कर रहे हैं: PM
यदि हम सिर्फ पोषण के अभियान को हर माता, हर शिशु तक पहुंचाने में सफल हुए तो अनेक जीवन बच जाएंगे।
— PMO India (@PMOIndia) February 11, 2019
इसी सोच के साथ हमारी सरकार ने पिछले वर्ष राजस्थान के झूंझनू से देशभर में राष्ट्रीय पोषण मिशन की शुरुआत की थी।
पिछले वर्ष सितंबर के महीने को पोषण के लिए ही समर्पित किया गया था: PM
मिशन इंद्रधनुष के तहत देश के हर बच्चे तक पहुंचने का लक्ष्य लिया गया।
— PMO India (@PMOIndia) February 11, 2019
अब तक इस मिशन के तहत देश में लगभग 3 करोड़ 40 लाख बच्चों और करीब 90 लाख गर्भवती महिलाओं का टीकाकरण करवाया जा चुका है।
जिस गति से काम हो रहा है, उससे तय है संपूर्ण टीकाकरण का लक्ष्य अब ज्यादा दूर नहीं है: PM
हमने टीकाकरण अभियान को तेज़ी तो दी ही है, टीकों की संख्या में भी बढ़ोतरी की है।
— PMO India (@PMOIndia) February 11, 2019
पहले के कार्यक्रम में 5 नए टीके जोड़े गए हैं, जिसमें से एक एनसेफलाइटिस यानि जापानी बुखार का भी है, जिसका सबसे ज्यादा खतरा उत्तर प्रदेश में देखा गया है।
अब कुल 12 टीके बच्चों को लगाए जा रहे हैं: PM
मिशन इंद्रधनुष को आज दुनियाभर में सराहा जा रहा है।
— PMO India (@PMOIndia) February 11, 2019
हाल में ही एक मशहूर मेडिकल जर्नल ने इस कार्यक्रम को दुनिया की 12 Best Practices में चुना है: PM
बच्चों के सुरक्षा कवच का एक और महत्वपूर्ण पहलू है स्वच्छता है।
— PMO India (@PMOIndia) February 11, 2019
स्वच्छ भारत अभियान के माध्यम से इस खतरे को दूर करने का बीड़ा हमने उठाया।
एक अंतर्राष्ट्रीय रिपोर्ट आई है, जिसमें संभावना जताई गई कि सिर्फ स्वच्छ भारत मिशन से,
करीब 3 लाख लोगों का जीवन बच सकता है: PM
ये प्रयास 'मैं से हम’ तक की यात्रा का सबसे अच्छा उदाहरण हैं,
— PMO India (@PMOIndia) February 11, 2019
‘मैं’ जब ‘हम’ बन जाता है तो हम खुद से ऊपर उठकर समाज के बारे में सोचते हैं,
मैं जब ‘हम’ बन जाता है तो सोच का दायरा बढ़ जाता है,
‘हम’ का विचार अपने देश को, अपनी संस्कृति को व्यक्ति से ज्यादा महत्वपूर्ण बनाता है: PM
Had the honour of serving food to children in Vrindavan today. pic.twitter.com/Fs7esScQZA
— Narendra Modi (@narendramodi) February 11, 2019
अक्षय पात्र फाउंडेशन के प्रयास, ‘मैं से हम’ तक की यात्रा का सबसे अच्छा उदाहरण है। pic.twitter.com/IkVVu0cFlX
— Narendra Modi (@narendramodi) February 11, 2019
3 billion meals is a remarkable feat!
— Narendra Modi (@narendramodi) February 11, 2019
Happy to have joined the programme organised by the Akshaya Patra Foundation and interact with these wonderful youngsters. pic.twitter.com/Elcy7pNBgB