పౌర సంబంధ మరియు వాణిజ్య వ్యవహారాల లో పరస్పర న్యాయ సహాయానికి (ఎంఎల్ఎటి) సంబంధించి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కు మరియు రిపబ్లిక్ ఆఫ్ బెలారూస్ కు మధ్య ఒప్పందాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందం అమలు లోకి వచ్చిన వెంటనే ఒప్పందాన్ని కుదుర్చుకొనే పక్షాల మధ్య పౌర సంబంధ మరియు వాణిజ్య వ్యవహారాల లో పరస్పర న్యాయ సహాయం పెంపొందనుంది.
పౌర సంబంధ మరియు వాణిజ్య వ్యవహారాల లో న్యాయపరమైన సలహా ను కోరే పక్షాల యొక్క పౌరుల కు మహిళ లు మరియు పురుషుల అనే భేదభావాలు, సముదాయం, ఇంకా ఆదాయం వంటి అంశాల లో భేద భావాలకు తావు లేకుండా ప్రయోజనాన్ని చేకూర్చడం దీని ఉద్దేశ్యం గా ఉంది.