Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ సదస్సులో ప్రసంగించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై చైతన్యం విస్తరించేలా ఇంఢియా టుడే సంస్థ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.

ప్రధానమంత్రిగా ఇప్పటివరకూ సాగిన తన ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- జాతీయ స్థాయిలో తన అనుభవ లేమి తనకొక అనూహ్య వరంగా పరిణమించిందని అభివర్ణించారు. విదేశీ విధాన నిర్వహణపై ఆందోళనలను ఉదాహరిస్తూ- దీనికి సంబంధించిన సందేహాలకు కొద్దిరోజులుగా చోటుచేసుకున్న సంఘటనలు స్వస్తిపలికి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నేటి మన దేశం నవ్యభారతమేగాక విభిన్న భారతదేశమని ప్రధాని అన్నారు. ప్రతి సైనికుడి ప్రాణం అమూల్యమైనదని, భారతదేశాన్ని ఏ శక్తీ గందరగోళ పరచలేదని స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రతి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు.

భారతదేశంలో ఇవాళ కనిపిస్తున్న ఐకమత్యాన్ని చూసి, దేశంలోపలి, వెలుపలి జాతి వ్యతిరేక శక్తులు కొన్ని

భయపడుతున్నాయని, ఇలాంటి భయం ఉండటం వాస్తవానికి మంచిదేనని ఆయన పేర్కొన్నారు. భారత పరాక్రమం చూశాక శత్రువులు, చట్టాలను చూసి అవినీతిపరులు వణుకుతుండగా, ఇటువంటి భయం ఉండటం చాలా మంచిదన్నారు. తన వనరులు, సామర్థ్యాలపై సడలని విశ్వాసంతో భారత్ వడివడిగా ముందుకు సాగుతున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్దేశాలపైన, సైనిక బలగాల విశ్వసనీయత మీద సందేహాలు వెలిబుచ్చుతున్నవారి వైఖరేమిటో స్పష్టం చేయాలని నిలదీశారు. నరేంద్ర మోదీపై వ్యతిరేకత పేరిట భారతదేశాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారని, ఇది దేశానికి హానికరమని హెచ్చరించారు. భారత సైనిక బలగాలపై సందేహాలు వ్యక్తంచేసే అటువంటి వ్యక్తులు ఉగ్రవాదాన్ని ఎగదోసేవారిని విశ్వసిస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి భారతదేశానికి రఫేల్ యుద్ధ విమానం లేనిలోటు ఇటీవల స్పష్టమైందని, దీనిపై ఇప్పుడు రాజకీయ క్రీడ సాగుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. జాతీయ భద్రతను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తున్నవారిని ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా విమర్శించారు.

అనేక సంవత్సరాలపాటు దేశాన్నేలినవారికిఒప్పందాలు, పంపకాలనే రెండు ప్రయోజనాలూ కీలకమని ఎద్దేవా చేశారు. ఈ విధానంవల్ల అత్యంత కష్టనష్టాలకు గురైంది సైనికులు, రైతులేనని పేర్కొన్నారు. కొందరు ఒప్పందాలకే ప్రాధాన్యం ఇవ్వడంవల్ల రక్షణ రంగానికి నష్టం వాటిల్లితే, పంపకాలకు స్థానంలేని సుస్థిర విధానం లేని కారణంగా వ్యవసాయరంగం నష్టపోయిందని వివరించారు. రాజకీయవర్గాలు ఇలాంటి పంపకాలకు పాల్పడిన ఫలితంగా పేదలంతా పేదలుగానే మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అతిపెద్ద ఉదాహరణ పంటరుణాల మాఫీయేనని ఆయన వివరించారు. అయితే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతు సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర పథకమని, రైతుకు సాధికారత కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విభిన్న విధానంలో ఇదొక భాగమని ఆయన విశదీకరించారు. దీనిపై ప్రకటన వెలువడిన కేవలం 24 రోజుల్లోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు.

పరిపాలనకు సంబంధించి 55 నెలల తమ ప్రభుత్వం, 55 ఏళ్ల ఇతరుల పాలన కాలపు విధానాల్లో ఏనుగుకు-దోమకు ఉన్నంత తేడా ఉందని ప్రధాని వివరించారు. వారి విధానం ‘లాంఛనప్రాయం’ కాగా, తమది ‘సంపూర్ణ’ విధానమని ప్రకటించారు. ఈ సందర్భంగా తాము తీసుకున్న వినూత్న చర్యలను వివరిస్తూ సాయుధ బలగాలకు ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్, పేదలకు ఆర్థిక సార్వజనీనత, పరిశుభ్ర వంట ఇంధనం (ఉజ్వల యోజన), అందరికీ విద్యుత్, అందరికీ ఇళ్లు’పథకాలను ప్రస్తావించారు. అదే సమయంలో భారతదేశం ఇప్పటిదాకా బహిరంగ విసర్జనరహితం ఎందుకు కాలేదని ప్రశ్నించారు. యుద్ధవీరుల లేదా పోలీసు అమరుల స్మారకాలను దశాబ్దాలుగా ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. దేశంలో పేదరికాన్ని అనూహ్య వేగంతో నిర్మూలిస్తున్నామని, ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదేనని వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన ఎంత వేగంగా సాగుతున్నదీ ప్రధాని వెల్లడించారు. అలాగే చట్టాలను రూపొందించడం మాత్రమేగాక వాటికి చర్యలను జోడించడంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దేశంలో అందరికీ 2014-2019మధ్య ప్రాథమిక అవసరాలు తీర్చాల్సిన కాలం కాగా, 2019 నుంచి ప్రజాకాంక్షలు నెరవేర్చే, కొత్త శిఖరాలకు చేర్చే ప్రగతి సాధన కాలం కాగలదని ప్రధానమంత్రి అన్నారు.

*****