మాన్య శ్రీ రాష్ట్రపతి, మాన్య శ్రీ ఉప రాష్ట్రపతి, స్పీకర్ మేడమ్, గులాం నబీ గారు, నరేంద్ర సింహ్ గారు, అటల్ గారి కుటుంబ సభ్యులు, ఇంకా అటల్ గారి అభిమానులారా,
అటల్ గారు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ విధమైన కొత్త రూపం లో మనందరినీ ఆశీర్వదిస్తూ, మనకు ప్రేరణ ను అందిస్తూనే ఉంటారు. అటల్ గారి జీవితం లోని అనేకమైన వివిధ అంశాల ను ప్రత్యేకత లు గా ఎవరైనా ఉదాహరించవచ్చును. ఇలాగ మనం గంటల తరబడి చెప్పుకొంటూండిపోవచ్చును. అయినప్పటికీ కూడాను, ఆ సమున్నతమైన మూర్తిమత్వాన్ని వర్ణించడాని కి మాటలు మాత్రమే చాలవు. ఆయన ను పోలిన మూర్తిమత్వాలు చాలా అరుదు గానే ఉన్నాయి. పార్లమెంటు లో సంవత్సరాల తరబడి కాలాన్ని గడిపిన అనంతరం, కొన్ని దశాబ్దుల పాటు అధికారాని కి ఆయన దూరం గా ఉండి పోయారు; అయినప్పటికీ సామాన్య మానవుడి కి చిత్తశుద్ధి తో సేవ చేయసాగారు.. సామాన్యుడి గళాన్ని ఎలుగెత్తి వినిపిస్తూపోయారు. స్వీయ లాభాల కోసం తన పంథా నుండి ఎన్నటికీ వైదొలగిందే లేదు. ఆయన జీవితాన్ని చూసి ప్రజా సేవకులం మనమందరం నేర్చుకొని తీరవలసింది ఏదైనా ఉందీ అంటే, అది ఇదే.
రాజకీయాల లో మెట్ట పల్లాలు, జయాపజయాలు ఉండనే ఉంటాయి. అయితే, అటల్ గారి జీవితం లో మనం చూసింది ఏమిటంటే, మనం మన యొక్క లక్ష్యాల దిశ గా పయనించడం లో మన యొక్క ఆదర్శాల ను మరియు సిద్ధాంతాల ను వదులుకోకుండా ఉన్న పక్షం లో సకారాత్మక ఫలితాల ను మనం తప్పక పొందుతామన్నదే. ఆయన ప్రసంగాలు అత్యంత ప్రభావశీలమైనటువంటివి. మరి చాలా మంది ఆ ప్రసంగాల ను గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఏమైనా, భవిష్యత్తు లో మనస్సంబంధమైనటువంటి పరిశోధన ను చేపట్టి, లోతైన విశ్లేషణ ను చేసినట్లయితే ఆయన ఉపన్యాసాని కన్నా ఆయన మౌనాని కి ఎన్నో రెట్లు గొప్పదైన శక్తి ఉందన్న విషయం బహుశా వెల్లడి కావచ్చు. ఒక జన సభ లో కొన్ని మాటలు ఆడిన తరువాత ఆయన మౌనం గా ఉండిపోయినప్పుడల్లా, లక్షలాది జన సమూహం లోని ఆఖరు వ్యక్తి సైతం ఆయన మౌనం అందించేటటువంటి సందేశాన్ని గ్రహించ గలిగే వారు. ఆయన లో అబ్బురపరచేటటువంటి వాగ్ధాటి ఉండేది. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు ఆగాలి అనేది ఆయన కు తెలుసును. ఆయన తనదైన లోకం లో ఉండిపోయేవారు. ఆయన తో కలసి ప్రయాణించే అవకాశం మనకు దొరికివుంటే గనక, ఆయన చాలా వరకు తన కనుల ను మూసుకొని ఉండటాన్ని మనం గమనించే వారం. ఆయన ఎన్నడూ ఎక్కువగా మాట్లాడే వారు కాదు. చర్చోపచర్చలు చేయడం, చక్కని వాదన ను వినిపించడం ఆయన ప్రత్యేకత. ఏమైనప్పటికీ, పార్టీ సమావేశాల లో తతంగం వేడెక్కినప్పుడల్లా ఆయన పలికే చిన్న చిన్న మాటలే పరిస్థితి ని తేలిక పరచేవి. ఆయన స్థితిగతుల ను బేరీజు వేసి, చేజారిన పరిస్థితి ని అదుపు చేసే వారు. అటువంటి వ్యక్తిత్వం ప్రజాస్వామ్యాని కి శక్తి ని ఇస్తుంది. ప్రజాస్వామ్యం లో శత్రువులంటూ లేరు. ప్రజాస్వామ్యం లో ఉన్నదల్లా స్పర్ధ, ఇంకా విపక్షం మాత్రమే. గౌరవాదరణ ల స్ఫూర్తి ని కాపాడటం మన నవ తరం నేర్చుకొని తీరవలసినటువంటి విషయం. ఒక వ్యక్తి వద్ద నుండి పదునైన విమర్శ, ఇంకా పోటీ ఎదురైనప్పటి కీ కూడా ఆ వ్యక్తి పట్ల ఆదర భావం తో ఎలా మెలగాలో అటల్ గారి దగ్గర నుండే మనం నేర్చుకుని తీరాలి.
ఈ రోజు న ఈ సందర్భం అటల్ గారి కి నివాళి ని అర్పించవలసిన అవకాశాన్ని ప్రసాదించింది. నేను నా పక్షాన, మరి అలాగే సభ లోని నా యొక్క సహచరులందరి పక్షాన గౌరవనీయులు అటల్ గారి కి శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను.
***
Now on, Atal Ji will be forever in the Parliament's Central Hall, inspiring us and blessing us.
— PMO India (@PMOIndia) February 12, 2019
If we start talking about the goodness of Atal Ji, it will take hours and hours: PM @narendramodi speaking at the programme marking the unveiling of Atal Ji's portrait at Central Hall
Atal Ji had a long political career, a large part of that career was spent in Opposition.
— PMO India (@PMOIndia) February 12, 2019
Yet, he continued raising issues of public interest and never ever deviated from his ideology: PM @narendramodi
There was power in Atal Ji's speech and there was equal power in Atal Ji's silence.
— PMO India (@PMOIndia) February 12, 2019
His communication skills were unparalleled. He had a great sense of humour: PM @narendramodi