ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కోల్ కతా లోని గౌడీయ మిషన్ అండ్ మఠ్ శతాబ్ది వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశ నాగరికతా సంబంధ ప్రవృత్తి చాలా కాలంగా చెక్కు చెదరక నిలచి ఉందంటే అందుకు కారణం భారతదేశం ఆధ్యాత్మికంగా చైతన్యవంతంగా ఉండడమేనన్నారు. ఈ ఆధ్యాత్మిక చైతన్యం యుగాల తరబడి పదిలంగా ఉందని ఆయన చెప్పారు.
ఈ చైతన్యం భాషను సైతం అధిగమించిందని ప్రధాన మంత్రి అన్నారు. “వైష్ణవ్ జన్ తో తేనే రే కహియే రే” అంటూ సాగే భజన దీనికి ఒక చక్కని ఉదాహరణ అని ఆయన తెలిపారు.
వైష్ణవ్ జన్ అనే పదాల స్థానంలో ఆధునిక సందర్భంలో జన్ ప్రతినిధి (ప్రజా ప్రతినిధులు) అనే పదాలను చేర్చవచ్చని ఆయన వివరించారు.
భారతీయ సమాజంలో సంస్కరణ ఎల్లప్పుడూ లోపలి నుంచి వచ్చిందని, దీనికి రాజా రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లు ప్రముఖ ఉదాహరణలు అని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
ఆ తరువాత గౌడీయ మఠ్ లో జరిగిన ప్రార్ధనలలో ప్రధాన మంత్రి పాలు పంచుకున్నారు.
Sharing my speech at the Gaudiya Mission and Math. https://t.co/Prt1L0xTwQ
— Narendra Modi (@narendramodi) February 21, 2016