ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ దిగువ ప్రతిపాదనల కు ఆమోదం తెలిపింది.
ఎ. హరియాణా లోని రేవాడీ జిల్లా లో మనేథీ లో 1,299 కోట్ల రూపాయలపెట్టుబడి తో కొత్తగా అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎఐఐఎంఎస్.. ‘ఎయిమ్స్’) ఏర్పాటు మరియు
బి. ఈ ఎయిమ్స్ కోసం 2,25,000 రూపాయల మూల వేతనం (ఫిక్స్ డ్) ప్లస్ ఎన్ పిఎ (అయితే, వేతనం ఇంకా ఎన్ పిఎ 2,37,500 రూపాయలు మించని విధం గా) ఒక డైరెక్టర్ పదవి ని ఏర్పాటు చేయడం
ప్రధానాంశాలు :
• ఈ కొత్త ఎయిమ్స్ 100 యుజి (ఎంబిబిఎస్) సీట్ల తో పాటు 60 బిఎస్ సి (నర్సింగ్) సీట్ల ను అందుబాటు లోకి తెస్తుంది.
• కొత్త ఎయిమ్స్ లో 15-20 సూపర్ స్పెశాలిటీ శాఖలు ఉంటాయి.
• కొత్త ఎయిమ్స్ సుమారు 750 పడక లను అదనం గా చేర్చుతుంది.
• ప్రస్తుతం పని చేస్తున్న ఎయిమ్స్ వద్ద అందుబాటు లో ఉన్న గణాంకాల ప్రకారం దేశం లో ఏర్పాటయ్యే ప్రతి ఒక్క ఎయిమ్స్ నెల కు 1,500 మంది ఒపిడి రోగులు, వెయ్యి ఐపిడి రోగుల కు చికిత్స సదుపాయాల ను అందించగలుగుతుంది.
వివరాలు:
కొత్త ఎయిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల స్థూలం గా న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్, పిఎంఎస్ఎస్ వై కింద నిర్వహిస్తున్న మరో ఆరు కొత్త ఎయిమ్స్ తరహాలోనే ఒక ఆసుపత్రి; మెడికల్, నర్సింగ్ సిబ్బంది కి ఒక బోధన బ్లాక్; నివాస సముదాయం, అనుబంధ వసతులు/ సేవ లు అందుబాటు లోకి వస్తాయి. ప్రాథమిక స్థాయి లో నాణ్యమైన ఆరోగ్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్ విద్య, ప్రాంతీయ పరిశోధన వసతులు అందుబాటు లోకి తీసుకురావడం జాతీయ ప్రాధాన్యం గల కొత్త ఎయిమ్స్ తరహా విద్యాసంస్థల ఏర్పాటు ప్రధాన లక్ష్యం.
ఈ ప్రతిపాదిత సంస్థ లో ఏర్పాటయ్యే ఆస్పత్రి ఎమర్జెన్సీ బెడ్ లు, ట్రామా బెడ్ లు, ఆయుష్ బెడ్ లు, ప్రయివేటు బెడ్ లు, స్పెశాలిటీ ఐసియు బెడ్ లు, సూపర్ స్పెశాలిటీ బెడ్ లు.. మొత్తం 750 పడకలను కలిగివుంటుంది. వీటికి తోడు ఒక వైద్య కళాశాల, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, రాత్రి బస, అతిథి గృహం, వసతి గృహం, నివాస సదుపాయాలను కలిగి వుంటుంది. కొత్తగా ఏర్పాటైన ఆరు కొత్త ఎయిమ్స్ తరహా లోనే నిర్వహణ, నిరంతర పారిశుధ్యం కోసం ప్రత్యేక సామర్థ్యాలు ఉన్న కార్మిక శక్తి, పనివారు అందుబాటు లోకి తీసుకురాగలుగుతుంది. ఈ సంస్థ పై తదుపరి అయ్యే వ్యయాలన్నింటినీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధి లోని పిఎంఎస్ఎస్ వై ఖాతా కు కేటాయించే ప్రణాళికా బడ్జెటు నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపం లో మంజూరు చేస్తూ ఉంటారు.
ప్రయోజనాలు:
– కొత్త ఎయిమ్స్ ఏర్పాటు వల్ల ఆ ప్రాంతం లో ఆరోగ్య విద్య, శిక్షణ లో పరివర్తన రావడం తో పాటు ఆరోగ్య వృత్తి నిపుణుల కొరత కూడా తగ్గుతుంది.
– జనాభా కు సూపర్, స్పెశాలిటీ ఆరోగ్య సంరక్షణ ను అందించడం; జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్ హెచ్ ఎం) లో భాగం గా ప్రాథమిక, సెకండరీ స్థాయి లలో భారీ సంఖ్య లో వైద్యులను, ఆరోగ్య కార్యకర్త లను అందుబాటు లోకి తేవడానికి సహాయకారి అవుతుంది. కొత్త ఎయిమ్స్ నిర్మాణాని కి కేంద్రప్రభుత్వమే పూర్తి గా నిధులు అందిస్తుంది. అలాగే నిర్వహణ, మెయింటెనెన్స్ వ్యయాలు కూడా పూర్తి గా కేంద్రమే భరిస్తుంది.
ఉపాధి కల్పన:
ప్రతి ఒక్క కొత్త ఎయిమ్స్ ఏర్పాటు వల్ల బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది అవసరాల కోసం 3,000 ఉపాధి అవకాశాలు అందుబాటు లోకి వస్తాయి. ప్రతి ఒక్క ఎయిమ్స్ పరిధి లోను వివిధ అనుబంధ వసతులు, శాపింగ్ సెంటర్, క్యాంటీన్ లు వంటి సేవా వసతుల ఏర్పాటు ద్వారా ఎంతో మంది కి పరోక్ష ఉపాధి కలుగుతుంది. అలాగే భౌతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యకలాపాల ద్వారా ప్రతి ఒక్క ఎయిమ్స్ నిర్మాణం సమయంలో ఎంతో ఉపాధి అందుబాటు లోకి వస్తుంది.
పూర్వరంగం
దేశం లోని వివిధ ప్రాంతాల లో తక్కువ ఖర్చు లో తృతీయ దశ ఆరోగ్య సంరక్షణ సదుపాయాల లభ్యత తాలూకు అసమానతలను సరిచేయడం; మరీముఖ్యంగా అరకొర వసతులు మాత్రమే ఉన్న రాష్ట్రాల లో నాణ్యమైన వైద్య విద్య వసతుల ను పెంచడంపై కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోని ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎంఎస్ఎస్ వై) శ్రద్ధ తీసుకొంటుంది. హరియాణా లో ఎయిమ్స్ ను ఏర్పాటు చేయగలమని ఆర్థిక మంత్రి తన 2019-20 తాత్కాలిక బడ్జెటు ప్రసంగం లో ప్రకటించారు. ఎయిమ్స్ యొక్క నిర్మాణం మరియు నిర్వహణ ల వ్యయాన్ని పిఎంఎస్ఎస్ వై ద్వారా భరించడం జరుగుతుంది.