Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ యోగి మాన్‌-ధ‌న్ (పిఎం-ఎస్‌వైఎమ్‌) యోజ‌న ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ యోగి మాన్‌-ధ‌న్ (పిఎం-ఎస్‌వైఎమ్‌) యోజ‌న ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ యోగి మాన్‌-ధ‌న్ (పిఎం-ఎస్‌వైఎమ్‌) యోజ‌న ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ యోగి మాన్‌-ధ‌న్ (పిఎం-ఎస్‌వైఎమ్‌) యోజ‌న ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్ర‌మ యోగి మాన్‌-ధ‌న్ (పిఎం-ఎస్‌వైఎమ్‌) యోజ‌న ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు గుజ‌రాత్ లోని వ‌స్త్రల్ లో ప్రారంభించారు. ఎంపిక చేసిన కొంత మంది ల‌బ్దిదారుల కు పిఎం-ఎస్‌వైఎమ్ పెన్శ‌న్ కార్డుల ను కూడా ఆయ‌న ప్ర‌దానం చేశారు. దేశ వ్యాప్తం గా మూడు ల‌క్ష‌ల కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల నుండి రెండు కోట్ల కు పైగా శ్రామికులు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ ప్రారంభ కార్య‌క్ర‌మాన్ని చూశారు.

దీని ని ఒక చ‌రిత్రాత్మ‌క దినం గా ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణిస్తూ, దేశం లోని 42 కోట్ల మంది అసంఘ‌టిత రంగ శ్రామికుల కు పిఎం-ఎస్‌వైఎమ్ యోజ‌న ను అంకితం చేశారు. ఈ ప‌థ‌కం లో న‌మోదైన అసంఘ‌టిత రంగ శ్రామికుల‌ కు వారి వృద్ధాప్యం లో 3,000 రూపాయ‌ల నెల‌వారీ పెన్శ‌న్ యొక్క ప్రయోజనం అందుతుంద‌ని ఆయ‌న చెప్పారు. లాంఛ‌నప్రాయం కాని రంగం లో ప‌ని చేస్తున్న కోట్లాది శ్రామికుల కోసం ఇటువంటి ఒక ప‌థ‌కాన్ని క‌ల్పించ‌డం స్వాతంత్య్రం వ‌చ్చాక ఇది మొద‌టి సారి అని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

పిఎం-ఎస్‌వైఎమ్ యొక్క ప్ర‌యోజ‌నాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి అన్ని వివ‌రాలను తెలియజేశారు. ల‌బ్ధిదారు ఇచ్చే చందా కు సరిస‌మాన‌ మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వం జోడించగలదని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్క నెల కు 15,000 రూపాయ‌ల లోపు ఆదాయాన్ని సంపాదించుకొనే లాంఛ‌నప్రాయం కాని రంగం యొక్క శ్రామికులు స‌మీపం లోని కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ లలో ల‌బ్ధిదారులు గా వారి పేర్ల‌ ను న‌మోదు చేసుకోవచ్చని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

న‌మోదు ప్ర‌క్రియ లో ఎటువంటి ఇబ్బందులు ఉండ‌బోవ‌ని శ్రీ మోదీ హామీ ఇస్తూ, ఒక ప‌త్రం లో బ్యాంకు వివ‌రాల ను మ‌రియు ఆధార్ సంఖ్య ను వ్రాసి ఇస్తే స‌రిపోతుంద‌ని స‌భికుల‌ కు చెప్పారు. ఒక ల‌బ్ధిదారు పేరు ను న‌మోదు చేసేందుకు కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ కు అయ్యే ఖ‌ర్చు ను కేంద్ర ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌న్నారు. ‘‘ఇది డిజిట‌ల్ ఇండియా యొక్క అద్భుత‌ం’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

సమీప ప్రాంతం లో ఉండే అసంఘ‌టిత రంగ శ్రామికుల ను పిఎం-ఎస్‌వైఎమ్ లో చేర్చేందుకు స‌హాయాన్ని అందించవలసిందంటూ వారి యొక్క ఇరుగు పొరుగు ఇళ్ళ లో ఉండేటటువంటి పౌరుల‌ కు ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఉన్నతాదాయ వర్గాల వారు నడుం కట్టే ఇటువంటి ప‌నుల వల్ల పేద‌ల కు ఎంతో ల‌బ్ది చేకూరుతుందని ఆయ‌న అన్నారు. శ్రామికులను సమ్మానించుకోవ‌డం ద్వారా దేశం ముందంజ వేస్తుందని ఆయ‌న చెప్పారు.

ఆయుష్మాన్ భార‌త్, ప్ర‌ధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌, ఉజ్జ్వ‌ల యోజ‌న‌, సౌభాగ్య యోజ‌న‌, ఇంకా స్వ‌చ్ఛ్ భార‌త్ ల వంటి కేంద్ర ప్ర‌భుత్వం ఆరంభించిన వివిధ ప‌థ‌కాలు, ప్ర‌త్యేకించి అసంఘ‌టిత రంగం లో ప‌ని చేస్తున్న వారి ని దృష్టి లో పెట్టుకొని రూపొందించినవి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. దేశం లో మ‌హిళ‌ల మ‌రియు బాలిక‌ల సాధికారిత కోసం ప్ర‌భుత్వం చేపట్టిన అనేక కార్య‌క్ర‌మాల‌ ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు.

అసంఘ‌టిత రంగం లోని శ్రామికుల కు వారి వృద్ధాప్యం లో స‌మ‌గ్ర‌ సామాజిక భ‌ద్ర‌త క‌వ‌చాన్ని అందించేందుకు అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. వాటిలో ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం ‘ఆయుష్మాన్ భార‌త్’, జీవ‌న ర‌క్ష‌ణ మ‌రియు అంగ‌వైక‌ల్య ర‌క్ష‌ణల కోసం ‘ప్ర‌ధాన మంత్రి జీవ‌న‌ జ్యోతి బీమా యోజ‌న‌’, ఇంకా ‘ప్ర‌ధాన‌ మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న’ ఉన్నాయని వెల్లడించారు.

అవినీతి పై తాను అనుస‌రిస్తున్న దృఢ వైఖ‌రి ని ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటిస్తూ, దళారుల ను మ‌రియు అవినీతి ని నిర్మూలించ‌డం కోసం త‌న ప్ర‌భుత్వం దీక్షాబ‌ద్ధురాలైంద‌న్నారు. ప్ర‌ధాన మంత్రి స‌దా అప్ర‌మ‌త్తం గా ఉంటార‌ని ఆయ‌న చెప్పారు.

**