Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేశ‌న‌ల్ మ్యూజియ‌మ్ ఆఫ్ ఇండియన్ సినిమా ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

నేశ‌న‌ల్ మ్యూజియ‌మ్ ఆఫ్ ఇండియన్ సినిమా ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

నేశ‌న‌ల్ మ్యూజియ‌మ్ ఆఫ్ ఇండియన్ సినిమా ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

నేశ‌న‌ల్ మ్యూజియ‌మ్ ఆఫ్ ఇండియన్ సినిమా ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి


నేశ‌న‌ల్ మ్యూజియ‌మ్ ఆఫ్ ఇండియన్ సినిమా నూత‌న భ‌వ‌నాన్ని ముంబ‌యి లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం గా హాజ‌రైన వారి లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి. విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ణ‌వీస్, స‌హాయ మంత్రులు శ్రీ రాందాస్ అఠావలే మ‌రియు కర్నల్ (రిటైర్డ్‌) రాజ్యవర్ధన్ రాఠౌడ్ ల‌తో పాటు ఇత‌ర ప్ర‌ముఖులు కూడా ఉన్నారు.

ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో భార‌తీయ చ‌ల‌నచిత్ర రంగాన్ని గురించి యువ‌త‌రం అర్థం చేసుకొనే మ‌రియు నేర్చుకొనే, ఇంకా అద్భుత అవ‌కాశాన్ని నేశ‌న‌ల్ మ్యూజియ‌మ్ ఆఫ్ ఇండియన్ సినిమా అందిస్తుంద‌న్నారు. భార‌తీయ చ‌ల‌నచిత్ర ప‌రిశ్ర‌మ చ‌రిత్ర తో పాటు, వివిధ చ‌ల‌నచిత్ర ప్ర‌ముఖుల సంద‌ర్శ‌న‌ల తాలూకు గాథ‌ల ను ఈ మ్యూజియ‌మ్ స‌మ‌గ్రం గా స‌మాచారాన్ని ఇస్తుంద‌ని కూడా ఆయ‌న తెలిపారు.

చ‌ల‌న చిత్రం మ‌రియు స‌మాజం ఒక‌దానిని మరొక‌టి ప్ర‌తిబింబిస్తాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెబుతూ, స‌మాజం లో జ‌రిగేదంతా తెర పైన చ‌ల‌న‌చిత్రాలు ప్ర‌తిఫ‌లింప చేస్తున్నాయ‌ని, మ‌రి అలాగే, చ‌ల‌న చిత్రాల లోని దృశ్యాలు సైతం స‌మాజం లో ప్ర‌తిబింబిస్తున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

ధోర‌ణుల‌ ను గురించి ఆయ‌న మాట్లాడుతూ, స‌మ‌స్య తో పాటు, ప‌రిష్కారాన్ని కూడా చెబుతున్న అనేక చిత్రాలు ప్ర‌స్తుతం రూపొందుతున్నాయని, నిస్స‌హాయ‌త‌ ను మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించిన‌టు వంటి ఇదివ‌ర‌క‌టి సంవ‌త్స‌రాల తో పోలిస్తే ఇది ఒక సాకారాత్మ‌క‌మైన సంకేత‌మ‌ని ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం ప్ర‌స్తుతం తాను ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ ల‌కు తానే స్వ‌యంగా ప‌రిష్కార మార్గాల ను అన్వేషించే విశ్వాసాన్ని క‌లిగి ఉంద‌ని, ఇది స‌మ‌స్య‌ల తో ఢీకొని, వాటిని ప‌రిష్క‌రించే స‌త్తా, విశ్వాసాలు క‌లిగి ఉన్న‌టువంటి ఒక ‘న్యూ ఇండియా’ కు సూచిక అని ఆయ‌న అన్నారు.

భార‌తీయ చ‌ల‌నచిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తమవుతూ ఉండ‌టాన్ని ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా భార‌తదేశ గీతాల‌ ను పాడ గ‌లిగిన‌టువంటి వేరు వేరు ప్ర‌పంచ నాయ‌కుల తో తాను ముఖాముఖి అయిన సంగ‌తిని ఆయ‌న ప్ర‌స్తావించారు.

యువ‌త‌రం ఊహ‌ల కు ద‌ర్ప‌ణం ప‌ట్టిన భూమిక ల‌ను ఆవిష్క‌రిస్తున్నందుకు గాను, చ‌ల‌నచిత్ర రంగ సోద‌రీ సోద‌రుల‌ కు ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర‌హా పాత్ర‌ల కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భావాన్ని రేకెత్తించే స్వ‌భావం ఉండ‌టం వ‌ల్ల భార‌త‌దేశం లో యువ‌జ‌నులు ప్ర‌స్తుతం ఒక్క బ్యాట్‌మ‌న్ కు మాత్ర‌మే అభిమానులు కాద‌ని, వారు బాహుబ‌లి కి కూడా అభిమానులయ్యార‌ని ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం యొక్క సాఫ్ట్ ప‌వ‌ర్ ను పెంపొందింప చేయ‌డం లో భార‌తీయ చ‌ల‌న చిత్రాల‌ కు ఒక పెద్ద పాత్ర ఉంద‌ని, దీని విశ్వ‌స‌నీయ‌త మ‌రియు ప్ర‌పంచం అంత‌టా బ్రాండ్ ఇండియా ను నిర్మించ గ‌ల సామ‌ర్ధ్యం ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. సినిమా ద్వారా పారిశుధ్యం, మ‌హిళా సాధికారిత‌, క్రీడ‌లు వంటి ముఖ్య‌మైన సామాజిక అంశాలు ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌ కు చేరువ‌గా వెళుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. జాతి నిర్మాణం లో సినిమా ఒక ముఖ్య భూమిక ను పోషిస్తుంద‌ని, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావ‌న‌ ను బ‌ల‌ప‌రుస్తుంద‌ని వివ‌రించారు. దేశం లో ప‌ర్య‌ట‌న రంగం యొక్క వృద్ధి కి తోడ్పాటు ను అందించేట‌టువంటి భారీ అవ‌కాశాలు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ లో ఉన్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

దేశం లోని వేర్వేరు ప్రాంతాల లో సినిమా చిత్రీక‌ర‌ణ కు ఆమోదాలు మంజూరు చేయ‌డం కోసం ఒకే చోట అనుమ‌తులు ఇచ్చే వ్య‌వ‌స్థ ను ప్ర‌వేశ పెట్ట‌డం ద్వారా చిత్రీక‌ర‌ణ లో సౌల‌భ్యాన్ని స‌మ‌కూర్చేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఫిల్మ్ పైర‌సీ స‌మ‌స్య ను అడ్డుకోవ‌డం కోసం 1952 వ సంవ‌త్స‌రం నాటి సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ను స‌వ‌రించ‌డం పైన కూడా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

అలాగే, నేశ‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ ఫ‌ర్ యానిమేశ‌న్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గేమింగ్ అండ్‌ కామిక్స్ ను ఏర్పాటు చేసే దిశ‌గా కూడా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. క‌మ్యూనికేశ‌న్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కు పూర్తి గా అంకిత‌మైన ఒక విశ్వ‌విద్యాల‌యం ప్ర‌స్తుత త‌క్ష‌ణావ‌స‌ర‌మ‌ని, ఈ అంశం లో సూచ‌న‌ లు మ‌రియు స‌హ‌కారం అందించ‌వ‌ల‌సింద‌ని చ‌ల‌నచిత్ర రంగ ప్ర‌ముఖుల‌ కు విజ్ఞ‌ప్తి చేశారు. దావోస్ స‌మిట్ మాదిరి గానే, గ్లోబ‌ల్ ఫిల్మ్‌ స‌మిట్ ను కూడా నిర్వ‌హించాల‌ని, అది భార‌తీయ చ‌ల‌న చిత్రాల కు వున్న విప‌ణి ని విస్త‌రించ‌డం పై శ్ర‌ద్ధ తీసుకో గ‌లుగుతుంద‌ని కూడా ఆయ‌న సూచించారు.