Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి భార‌తీయ జ‌న్ ఔష‌ధీ ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

ప్ర‌ధాన మంత్రి భార‌తీయ జ‌న్ ఔష‌ధీ ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌

ప్ర‌ధాన మంత్రి భార‌తీయ జ‌న్ ఔష‌ధీ ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల తో ప్ర‌ధాన మంత్రి సంభాష‌ణ‌


ప్ర‌ధాన మంత్రి భార‌తీయ జ‌న్ ఔష‌ధీ ప‌రియోజ‌న ల‌బ్ధిదారుల తో, జ‌న్ ఔష‌ధీ కేంద్రాల కొట్టు సొంతదారుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించారు. జెన‌రిక్ మందుల వినియోగాని కి ఊతాన్ని అందించ‌డానికి మ‌రియు ఆ ఔష‌ధాల ప‌ట్ల చైత‌న్యాన్ని ఏర్ప‌ర‌చడానికి 2019వ సంవ‌త్స‌రం మార్చి నెల 7వ తేదీ ని దేశ‌ం అంతటా ‘జ‌న్ ఔష‌ధీ దివ‌స్‌’గా జ‌రపాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ల‌బ్ధిదారుల తో, కొట్టు సొంతదారుల తో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ అధిక నాణ్య‌త క‌లిగిన మందులు త‌క్కువ ధ‌ర‌ల లో అందేటట్టు చూడటం కోసం ప్ర‌భుత్వం రెండు ప్ర‌ధాన‌మైన చ‌ర్య‌లను చేప‌ట్టింద‌ని చెప్పారు. వాటిలో ఒక‌టో చర్య 850 అత్య‌వ‌స‌ర మందుల ధ‌ర‌ల ను నియంత్రించ‌డం తో పాటు హార్ట్ స్టెంటుల ధ‌ర‌ల ను, అలాగే మోకాలి శ‌స్త్ర చికిత్స కు ఉప‌యోగించే ప‌రికరాల ధ‌ర‌ల‌ ను త‌గ్గించ‌డం. రెండో చ‌ర్య దేశ‌ వ్యాప్తం గా జ‌న్ ఔష‌ధీ కేంద్రాల ను నెల‌కొల్పడం అని ఆయ‌న వివ‌రించారు. ఈ చ‌ర్య‌లు ఒక్క పేద‌ల‌కే కాక మ‌ధ్య‌ త‌ర‌గ‌తి కి కూడా ఎంతో లబ్ధి ని చేకూర్చాయని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

మందులు వాటి యొక్క విప‌ణి ధ‌ర‌ల క‌న్నా 50 నుండి 90 శాతం త‌క్కువ ధ‌ర‌ల లో జ‌న్ ఔష‌ధీ కేంద్రాల లో దొరుకుతున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. గ‌డ‌చిన నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల కాలం లో అయిదు వేల కు పైగా జ‌న్ ఔష‌ధీ కేంద్రాల ను ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కేంద్రాలు కేవలం మంచి నాణ్య‌త క‌లిగిన మందుల ను స‌మ‌కూర్చ‌డమే కాకుండా స్వ‌తంత్రోపాధి ని మరియు నూత‌న ఉద్యోగ అవ‌కాశాల ను కూడా క‌ల్పించాయ‌ని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు.

ఆరోగ్య రంగం లో సంపూర్ణ మార్పు కు సంబంధించిన దార్శ‌నిక‌త ను గురించి ప్ర‌ధాన మంత్రి వివరిస్తూ, ‘అడ్డుగోడ‌లు వద్దు- ప‌రిష్కారాలు కావాలి’ అనే వైఖ‌రి ప్ర‌భుత్వానిది అని వివ‌రించారు. ఆరోగ్య రంగం లో ప‌రివ‌ర్త‌న‌ ను తీసుకురావ‌డం కోసం ఈ రంగాని కి సంబంధించిన అన్ని వ‌ర్గాలు ప్ర‌స్తుతం క‌ల‌సి ప‌ని చేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. గ‌త నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల లో 15 కొత్త ఎఐఐఎమ్ఎస్ ల‌ను అయితే నిర్మించ‌డ‌మో, లేదా నిర్మిస్తూ ఉండ‌ట‌మో జ‌రిగింద‌ని, అలాగే ఎంబిబిఎస్, ఇంకా పోస్ట్‌-గ్రాడ్యుయేష‌న్ సీట్ల ను 31,000 సంఖ్య లో పెంచ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

ప్ర‌ధాన మంత్రి తో ల‌బ్ధిదారులు మాట్లాడుతూ, జ‌న్ ఔష‌ధీ కేంద్రాల లో మంచి నాణ్య‌త తో ఉన్న మందులు ల‌భ్య‌మ‌వుతున్నట్లు చెప్తూ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. త‌క్కువ ధ‌ర క‌లిగిన ఈ మందులతో తాము స‌రియైన వైద్య చికిత్స ను పొందుతూనే డ‌బ్బు ను కూడా ఆదా చేసుకొనేటట్టు చేశాయని వారు ప్ర‌స్తావించారు.

**