ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం (ఎ) మార్కుల నమోదు కై ఉద్దేశించిన వస్తువులు మరియు సేవల అంతర్జాతీయ వర్గీకరణ తాలూకు నైస్ ఒప్పందం లో, (బి) ఫిగరెటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ మార్క్స్ యొక్క అంతర్జాతీయ వర్గీకరణ ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన వియన్నా ఒప్పందం లో మరియు (సి) పారిశ్రామిక డిజైన్ ల అంతర్జాతీయ వర్గీకరణ ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించినటువంటి లోకార్నో ఒప్పందం లో భారతదేశం ప్రవేశించాలన్న ప్రతిపాదన కు ఆమోదం తెలిపింది.
నైస్, వియన్నా మరియు లోకార్నో ఒప్పందాల లో భారతదేశం చేరడం ట్రేడ్ మార్క్ మరియు డిజైన్ అప్లికేశన్స్ పరీక్ష నిమిత్తం వర్గీకరణ వ్యవస్థల ను- ప్రపంచవ్యాప్తం గా అనుసరించే వర్గీకరణ వ్యవస్థ లకు అనుగుణం గా- రూపు దిద్దేందుకు భారతదేశం లోని ఇంటెలెక్చువల్ ప్రోపర్టి ఆఫీసు కు సహాయకారి కాగలదు.
ఇది భారతీయ డిజైన్ లు, ఫిగరెటివ్ ఎలిమెంట్స్ మరియు వస్తువుల ను అంతర్జాతీయ వర్గీకరణ వ్యవస్థ లలో చేర్చేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదిస్తుంది.
ఈ ప్రవేశం భారతదేశం లో ఐపి ల సంరక్షణ కు సంబంధించి విదేశీ పెట్టుబడిదారుల లో విశ్వాసాన్ని పాదుగొల్పుతుందని ఆశించడమైంది.
ఈ ప్రవేశం ఒప్పందం లో భాగం గా వర్గీకరణ ల సమీక్ష కు మరియు సవరణ కు సంబంధించి నిర్ణయాలు చేజే ప్రక్రియల లో హక్కుల ను వినియోగించుకొనేందుకు కూడా మార్గాన్ని సుగమం చేయనుంది.