Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం రాష్ట్ర ప్రజలకు రాష్ట్రఅవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం రాష్ట్ర ప్రజలకు వారి రాష్ట్రఅవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

“అరుణాచల్‌ప్రదేశ రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు, రాష్ట్రం రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ప్రార్థిస్తున్నా. ప్రజల ఆశలు, ఆశయాలను నేరవేర్చటంలో అరుణాచల్‌ప్రదేశ ప్రభుత్వం కృత‌నిశ్చయంతో పనిచేయాలని కోరుకుంటున్నా. వారికి కూడా నా శుభాకాంక్షలు.

మిజోరం ప్రజలకు కూడా రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో అభివృద్ధిలో మిజోరం కొత్త మెట్లు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నా” అని ప్రధాని తెలిపారు.