ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని సిహోర్ లో గురువారం కిసాన్ కళ్యాణ్ మేళాలో పాల్గొని, రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వివరిస్తారు.
‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ మార్గదర్శక సూత్రాలను కూడా ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు. పంట బీమా రంగంలో ఒక మేలు మలుపు అని చెప్పదగిన ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం గత నెలలో ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి అమలులోకి రానుంది. ఖరీఫ్ పంటలు వేసే రైతులు కేవలం 2 శాతం ప్రీమియమ్, రబీ పంటల రైతులు అయితే 1.5 శాతం ప్రీమియమ్ చెల్లించడం ఈ పథకం విశిష్టత. వాణిజ్య, తోట పంటల రైతులు అయితే 5 శాతం ప్రీమియం వార్షిక ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
ఈ పథకానికి ప్రభుత్వ సబ్సిడీపై ఎటువంటి గరిష్ఠ పరిమితి లేదు. ఇంతకు ముందున్న పథకాలలో ప్రీమియమ్ కు సంబంధించి అమలైన పరిమితి నిబంధన రైతులకు తక్కువ మొత్తాలలో క్లెయిమ్‌ల చెల్లింపులకు దారి తీసింది. ఆ పరిమితిని ఇప్పుడు తొలగించారు. రైతులు ఎటువంటి తగ్గింపు లేకుండా మొత్తం పంటకు వారు బీమా చేసిన పూర్తి మొత్తాన్ని క్లెయిమ్ గా పొందగలుగుతారు.
ఎంపిక చేసిన లబ్దిదారులకు పంట బీమా సెటిల్మెంట్ క్లెయిమ్ లను ప్రధాన మంత్రి అందజేస్తారు. అలాగే, సాయిల్ హెల్త్ కార్డులను కూడా ఆయన పంపిణీ చేస్తారు.
***