ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ‘నారీ శక్తి’ పురస్కారాల స్వీకర్త లతో భేటీ అయ్యి వారి తో సంభాషించారు.
కార్యసాధన పట్ల అవార్డు విజేతలకు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. వారి కృషి ఇతరుల కు ప్రేరణ ను అందిస్తుందని ఆయన అన్నారు. వారి వారి రంగాల లో మరింత ముందుకు పయనించవలసిందిగా వారికి ఆయన ఉద్బోధించారు.
స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ ఉద్యమ విజయం లో చాలా వరకు దీనికి ప్రాముఖ్యం ఇచ్చింది మహిళలే అన్నటువంటి వాస్తవాని కి ఆపాదించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే ప్రయాగ్‌రాజ్ లో ముగిసిన కుంభ్ మేళా ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈసారి ఇది ఒక చర్చాంశం గా మారిందని, దీనికి కారణం స్వచ్ఛత మరియు పరిశుభ్రత ల విషయం లో పాటించిన ఉన్నత ప్రమాణాలే అన్నారు. స్వచ్ఛత ప్రస్తుతం ఒక ప్రజా ఉద్యమం గా రూపుదాల్చిందని ఆయన పేర్కొన్నారు.
వ్యర్ధాలను సంపద గా మార్చడమే స్వచ్ఛత తాలూకు ఉద్యమం లో తదుపరి అడుగు కావాలని ప్రధాన మంత్రి అన్నారు.
పోషకాహార లోపం సమస్య ను పరిష్కరించడం మరియు మిశన్ ఇంద్రధనుష్ ద్వారా బాలల కు టీకా మందు ఇప్పించడం వంటి అంశాల ను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ రెండు రంగాల లో సాఫల్య సాధన లో మహిళలు ఒక కీలకమైనటువంటి భూమిక ను పోషించవలసి ఉన్నదని ఆయన చెప్పారు.
మహిళలు మరియు బాలల వికాసం శాఖ మంత్రి శ్రీమతి మేనకా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Had a wonderful interaction with recipients of the Nari Shakti Puraskar. https://t.co/3twrQqJFDg
— Narendra Modi (@narendramodi) March 9, 2019
via NaMo App