“భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశం గా తీర్చిదిద్దే దిశ గా ఇది ఒక పెద్ద అడుగు. దీని లోని పథకాలు ప్రజల జీవితాలను స్పర్శిస్తున్నాయి.
అనేక రంగాల ప్రయోజనాల పట్ల ఈ బడ్జెటు శ్రద్ధ వహిస్తోంది. ఈ రంగాల లో.. రైతుల సంక్షేమం మొదలుకొని మధ్యతరగతి దాకా, ఆదాయపు పన్ను మినహాయింపు నుండి మౌలిక సదుపాయాల రంగం వరకు, తయారీ రంగం నుండి ఎంఎస్ఎంఇ రంగం వరకు, గృహ నిర్మాణ రంగం నుండి ఆరోగ్య సంరక్షణ రంగం వరకు, మరి అలాగే ఒక ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం కోసం అధిక వేగ గతి వరకు.. ఉన్నాయి.
మిత్రులారా,
ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పథకాలు దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి పైన సకారాత్మక ప్రభావాన్ని చూపాయి. ఆయుష్మాన్ భారత్ యోజన లాభాలు 50 కోట్ల మంది పేద ప్రజల కు అందుతాయి. 21 కోట్ల మంది ప్రజలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన, ఇంకా ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ల నుండి లబ్ది ని పొందారు. 9 కోట్ల కు పైగా కుటుంబాలు స్వచ్ఛ్ భారత్ మిశన్ ప్రయోజనాల ను అందుకున్నాయి. 6 కోట్ల కు పైగా కుటుంబాలు ఉజ్జ్వల యోజన లో భాగం గా ఉచిత గ్యాస్ కనెక్షన్ ను అందుకున్నాయి. 1.5 కోట్ల కుటుంబాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగంగా తమకంటూ ఒక సొంత పక్కా ఇంటి ని పొందాయి.
ప్రస్తుతం ఈ బడ్జెటు ద్వారా 12 కోట్ల మంది రైతులు, వారి కుటుంబాలు, 3 కోట్ల మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారు లతో పాటు 30 నుండి 40 కోట్ల మంది శ్రామికులు ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందనున్నారు.
మిత్రులారా,
ప్రభుత్వం చేసిన కృషి ఫలితం గా పేదరికం నిర్మూలన వేగాన్ని అందుకొని దూసుకుపోతోంది. లక్షల కోట్ల ప్రజల ను పేదరికం సంకెళ్ళ లో నుండి బయటకు తీసుకు వస్తుండటం తో పాటు వారి స్థాయి ని మధ్య తరగతి మరియు నవ మధ్య తరగతి కి పెంచడాన్ని చూస్తే ఆనందం గా ఉంది. ఈ బడా వర్గం ప్రస్తుతం తన కలల ను పండించుకోవాలని, దేశాభివృద్ధి కి ప్రేరణ గా నిలవాలని ఆకాంక్షిస్తోంది. ఈ పెరుగుతున్నటువంటి మధ్యతరగతి ఆశల కు, ఆకాంక్షల కు రెక్కలు తొడగాలని, వారికి మద్దతు ను అందించాలన్న నిబద్దత ను ప్రభుత్వం ప్రదర్శించింది.
ఈ బడ్జెటు లో ఆదాయపు పన్ను తగ్గింపు ను పొందినందుకు మధ్యతరగతి ని మరియు జీతం పొందుతున్న మధ్య తరగతి ని నేను అభినందిస్తున్నాను. మధ్యతరగతి, ఇంకా ఎగువ మధ్యతరగతి కి చెందిన వారు చట్టాన్ని అనుసరిస్తూ, పన్నుల ను చెల్లిస్తున్నందుకు వారి నిజాయతీ కి ఇవే ధన్యవాదాలు. పన్నుల రూపేణా అందిన ఈ ధనాన్ని ప్రజా సంక్షేమ పథకాల కోసం, పేదల అభ్యున్నతి కోసం వినియోగించడం జరుగుతోంది. 5 లక్షల రూపాయల వరకు ఆదాయం పై ఎటువంటి ఆదాయపు పన్ను ను విధించరాదనేది చాలా సంవత్సరాలు గా పెండిండు పడినటువంటి డిమాండు గా ఉంటూ వచ్చింది. ఇన్ని సంవత్సరాలు గా పెండింగు పడినటువంటి ఈ డిమాండు ను మా ప్రభుత్వం తీర్చివేసింది.
మిత్రులారా,
వేరు వేరు ప్రభుత్వాలు రైతుల కోసం విభిన్నమైనటువంటి ప్రణాళికల తో ముందుకు వచ్చాయి. అయితే, ఎగువ స్థాయి లోని 2-3 కోట్ల మంది రైతులు మినహా పెద్ద సంఖ్య లో కర్షకులు వీటి పరిధి లోకి రాలేదు. ఇప్పుడు పిఎం కిసాన్ నిధి వస్తోంది; దీనినే పిఎం-కిసాన్ యోజన గా కూడా వ్యవహరిస్తున్నారు.. ఇది 5 ఎకరాల భూమి లేదా అంతకు తక్కువ భూమి గల రైతుల కు సహాయకారి కాగలదు. రైతుల శ్రేయస్సు కోసం స్వాతంత్య్రం అనంతర కాలం నుండి తీసుకొన్నటువంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది. రైతుల కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. వ్యావసాయిక జీవనం మరియు గ్రామీణ జీవితం తో ముడిపడినటువంటి పశు పోషణ, గోవుల సంక్షేమం, మత్స్య పరిశ్రమ కోసం ప్రత్యేక విభాగం వంటి రంగాలన్నింటి ని గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. నేశనల్ కామధేను మిశన్ తో పాటు, విడిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిశరీస్ ల ఏర్పాటు కోట్లాది మంది రైతుల కు జీవనోపాధి అవకాశాల ను పెంచడం లో తోడ్పడనుంది. ఇది మత్స్యకారుల కు చేయూత ను ఇవ్వనుంది. రైతు కు సాధికారిత ను కల్పించేందుకు, అతడి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వనరుల ను, యంత్ర పరికరాల ను అదించాలన్నది మేం చిత్తశుద్ధి తో చేస్తున్నటువంటి ప్రయత్నం గా ఉంది. ఈ రోజు న తీసుకున్న నిర్ణయాలు ఈ ఉద్యమానికి ఒక ప్రేరణ ను ఇస్తాయి.
మిత్రులారా,
భారతదేశం వివిధ రంగాల లో అభివృద్ధి చెందుతోంది. కొత్త పథకాలు వస్తున్నాయి. కొత్త కొత్త రంగాల ను అన్వేషించడం జరుగుతోంది. ఈ రంగాల లో తలమునకలైన ప్రజల సంఖ్య చాలా రెట్లు పెరిగింది. అయితే, అసంఘటిత రంగం- అది శ్రామికులు కావచ్చు, ఇళ్ళ లో పని చేసేవారు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, లేదా సమాజం లోని భారీ సంఖ్య లోని శ్రామిక వర్గం కావచ్చు- వారు అశ్రద్ధ కు లోనయ్యారు. వారిని వారి విధి వ్రాత కు విడచిపెట్టడం జరిగింది. మన దేశం లో సుమారు 40-42 కోట్ల మంది అసంఘటిత రంగ శ్రామికులు ఉన్నారు. వారికి 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన ధన యోజన ఒక ప్రధానమైన అండగా నిలబడనుంది. వారు ఆయుష్మాన్ భారత్ యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఇంకా తదితర సంక్షేమ పథకాల లాభాలే కాకుండా వారి యొక్క దైనందిన ఖర్చుల ను భరించుకోవడం కోసం పింఛను ను కూడా అందుకోనున్నారు.
సోదరులు మరియు సోదరీమణులారా,
అభివృద్ధి ఫలాలను వరుస లో చివరన ఉన్న వారి వద్ద కు చేర్చటం కోసం మా ప్రభుత్వం కృషి చేస్తూ వస్తోంది. జంతు శిక్షకులు, పాముల ను ఆడించేవారు, బంజారా లు, తదితర సంచార సముదాయాల కోసం ఒక సంక్షేమ మండలి ని ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం. తగిన విధం గా గుర్తింపు లభించిన అనంతరం అభివృద్ధి ఫలాలు ఈ సముదాయాల కు శర వేగం గా చేరుకోగలవన్న ఆశాభావం నాలో ఉంది.
మిత్రులారా,
వ్యాపారుల కు మరియు వాణిజ్య రంగం లోని వారికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేసే అంశం లో మేం కొంత వరకు ముందంజ వేశాం. వ్యాపార వర్గాలు, వర్తకులు, ఇంకా ఇతర అధికారుల అవసరాల ను తీర్చడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆదేశం తో డిఐపిపి ని పునర్ నిర్మించడమైంది. ఇకపై ఈ విభాగాన్ని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోశన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గా వ్యవహరించడం జరుగుతుంది.
తదుపరి దశాబ్ది ముగిసేసరికి ఏమేమి అవసరాలు ఉంటాయి ?, ఏయే లక్ష్యాల ను సాధించాలనేది దృష్టి లో పెట్టుకొని ఈ బడ్జెటు లో పథకాల ను పొందుపరచినందుకు నాకు ఆనందం గా ఉంది. ఈ బడ్జెటు పేదల కు సాధికారిత ను, రైతుకు ఉత్సాహాన్ని , శ్రామికుల కు గౌరవాన్ని అందించగలుగుతుంది. ఇది మధ్యతరగతి ఆకాంక్షల ను నెరవేరుస్తుంది. నిజాయతీపరులైన పన్ను చెల్లింపుదారుల కు గౌరవాన్ని ఇస్తుంది. వ్యాపారస్తుల కు సాధికారిత ను కల్పిస్తుంది. మౌలిక రంగం వేగం గా అభివృద్ధి చెందేందుకు కూడా తోడ్పడుతుంది. ఈ బడ్జెటు దేశం లోని 130 కోట్ల మంది ప్రజలు ఒక ‘న్యూ ఇండియా’ లక్ష్యాల ను అందుకొనే దిశ గా పయనించేందుకు వారి లో శక్తి ని నింపుతుంది. ఇది అందరి జీవితాల ను స్పృశిస్తూ, సర్వసమ్మిళితం గాను, సర్వవ్యాప్తం గాను ఉంది. దీని ని అందరి అభివృద్ధి కోసం అంకితం చేయడం జరిగింది.
ఒక ఉత్తమమైన బడ్జెటు ను అందించినందుకు నా మిత్రులు అరుణ్ గారు, పీయూష్ గారు మరియు వారి బృందాని కి మరొక్కమారు అనేకానేక ధన్యవాదాలు.”
**