Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బిహార్ లో 33,000 కోట్ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; అభివృద్ధి పై శ్రద్ధ వహిస్తామని మరియు బిహార్ కు, ఇంకా భార‌త‌దేశ తూర్పు ప్రాంతాల కు పెద్ద పీట వేస్తామ‌ని స్పష్టీకరణ

బిహార్ లో 33,000 కోట్ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి;  అభివృద్ధి పై శ్రద్ధ వహిస్తామని మరియు బిహార్ కు, ఇంకా భార‌త‌దేశ తూర్పు ప్రాంతాల కు పెద్ద పీట వేస్తామ‌ని స్పష్టీకరణ

బిహార్ లో 33,000 కోట్ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి;  అభివృద్ధి పై శ్రద్ధ వహిస్తామని మరియు బిహార్ కు, ఇంకా భార‌త‌దేశ తూర్పు ప్రాంతాల కు పెద్ద పీట వేస్తామ‌ని స్పష్టీకరణ

బిహార్ లో 33,000 కోట్ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి;  అభివృద్ధి పై శ్రద్ధ వహిస్తామని మరియు బిహార్ కు, ఇంకా భార‌త‌దేశ తూర్పు ప్రాంతాల కు పెద్ద పీట వేస్తామ‌ని స్పష్టీకరణ


13,365 కోట్ల రూపాయ‌ల తో నిర్మించే ప‌ట్ నా మెట్రో రైల్ ప్రోజెక్టు కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

ప‌ట్ నా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ ప్రోజెక్టు ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

మొదలైన బ‌రౌనీ శుద్ధి క‌ర్మాగారం విస్త‌ర‌ణ ప‌నులు

ఛప్ రా లో, పూర్ణియా లో వైద్య క‌ళాశాల ల‌కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

బిహార్ లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ కు, సంధానాని కి, శ‌క్తి రంగ భ‌ద్ర‌త‌ కు మ‌రియు ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల కు ఊతాన్ని ఇచ్చే విధంగా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు బరౌనీ లో 33,000 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాల ను ప్రారంభించారు.  ఈ కార్య‌క్ర‌మాని కి బిహార్‌ గ‌వ‌ర్న‌ర్ శ్రీ లాల్‌జీ టండ‌న్‌, బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్, బిహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సుశీల్ మోదీ, ఆహారం మరియు వినియోగదారు వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాం విలాస్ పాస్‌వాన్ ల‌తో పాటు ప‌లువురు ఇత‌ర ఉన్న‌తాధికారులు కూడా హాజ‌రయ్యారు.  ప‌థ‌కాల ను ప్రారంభించిన అనంత‌రం జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు.  

ప్ర‌ధాన మంత్రి ఒక మీట‌ ను నొక్కి 13,365 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యం తో నిర్మాణం కానున్న పట్ నా మెట్రో రైల్ ప‌థ‌కాని కి డిజిటల్ పద్ధతి న శంకుస్థాప‌న చేశారు.  ఈ ప‌థ‌కం లో రెండు కారిడార్లు – దానాపుర్ నుండి మీఠాపుర్ మ‌రియు పట్ నా రైల్వే స్టేష‌న్ నుండి న్యూ ఐఎస్‌బిటి – భాగం గా ఉంటాయి.  అయిదు సంవ‌త్స‌రాల లో ఈ ప‌థ‌కం పూర్తి అయ్యే ఆస్కారం ఉంది.  పట్ నా లో మ‌రియు ప‌రిస‌ర ప్రాంతాల లో ప్ర‌జా ర‌వాణా ను ఈ ప‌థ‌కం స‌ర‌ళ‌త‌రం చేయ‌నుంది.

ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భం గా జ‌గ్‌దీశ్‌పుర్‌-వారాణ‌సీ స‌హజ‌ వాయువు గొట్ట‌పు మార్గం లో భాగ‌మైన ఫూల్‌పుర్ నుండి పట్ నా మార్గాన్ని ప్రారంభించారు.  తాను ఈ రోజు శంకుస్థాప‌న చేసిన ప‌థ‌కాలు – తాను పునాదిరాయిని వేసే పథకాలను తానే ప్రారంభించాల‌న్న‌ – త‌న దార్శనికత లో మరొక ఉదాహరణ అని ప్ర‌ధాన మంత్రి చెప్తూ, ఈ ప‌థ‌కాని కి 2015వ సంవ‌త్స‌రం జులై లో నాంది ప‌లికింది తానే అని గుర్తు చేశారు.  ‘‘ఈ ప‌థ‌కం స్థానిక ప‌రిశ్ర‌మ‌ల కు గ్యాస్ స‌ర‌ఫ‌రా అయ్యేట‌ట్లు చూడ‌ట‌మే కాకుండా పట్ నా లో గొట్ట‌పు మార్గం ద్వారా గ్యాస్ స‌ర‌ఫ‌రా కు పూచీ ప‌డుతుంద‌ని, అంతేకాకుండా బ‌రౌనీ ఎరువుల క‌ర్మాగారాన్ని పున‌రుద్ధ‌రిస్తుంద‌’’ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  గ్యాస్ ఆధారిత‌మైన ఇకో సిస్ట‌మ్ ఈ ప్రాంతం లో యువ‌త‌ కు ఉద్యోగావ‌కాశాల ను క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

ఈ ప్రాంతాని కి తాను క‌ట్ట‌బెట్టిన ప్రాధాన్యాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, ‘‘ప్ర‌భుత్వం బిహార్ యొక్క మ‌రియు భార‌త‌దేశం లో తూర్పు ప్రాంతం యొక్క స‌ర్వ‌తోముఖ అభివృద్ధి కి దీక్ష‌బ‌ద్ధురాలైవుంద‌’’ని పేర్కొన్నారు.  ప్ర‌ధాన మంత్రి ఊర్జా గంగ యోజ‌న లో భాగం గా ఈ గ్యాస్ పైప్ లైన్ తో జెంషెడ్‌పుర్, రాంచీ, పట్ నా, క‌ట‌క్‌, భువ‌నేశ్వ‌ర్, ఇంకా వారాణ‌సీ ల‌ను జోడించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  పట్ నా న‌గ‌రాని కి మ‌రియు ప‌రిస‌ర ప్రాంతాల కు గొట్ట‌పు మార్గం ద్వారా గ్యాస్ స‌ర‌ఫ‌రా చేసే పట్ నా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ ప్రోజెక్టు ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు. 

ఈ ప‌థ‌కాలు సంధానాన్ని ప్ర‌త్యేకించి పట్ నా న‌గ‌రం లోను, న‌గ‌ర పరిసర ప్రాంతాల లోను ఇనుమ‌డింప చేయ‌డ‌మే కాకుండా న‌గ‌రం లోను, ఆ ప‌రిస‌ర ప్రాంతాల లోను శ‌క్తి ల‌భ్య‌త ను పెంపొందించ‌నున్నాయి.

పేద‌ల అభ్యున్న‌తి కి తాను కంక‌ణం క‌ట్టుకొన్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డిస్తూ, ‘‘అభివృద్ధి విష‌యం లో ఎన్‌డిఎ ప్ర‌భుత్వం దార్శ‌నిక‌త రెండు మార్గాల లో సాగుతోంది.  వాటి లో ఒక‌టోది మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కాగా రెండోది 70 సంవ‌త్స‌రాల‌ కు పైగా క‌నీస స‌దుపాయాలు అందుకోవ‌డం కోసం సంఘ‌ర్ష‌ణ కు లోన‌వుతున్న స‌మాజం లోని అల్పాద‌ర‌ణ కు మాత్ర‌మే నోచుకొన్న వ‌ర్గాల అభ్యున్న‌తి గా ఉంద‌’’ని వివ‌రించారు.

బిహార్ లో ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ విస్త‌ర‌ణ కు ఆయ‌న శ్రీ‌కారం చుడుతూ, ‘‘ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధిత మౌలిక స‌దుపాయాల అభివృద్ధి ప‌రంగా చూసిన‌ప్పుడు ఈ రోజు బిహార్ కు ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు’’ అన్నారు.  ఛ‌ప్ రా లోను, పూర్ణియా లోను కొత్త‌ గా వైద్య క‌ళాశాల‌ లు ఏర్పాటు కానున్నాయ‌ని, మ‌రి గ‌య లో, ఇంకా భాగ‌ల్‌పుర్ లో ఉన్న‌టువంటి వైద్య క‌ళాశాల‌ ల‌ను ఉన్న‌తీక‌రించ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న తెలిపారు.  దీనికి తోడు పట్ నా లో ఎఐఐఎమ్ఎస్ కూడా ఏర్పాటవుతోంద‌ని, అదే విధంగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ అవ‌స‌రాల‌ ను తీర్చ‌డం కోసం ఇంకొక ఎఐఐఎమ్ ను నెల‌కొల్పే దిశ‌గా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని వివ‌రించారు.

పట్ నా లో రివ‌ర్ ఫ్రంట్ డివెల‌ప్‌మెంట్ ఒక‌టో ద‌శ ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు.  క‌ర్ మాలీచెక్ సివ‌రేజ్ నెట్‌వ‌ర్క్ కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.  ఇది 96.54 కి.మీ. మేర‌కు విస్త‌రించివుంటుంది.  ప్ర‌ధాన మంత్రి బాఢ్, సుల్తాన్‌గంజ్‌, నౌగ‌ఛియా ల‌లో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు ల‌కు సంబంధించిన ప‌నుల‌ ను ప్రారంభించారు.  అలాగే, వివిధ ప్రాంతాల‌లో 22  ఎమ్ఎమ్ఆర్‌యుటి (‘అమృత్‌’)ప్రోజెక్టుల‌ కు కూడా ఆయన శంకుస్థాప‌న చేశారు.

పుల్‌వామా లో ఉగ్ర‌వాదుల దాడి అనంత‌రం దేశం లో రేకెత్తిన ఆవేద‌న‌ ను, ఆక్రోశాన్ని, ఇంకా శోకాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, ‘‘మీ అంత‌రంగం లో ర‌గిలిన జ్వాల వంటిదే నా హృద‌యం లోనూ రగులుతోంది’’ అని వ్యాఖ్యానించారు.  దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పట్ నా కు చెందిన కానిస్టేబుల్ సంజ‌య్ కుమార్ సిన్హా కు మరియు భాగ‌ల్‌పుర్ కు చెందిన ర‌త‌న్ కుమార్ ఠాకూర్ కు ప్ర‌ధాన మంత్రి నివాళులు అర్పించారు.  ఈ దుఃఖ ఘ‌డియ లో అమ‌ర‌వీరుల కుటుంబాల వెన్నంటి యావ‌త్తు దేశం నిలుస్తుంద‌ని ఆయ‌న అన్నారు.  

ప్ర‌ధాన మంత్రి బ‌రౌనీ శుద్ధి క‌ర్మాగారం విస్త‌ర‌ణ ప్రోజెక్టు కు చెందిన 9 ఎంఎంటి ఎవియు కు పునాది రాయి ని వేశారు.  అలాగే, దుర్గాపుర్ నుండి ముజ‌ఫ‌ర్‌పుర్ మ‌రియు పట్ నా వ‌ర‌కు సాగే పారాదీప్‌-హ‌ల్దియా-దుర్గాపుర్ ఎల్‌పిజి పైప్ లైన్ విస్త‌ర‌ణ ప‌నుల కు కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.  బ‌రౌనీ రిఫైన‌రీ లో ఎటిఎఫ్ హైడ్రోట్రీటింగ్‌ యూనిట్ (ఐఎన్‌డిజెఇటి)కి కూడా ప్ర‌ధాన మంత్రి పునాదిరాయి వేశారు.  ఈ ప‌థ‌కాలు న‌గ‌రం లో, ఆ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల లో శ‌క్తి ల‌భ్య‌త ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం లో దోహ‌దం చేయ‌నున్నాయి.

ప్ర‌ధాన మంత్రి ఈ ప‌ర్య‌ట‌న లో భాగం గా బ‌రౌనీ లో అమోనియా-యూరియా- ఎరువుల భ‌వ‌న స‌ముదాయం నిర్మాణ ప‌నుల‌ కు పునాది రాయి ని వేశారు.  దీనితో ఎరువుల ఉత్ప‌త్తి కి ఊతం అందనుంది.

దిగువ పేర్కొన్న సెక్ట‌ర్ ల‌లో విద్యుదీక‌రించిన రైలు మార్గాల‌ ను కూడా ప్ర‌ధాన మంత్రి ప్రారంభించారు:
బ‌రౌనీ- కుమేద్‌పుర్‌; 
ముజ‌ఫ‌ర్‌పుర్‌- ర‌క్సౌల్‌; 
ఫ‌తుహా-ఇస్లామ్ పుర్‌; 
బిహార్ శరీఫ్‌-దానియావాన్.

ఈ సంద‌ర్భం గా రాంచీ-పట్ నా  ఎసి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ను కూడా ప్రారంభించ‌డం జ‌రిగింది.  
బ‌రౌనీ ప‌ర్య‌ట‌న ముగిసిన అనంత‌రం ప్ర‌ధాన మంత్రి ఝార్‌ఖండ్ కు ప‌య‌నం అవుతారు.  ఆ రాష్ట్రం లో హ‌జారీబాగ్ ను మ‌రియు రాంచీ ని ఆయ‌న సంద‌ర్శిస్తారు.  హ‌జారీబాగ్‌, దుమ్‌ కా, ఇంకా ప‌లామూ ల‌లో ఆసుప‌త్రుల‌ కు ఆయ‌న శంకుస్థాప‌న చేయనున్నారు.   ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌ ను ప్ర‌ధాన మంత్రి ప్రారంభించనున్నారు.