Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల జాతీయ విధానం- 2019కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల దేశం గా భారతదేశాన్ని తీర్చి దిద్దడం లక్ష్యం గా సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల జాతీయ విధానం- 2019కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రధాన ప్రభావం

నవ్యత, మేధోసంపత్తి హక్కుల (ఐపి) ఆధారిత సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల తయారీ కి, విలువ ఆధారిత ఉత్పాదకత పెరగడానికి తద్వారా ఎగుమతుల రంగం ఆదాయాలు గణనీయం గా మెరుగుపడేందుకు, భారీ సంఖ్య లో ఉపాధి అవకాశాల కల్పన కు, వర్ధమాన సాంకేతికతల లో నవపారిశ్రామికత్వ అవకాశాలు పెరగడానికి, డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద అందుబాటు లో ఉన్న అవకాశాలు పూర్తి స్థాయి లో వినియోగించుకునేందుకు అనుకూలమైన వాతావరణం ఈ విధానం ద్వారా ఏర్పాటవుతుంది. ఫలితం గా సమ్మిళిత, సుస్థిర వృద్ధి కి ఊతం అందుతుంది.

దీనిలో మిళితమైన వ్యయం

ఈ విధానాని కి అనుగుణం గా వివిధ కార్యక్రమాల, వివిధ పథకాల అమలు కు రానున్న 7 సంవత్సరాల కాలంలో ప్రాథమికం గా 1,500 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని అంచనా. ఈ 1,500 కోట్ల రూపాయల మొత్తాన్ని సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల అభివృద్ధి నిధి (ఎస్ పిడిఎఫ్)గాను, పరిశోధన, ఇంకా ఇనవేశన్ నిధి గాను విభజించడం జరుగుతుంది.

అమలు వ్యూహం, లక్ష్యాలు

ఇందులో పొందుపరిచిన ప్రణాళికకు అనుబంధంగా సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల రంగం అభివృద్ధికి అవసరం అయిన పలు పథకాలు, కార్యక్రమాలు, చర్యల అమలుకు ఈ పథకం దోహదపడుతుంది.

ఎన్ పిఎస్ పి- 2019 విజన్ సాకారం కావడానికి ఈ విధానం లో ఐదు కార్యక్రమాలు ఉంటాయి:

1. 2025వ సంవత్సరానికల్లా ప్రపంచ సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల విపణి లో భారతదేశం వాటా పది రెట్లు పెరగడానికి అవసరం అయ్యే మేధోసంపత్తి (ఐపి) ఆధారితమైన, సుస్థిరమైన భారత సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల పరిశ్రమ రూపకల్పన ను ప్రోత్సహించడం

2. సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల పరిశ్రమ లో 10,000 టెక్నాలజీ స్టార్ట్- అప్ ల ఏర్పాటు ను ప్రోత్సహించడం. వీటిలో 1,000 టెక్నాలజీ స్టార్ట్- అప్ లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనే ఏర్పాటు కావడం ద్వారా 2025 నాటికి 35 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటు లోకి తీసుకురావడం

3. (i) 10 లక్షల మంది ఐటి వృత్తి నిపుణుల నైపుణ్యాల మెరుగుదల

(ii) లక్ష పాఠశాలల ను, కళాశాలల ను చైతన్యవంతం చేయడం

(iii) నాయకత్వ బాధ్యతలు చేపట్టగల 10 వేల మంది స్పెషలైజ్డ్ వృత్తి నిపుణులు అందుబాటులోకి తేవడం ద్వారా చక్కని ప్రతిభావంతుల సమూహాన్ని సాఫ్ట్ వేర్ పరిశ్రమ కు అందుబాటు లోకి తీసుకురావడం

4. దేశం లోని 20 రంగాల వారీ, వ్యూహాత్మక ప్రాధాన్యం గల ప్రదేశాల లో ఐసిటి మౌలిక వసతులు, మార్కెటింగ్, ఇంక్యుబేశన్, ఆర్ అండ్ డి/ టెస్ట్ బెడ్ సదుపాయాలు, మెంటారింగ్ మద్దతు గల కస్టర్ ఆధారిత నూతన ఆవిష్కరణల కు అనువైన వాతావరణం ఏర్పాటు

5. ఈ పథకం కింద చేపట్టే కార్యక్రమాలు, పథకాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమ భాగస్వామ్యం లో జాతీయ సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల మిశన్ ఏర్పాటు

పూర్వరంగం

భారత సాఫ్ట్ వేర్ పరిశ్రమ ప్రధానం గా సేవల ఆధారిత పరిశ్రమగానే ఉంది. అయితే టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులు, సేవల ద్వారా విలువ ఆధారిత గొలుసుకట్టును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ను ప్రభుత్వం గుర్తించింది. నూతన ఆవిష్కరణ లు, మెరుగైన వాణిజ్య దృక్పథం, స్థిరమైన మేధోసంపత్తి హక్కులు (ఐపి), ప్రత్యేక నైపుణ్యాల సమాహారం, టెక్నాలజీ స్టార్ట్- అప్ లతో కూడిన దేశం లో శక్తివంతమైన సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల వాతావరణం కల్పన వంటి చర్యల తో భారతదేశాన్ని ప్రపంచ సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల కేంద్రం గా రూపాంతరం చెందించడం ప్రధాన లక్ష్యం గా సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల జాతీయ విధానం-2019కి ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వం చేపట్టిన స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇంండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలన్నింటినీ దీనితో అనుసంధానం చేయడం కూడా ఈ విధానం లక్ష్యం. సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల పరిశ్రమ ను 2025వ సంవత్సరం కల్లా 35 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెచ్చే 70-80 బిలియన్ యుఎస్ డాలర్ పరిశ్రమ స్థాయి కి తీర్చి దిద్దడం కోసం ఈ కార్యక్రమాలు దోహదపడతాయి.